శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో
- బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు
- అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు
- అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు
- హనుమ, వాలి సుగ్రీవుల కథను వివరించే కిష్కిండ కాండ నుండి 5 నామాలు
- ఆంజనేయుని లంకా గమనం వివరించే సుందరకాండ నుండి 8 నామాలు
- రామ రావణ యుద్ధాన్ని వివరించే యుద్ధ కాండ నుండి 25 నామాలు
- యుద్ధానంతరం జరిగే పరిణామాలను వివరించే ఉత్తర కాండ నుండి 22 నామాలు ఉంటాయి.
బాలకాండం-
- శుద్ధబ్రహ్మపరాత్పర రామ |
పవిత్రమైన వేదాలను చక్కగా అభ్యసించిన సర్వాంతర్యామి అయిన రామా
- కాలాత్మక పరమేశ్వర రామ |
కాలాత్మకుడైన పరమేశ్వర తత్వమును కలిగిన రామా
- శేషతల్పసుఖనిద్రిత రామ |
ఆదిశేషునిపై సుఖముగా నిద్రించిన రామా
- బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
బ్రహ్మ మొదలైన దేవతలచేత ప్రార్థింపబడిన రామా
- చండకిరణకులమండన రామ |
సూర్యవంశమునకు అలంకారమై అవతరించిన రామా
- శ్రీమద్దశరథనందన రామ |
దశరథ మహారాజుకు కుమారుడవైన రామా
- కౌసల్యాసుఖవర్ధన రామ |
తల్లి కౌసల్యకు కుమారుడవై, ఆమెకు ఆనందమును పెంపొందించిన రామా
- విశ్వామిత్రప్రియధన రామ |
విశ్వామిత్రునకు అత్యంత ప్రియ శిష్యుడవైన రామా
- ఘోరతాటకాఘాతక రామ |
క్రూరురాలైన తాటక అను రాక్షసిని సంహరించిన రామా
- మారీచాదినిపాతక రామ |
మారీచాది రాక్షసులను హతమార్చిన రామా
- కౌశికమఖసంరక్షక రామ |
విశ్వామిత్రుని యజ్ఞమును సంరక్షించిన రామా
- శ్రీమదహల్యోద్ధారక రామ |
అహల్యను శాప విముక్తురాలిని చేసిన రామా
- గౌతమమునిసంపూజిత రామ |
గౌతమ మునిచే పూజింపబడిన రామా
- సురమునివరగణసంస్తుత రామ |
దేవతలు, మునుల చేత స్తుతింపబడిన రామా
- మిథిలాపురజనమోహక రామ |
మిథిలా పురములోని జనులను ఆకట్టుకున్న రామా
- విదేహమానసరంజక రామ |
జనకమహారాజు మనస్సును రంజింపజేసిన రామా
- త్ర్యంబకకార్ముకభంజక రామ |
శివ ధనుస్సును విరిచిన రామా
- సీతార్పితవరమాలిక రామ |
సీతా దేవీచే వరమాల అర్పింపబడిన రామా
- కృతవైవాహికకౌతుక రామ |
వివాహ సమారంభాలను చేయించిన రామా
- భార్గవదర్పవినాశక రామ |
పరశురాముని గర్వమును నశింపజేసిన రామా
- శ్రీమదయోధ్యాపాలక రామ |
అయోధ్యానగరమును పరిపాలించిన రామా
అయోధ్యాకాండం-
- అగణితగుణగణభూషిత రామ |
లెక్కించలేనన్ని మంచి గుణములతో శోభిల్లే రామా
- అవనీతనయాకామిత రామ |
భూపుత్రి అయిన సీతమ్మ కోరుకున్న రామా
- రాకాచంద్రసమానన రామ |
నిండు చంద్రుని వంటి ముఖము కలిగిన రామా
- పితృవాక్యాశ్రితకానన రామ |
తండ్రి మాటను అనుసరించి అడవికి వెళ్ళిన రామా
- ప్రియగుహవినివేదితపద రామ |
ఇష్టమైన గుహునికి తన పాదాలను అందించిన రామా
- నావికధావిత మృదుపద రామా |
గుహునిచే కడగబడిన మృదువైన పాదాలు గల రామా
- తత్‍క్షాళితనిజమృదుపద రామ |
గుహుని చేత కడుగబడిన మెత్తని పాదములుకల రామా
- భరద్వాజముఖానందక రామ |
భారధ్వాజ మహర్షికి సంతోషము కలిగించిన రామా
- చిత్రకూటాద్రినికేతన రామ |
చిత్రకూట పర్వత ప్రాంతంలో నివసించిన రామా
- దశరథసంతతచింతిత రామ |
దశరథునిచే ఎల్లప్పుడూ ఆలోచించబడ్డ రామా
- కైకేయీతనయార్థిత రామ |
భరతుని చేత అర్ధించబడిన రామా
