భారతీయ సంస్కృతి

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. […]

Read More

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద […]

Read More

భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము

భగవద్గీత తెలుగులో అర్థం 16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. […]

Read More

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం […]

Read More

భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము

భగవద్గీత తెలుగులో అర్థం 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ […]

Read More

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు.  కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.  ఋషులు ఎన్నో […]

Read More

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 12  వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు […]

Read More

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం […]

Read More

భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 10  వ అధ్యాయం –విభూతి యోగము నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి, […]

Read More

భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా […]

Read More
TOP