సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ […]
Category: Uncategorized
Khadgamala Stotram meaning in telugu
ఖడ్గమాలా స్తోత్రం – తెలుగులో అర్థం ఖడ్గమాలా స్తోత్రం ఖడ్గమాలా స్తోత్రం – శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉన్న దేవతలందరినీ, వారి వారి స్థానాలలో స్తుతిస్తూ చేసే స్తోత్రం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారో, ఆ నామాల అర్థాలను ఈ వీడియొలో తెలుసుకుందాం. సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానికి 64 యంత్రాలను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. […]
భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము
16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. పార్ధా! రాక్షస సంపదలో […]
TTD Brahmothsavaalu
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి|| సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. […]
GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)
దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ […]