శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠనంతోపాటు […]