ఏకశ్లోక రామాయణం
ఏకశ్లోక రామాయణం అంటే “ఒకే శ్లోకంలో రామాయణం”. వాల్మీకి రామాయణంలో 24000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం పఠించడం వల్ల అపారమైన ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఏక స్లోకి రామాయణం పఠించడం వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు.
రామాయణం ఒక్క శ్లోకంలో!
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్
పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణమ్
తాత్పర్యం
పూర్వము రాముడు అడవులకు వెళ్ళడం, బంగారు లేడిని హతమార్చడం, సీతాదేవి అపహరణకు గురవడం, జటాయువు మరణించడం, సుగ్రీవునితో స్నేహం చేయడము,వాలిని చంపడము,సముద్రము దాటడము,లంకా దహనము,తరువాత రావణ కుంభకర్ణులను చంపడము.ఇదీ సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకము లో రామాయణ గాథ.
ఏక శ్లోక భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షా గృహే దాహనం
ద్యూతే శ్రీ హరణం వనే విహరణం మత్స్యాలయే వర్ధనం
శ్రీ మద్గోగ్రహణి రణే విహరణం సంధిక్రియాలంబనం
పశ్చాద్భీష్మ సుయోధనాది హననం యేతన్మహా భారతం
తాత్పర్యం
పాండవులు-కౌరవులు జన్మించడం, లక్క ఇల్లు తగలబడడం. జూదములో ద్రౌపదిని ఓడడం, వనవాసం చేయడం, విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం, గోగ్రహణ యుద్ధములో విజయోత్సాహం, సంధి విఫలమవడం, భీష్మ ద్రోణ దుర్యోధనాదులు మరణించడం. ఇదీసూక్ష్మముగా ఒకే ఒక శ్లోకంలో మహాభారత గాథ.
ఏక శ్లోక భాగవతం
ఆదౌ దేవకీ గర్భ జననం గోపీగృహే వర్ధనం
మాయా పూతనజీవితాపహరణం గోవర్ధనోద్ధరణం
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతా పాలనం
ఏతత్ భాగవతం పురాణ కథిథమ్ శ్రీ కృష్ణ లీలామృతం
తాత్పర్యం
దేవకీ గర్భమున జన్మించడం, యశోద గృహములో పెరగడం, మాయావి పూతనను సంహరించడం, గోవర్ధన గిరి పైకి యెత్తడం, కంసుని వధించడం, కౌరవాదుల సంహరించడం, కుంతీ దేవి పుత్రులను రక్షించడం… ఇదీ సూక్ష్మంగా ఒకే ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ లీలామృతమైన భాగవత గాథ .
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