- విరచితనిజపితృకర్మక రామ |
దశరథునికి పితృ కర్మలు నెరవేర్చిన రామా
- భరతార్పితనిజపాదుక రామ |
భరతునికి తన పాదుకలు ఇచ్చిన రామా
అరణ్యకాండం-
- దండకావనజనపావన రామ |
దండకారణ్యంలోని మునిజనులను పవిత్రులను చేసిన రామా
- దుష్టవిరాధవినాశన రామ |
దుష్టుడైన విరాధుడిని హతమార్చిన రామా
- శరభంగసుతీక్ష్ణార్చిత రామ |
శరభంగుడు, సుతీక్ష్ణ మహర్షిచే ప్రార్థించబడిన రామా
- అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహముచే వర్ధిల్లిన రామా
- గృధ్రాధిపసంసేవిత రామ |
గ్రద్ధల రాజైన జటాయువుచేత సేవించబడిన రామా
- పంచవటీతటసుస్థిత రామ |
పంచవటి ప్రాంతమందు నివసించిన రామా
- శూర్పణఖార్తివిధాయక రామ |
శూర్పణఖకు దుఃఖమును కలిగించిన రామా
- ఖరదూషణముఖసూదక రామ |
ఖర దూషణాది రాక్షసులను సంహరించిన రామా
- సీతాప్రియహరిణానుగ రామ |
సీతకు ప్రియమైన బంగారు జింకను వెంబడించిన రామా
- మారీచార్తికృదాశుగ రామ |
జింక రూపంలో ఉన్న మారీచుని సంహరించిన రామా
- వినష్టసీతాన్వేషక రామ |
అపహరించిన సీతను వెదికిన ఓ రామా
- గృధ్రాధిపగతిదాయక రామ |
జటాయువునకు సద్గతిని ప్రసాదించిన రామా
- శబరీదత్తఫలాశన రామ |
శబరి ఇచ్చిన ఫలములను తిన్న రామా
- కబంధబాహుచ్ఛేదన రామ |
రాక్షసుడైన కబంధుడి బాహువులను ఖండించిన రామా
కిష్కింధాకాండం-
- హనుమత్సేవితనిజపద రామ |
హనుమంతునిచే సేవించబడిన పాదములు కల ఓ శ్రీరామా
- నతసుగ్రీవాభీష్టద రామ |
సుగ్రీవుని కోర్కెను నెరవేర్చిన రామా
- గర్వితవాలిసంహారక రామ |
గర్వించిన వాలిని సంహరించిన రామా
- వానరదూతప్రేషక రామ |
వానరుడైన హనుమంతుని దూతగా పంపిన రామా
- హితకరలక్ష్మణసంయుత రామ |
తన క్షేమం కోరే లక్ష్మణునితో కూడి ఉన్న రామా
సుందరకాండం-
- కపివరసంతతసంస్మృత రామ |
హనుమచే నిరంతరము స్మరింపబడిన రామా
- తద్గతివిఘ్నధ్వంసక రామ |
హనుమకు దారిలోని విఘ్నాలను నశింపజేసిన రామా
- సీతాప్రాణాధారక రామ |
సీతమ్మ ప్రాణమునకు ఆధారమైన రామా
- దుష్టదశాననదూషిత రామ |
దుష్టుడైన పది తలల రావణుని ఖండించిన రామా
- శిష్టహనూమద్భూషిత రామ |
శిష్టుడైన హనుమంతుడిని కొనియాడిన రామా
- సీతావేదితకాకావన రామ |
సీతచే కాకావన వృత్తాంతంలో వివరించబడిన రామా
- కృతచూడామణిదర్శన రామ |
సీతమ్మ పంపిన చూడామణిని చూసిన రామా
- కపివరవచనాశ్వాసిత రామ |
కపిశ్రేష్టుడైన హనుమంతుని మాటలచే ఓదార్చబడిన రామా
యుద్ధకాండం-
- రావణనిధనప్రస్థిత రామ |
రావణుని సంహరించడానికి లంకకు బయలుదేరిన రామా
- వానరసైన్యసమావృత రామ |
వానర సైన్యముతో చుట్టబడి ఉన్న రామా
- శోషితసరిదీశార్థిత రామ |
ఎండిపోతున్న నదుల రాజు సముద్రునిచే అర్థింపబడిన రామా
- విభీషణాభయదాయక రామ
విభీషణునికి అభయమిచ్చిన రామా
- పర్వతసేతునిబంధక రామ |
కొండరాళ్లతో వారధిని నిర్మింపజేసిన రామా
- కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
కుంభకర్ణుడి తలను ఖండించిన రామా
- రాక్షససంఘవిమర్దక రామ |
రాక్షస మూకలను నశింపజేసిన రామా
- అహిమహిరావణచారణ రామ |
అహిరావణుడు, మహి రావణుడు అనే రాక్షసులను తన వైపునకు నడిపించుకొనిన రామా
- సంహృతదశముఖరావణ రామ |
పది తలల రావణుని సంహరించిన రామా
- విధిభవముఖసురసంస్తుత రామ |
బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలచే స్తుతించబడిన రామా
