
భగవద్గీత తెలుగులో అర్థం
ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.
-భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం చేయనన్న అర్జునుడి విషాదాన్ని పోగొట్టి, జ్ఞానాన్ని కలుగచేయడానికి, కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన విషయమే భగవద్గీత. సంజయుడు దృతరాష్ట్రుడి సారథి. ఇతడికి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టి సాయంతో గీతా బోధనను దృతరాష్ట్రుడికి వినిపించాడు.
మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వములోని 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు. ప్రపంచ సాహిత్యంలోనే కేవలం భగవద్గీత గ్రంథానికి మాత్రమే జయంతిని జరుపుతారు. గీత కేవలం పారాయణ గ్రంథం కాదు. గీతా సందేశాన్ని తెలుసుకుని, ఆచరించాలి. అందుకే అది ఆచరణ గ్రంథం. ఆచరిస్తే ఫలితం వస్తుంది.
1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
7 వ అధ్యాయం -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9 వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
11 వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15 వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16 వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము