google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

Dwadasa Jyotirlingalu – 12 Sacred Shiva Temples Across India

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర

ద్వాదశ జ్యోతిర్లింగాల రహస్యాలు, చరిత్ర

అభిషేకప్రియుడు, భోళాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, నీలకంఠుడు, ఈశ్వరుడు — ఇలా చెప్పుకుంటూ పోతే పరమేశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. మన శైవ ఆరాధనలో అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు నిరంతరం దివ్యశక్తిని ప్రసరింపజేస్తూ విశ్వాన్ని, అందులోని సమస్త జీవులను దుష్టశక్తుల నుండి కాపాడుతున్నాయని నమ్మకం. ప్రతి హిందువుకీ జీవితంలో కనీసం ఒక్కసారైనా జ్యోతిర్లింగాలను దర్శించాలనే కోరిక ఉంటుంది.

మరి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్।
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరమ్॥
ప్రజ్వాల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం।
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే॥
వారణాస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే।
హిమాలయే తు కేదారం ఘృష్ణేశం చ శివాలయే॥

ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నరః
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి॥

ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ పఠిస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు కూడా నశిస్తాయని భక్తుల నమ్మకం.

ద్వాదశ జ్యోతిర్లింగాలు

  1. సోమనాథ జ్యోతిర్లింగం – సౌరాష్ట్రం (గుజరాత్)
  2. మల్లికార్జున జ్యోతిర్లింగం – శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)
  3. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం – ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
  4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం – నర్మదా తీరం (మధ్యప్రదేశ్)
  5. వైద్యనాథ జ్యోతిర్లింగం – దేవఘర్ (జార్ఖండ్)
  6. భీమశంకర జ్యోతిర్లింగం – మహారాష్ట్ర
  7. రామేశ్వర జ్యోతిర్లింగం – రామేశ్వరం (తమిళనాడు)
  8. నాగేశ్వర జ్యోతిర్లింగం – ద్వారక సమీపం
  9. విశ్వేశ్వర జ్యోతిర్లింగం – వారణాసి (కాశీ)
  10. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం – నాసిక్ (మహారాష్ట్ర)
  11. కేదారేశ్వర జ్యోతిర్లింగం – కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్)
  12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం – ఎల్లోరా సమీపం (మహారాష్ట్ర)

జ్యోతిర్లింగాల విభజన

  • సముద్రతీరంలో రెండు (సోమనాథ్, రామేశ్వరం)
  • పర్వత శిఖరాల్లో నాలుగు (శ్రీశైలం, కేదార్‌నాథ్, భీమశంకర్, వైద్యనాథ్)
  • మైదాన ప్రాంతాల్లో మూడు (నాగేశ్వర, ఘృష్ణేశ్వర, మహాకాళేశ్వర)
  • నదీ తీరాల్లో మూడు (త్ర్యంబకేశ్వర – గోదావరి, ఓంకారేశ్వర – నర్మదా, విశ్వేశ్వర – గంగా)

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు పరమశివుని తేజోరూపాలు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలుగా భావించబడుతున్నాయి.

జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ

శివ పురాణం ప్రకారం, ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు తమలో తమే “నేనే గొప్ప” అంటూ వాదించుకున్నారు. ఈ వివాదాన్ని ముగించేందుకు శివుడు అనంతమైన జ్యోతి స్థంభరూపంలో ప్రత్యక్షమయ్యాడు.

ఆ జ్యోతి స్థంభానికి ఆది, అంతం తెలుసుకోవాలని బ్రహ్మ హంసరూపంలో పైకి, విష్ణువు వరాహరూపంలో క్రిందికి వెళ్ళారు. కానీ ఎవరికీ ఆ జ్యోతి ఆది అంతం కనిపించలేదు. విష్ణువు నిజం ఒప్పుకోగా, బ్రహ్మ అబద్ధం చెప్పాడు. దీనికి శివుడు బ్రహ్మకు భూమిలో ఆలయాలు లేకపోవాలని శాపమిచ్చి, విష్ణువుకు వరమిచ్చాడు.

ఆ అనంత జ్యోతిస్థంభం నుంచి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అవతరించాయని పురాణ విశ్వాసం.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top