- ఖఃస్థితదశరథవీక్షిత రామ |
ఆకాశంలోని దశరథునిచే చూడబడిన రామా
- సీతాదర్శనమోదిత రామ |
సీతమ్మను చూసి సంతోషించిన రామా
- అభిషిక్తవిభీషణనుత రామ |
పట్టాభిషిక్తుడైన విభీషణుడిచే నమస్కరించబడిన రామా
- పుష్పకయానారోహణ రామ |
సీతాసమేతుడవై పుష్పక విమానమును అధిరోహించిన రామా
- భరద్వాజాదినిషేవణ రామ |
భరధ్వాజాదులను దర్శించుకున్న రామా
- భరతప్రాణప్రియకర రామ |
భరతునికి ప్రాణాలంత ప్రీతి పాత్రుడవైన రామా
- సాకేతపురీభూషణ రామ |
అయోధ్యాపురమునకు భూషణమైన రామా
- సకలస్వీయసమానత రామ |
అందరినీ తన వాళ్ళుగా సమానంగా చూసిన రామా
- రత్నలసత్పీఠస్థిత రామ |
రత్నఖచిత సింహాసనంపై కూర్చుని ఉన్న రామా
- పట్టాభిషేకాలంకృత రామ |
రాజ్య పట్టాభిషేకంతో అలంకరించబడిన రామా
- పార్థివకులసమ్మానిత రామ |
రాజులందరిచేతా సన్మానింపబడిన రామా
- విభీషణార్పితరంగక రామ |
విభీషణుడికి రంగనాథుని బహుకరించిన రామా
- కీశకులానుగ్రహకర రామ |
సూర్య వంశాన్ని అనుగ్రహించిన రామా
- సకలజీవసంరక్షక రామ |
సకల జీవులను సంరక్షించిన రామా
- సమస్తలోకాధారక రామ |
సమస్త లోకములకు ఆధారమైన రామా
ఉత్తరకాండం-
- ఆగతమునిగణసంస్తుత రామ |
వచ్చిన మునీశ్వరులచే స్తుతించబడిన రామా
- విశ్రుతదశకంఠోద్భవ రామ |
పది తలల రావణుడి గురించి తెలుసుకున్న రామా
- సీతాలింగననిర్వృత రామ |
సీతమ్మను ఆలింగనం చేసుకుని ఆనందించిన రామా
- నీతిసురక్షితజనపద రామ |
ధర్మ బద్ధంగా తన జనులను పాలించిన రామా
- విపినత్యాజితజనకజ రామ |
సీతమ్మను అడవిలో విడిచి పెట్టిన రామా
- కారితలవణాసురవధ రామ |
శతృఘ్నునిచేత లవణాసుర వధ చేయించిన రామా
- స్వర్గతశంబుకసంస్తుత రామ |
స్వర్గానికి చేరిన శంబూకునిచే స్తుతించబడిన రామా
- స్వతనయకుశలవనందిత రామ |
నీ కుమారులైన కుశలవులను చూసి ఆనందించిన రామా
- అశ్వమేధక్రతుదీక్షిత రామ |
అశ్వమేధ యాగమునకై దీక్ష వహించిన రామా
- కాలావేదితసురపద రామ |
కాలుడిచే తన నిజ తత్వాన్ని తెలుసుకున్న రామా
- ఆయోధ్యకజనముక్తిద రామ |
అయోధ్యా జనులకు ముక్తిని ప్రసాదించిన రామా
- విధిముఖవిబుధానందక రామ |
బ్రహ్మ మొదలైన దేవతలకు ఆనందమును కలుగజేసిన రామా
- తేజోమయనిజరూపక రామ |
ప్రకాశవంతమైన నిజ రూపము కలిగిన రామా
- సంసృతిబంధవిమోచక రామ |
పుట్టుక మరణాల నుండి విముక్తి కలిగించే రామా
- ధర్మస్థాపనతత్పర రామ |
ధర్మాన్ని స్థాపించడానికి కృషి చేసిన రామా
- భక్తిపరాయణముక్తిద రామ |
భక్తులైన వారికి ముక్తిని కలిగించే రామా
- సర్వచరాచరపాలక రామ |
సమస్త జీవరాశిని పాలించే రామా
- సర్వభవామయవారక రామ |
అన్ని భవరోగాలనూ నివారించే రామా
- వైకుంఠాలయసంస్థిత రామ |
వైకుంఠమునందు కొలువై ఉన్న రామా
- నిత్యానందపదస్థిత రామ |
నిత్యానంద పదవిలో స్థితుడై ఉన్న రామా
- రామ రామ జయ రాజా రామ |
రామా రామా రాజా రామా విజయుడవు కమ్ము
- రామ రామ జయ సీతా రామ ||
రామా రామా సీతా రామా విజయుడవు కమ్ము
ఇతి శ్రీ లక్ష్మణాచార్య విరచితం నామ రామాయణం సంపూర్ణం
మంగళం-
- భయహర మంగళ దశరథ రామ |
- జయ జయ మంగళ సీతా రామ |
- మంగళకర జయ మంగళ రామ |
- సంగతశుభవిభవోదయ రామ |
- ఆనందామృతవర్షక రామ |
- ఆశ్రితవత్సల జయ జయ రామ |
- రఘుపతి రాఘవ రాజా రామ |
- పతితపావన సీతా రామ |
- ఇతి నామ రామాయణమ్ |