లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లు
శ్రీ లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లను అర్థసహితంగా వివరించాను. మీరు వేరే చోట వెతకాల్సిన అవసరం లేకుండా, అన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే లలితాంబికా అమ్మవారి పేర్లను తెలుసుకుని, మీ చిన్నారి పాపాయికి మంచి పేరు ఎంచుకోవచ్చు.
అక్షరాల వారీగా పేర్లు – అర్థాలతో
అ
అపర్ణ – పార్వతీదేవి
అంబిక – తల్లి
అనాహత – హృదయ చక్రానికి సంబంధించిన పేరు
అర్చిత – అర్చింపబడునది
అనర్ఘ్య – అత్యుత్తమమైనది
అమేయ – కొలవలేనిది
అనఘ – పవిత్రమైనది
ఆ
ఆరాధ్య – ఆరాధింపబడునది
ఆకృతి – అందమైన రూపము కలది
ఈ
ఈశ్వరి – ఈశ్వరుని శక్తి స్వరూపము
ఉ
ఉమా – మూడు లోకాలచే పూజింపబడునది
ఉజ్వల – ప్రకాశించునది
ఐ
ఐశ్వర్య – సంపద కలది
క
కల్పలతిక – కల్పవృక్షపు తీగ
కౌముది – వెన్నెల
కుసుమప్రియ – పుష్పములందు ప్రీతి కలది
కుశల – క్షేమము కలది
కోమల – మృదుల స్వరూపము కలది
కాత్యాయని – ఋషి కాత్యాయనుని ఆశ్రమంలో జన్మించినది
కపర్దిని – జటాజూటము కలది
కామాక్షి – అందమైన కన్నులు కలది
కదంబ – కదంబ పుష్పము
కమనీయ – అందమైనది
కౌలిని – కులదేవత రూపంలో ఆరాధింపబడునది
కీర్తి – యశస్సు కలది
క్లీంకారి – “క్లీం” బీజాక్షరానికి ఆధారమైనది
కైవల్య – మోక్షాన్ని ప్రసాదించునది
కల్యాణి – శుభలక్షణములు కలది
కళావతి – కళాస్వరూపిణి
గ
గాయత్రి – పవిత్ర మంత్రరూపిణి
గౌరి – గౌరవర్ణము కలది
చ
చిన్మయి – జ్ఞానముతో నిండినది
చంద్రిక – వెన్నెల
చారుహాసా – అందమైన మందహాసము కలది
చంద్రనిభా – చంద్రుని వంటి కాంతి కలది
జ
జ్వాల – అగ్నిశిఖ
జగద్ధాత్రి – జగత్తును రక్షించునది
జనని – తల్లి
జయ – జయస్వరూపిణి
జ్ఞానదా – జ్ఞానమును ప్రసాదించునది
త
తరుణి – నిత్యయవ్వనము కలది
త్రినయన – మూడు కన్నులు కలది
త్రిపురమాలిని – మూడు లోకాలను మాలగా ధరించినది
తేజోవతి – తేజస్సు కలది
ద
దుర్గ – దుర్గాదేవి
దాక్షాయణి – దక్షుని కుమార్తె
దీపిక – వెలుగునిచ్చునది
దేవేశి – దేవతల పాలకురాలు
ధర్మిణి – ధర్మస్వరూపిణి
ధృతి – ధైర్యము కలది
న
నిరంజన – మలినరహితమైనది
నిర్మల – శుద్ధమైనది
నిత్య – నిత్యస్వరూపిణి
నారాయణి – నారాయణ తత్వం కలది
నిరుపమ – ఉపమానం లేనిది
నందిని – ఆనందమును ప్రసాదించునది
నళిని – కమలం
నిఖిలేశ్వరి – సమస్తానికి ఈశ్వరి
ప
పరమేశ్వరి – పరమేశ్వరుని శక్తి
పూజ్య – పూజింపబడునది
పూర్ణ – సంపూర్ణురాలు
పంకజ – పద్మము
పార్వతి – పర్వతరాజ పుత్రి
ప్రభా – ప్రకాశించునది
ప్రియ – ప్రేమస్వరూపిణి
ప్రాణదా – ప్రాణమును ప్రసాదించునది
బ/భ
బృహతి – గొప్పదైనది
భవాని – శివుని భార్య
భైరవి – మహావిద్యలలో ఒకటి
భగవతి – దివ్యస్వరూపిణి
భువనేశ్వరి – భువనములకు అధిష్ఠాత్రి
మ
మాధుర్య – మధురమైనది
మేధ – బుద్ధి కలది
మాతృక – తల్లి
ముక్తిదా – ముక్తిని ప్రసాదించునది
మంగళాకృతి – మంగళరూపము కలది
మనోహర – అందమైనది
మహాశక్తి – అనంతశక్తి కలది
మహాదేవి – మహిమాన్వితురాలు
మహాలక్ష్మి – లక్ష్మీ స్వరూపిణి
ర
రమ్య – మనోహరమైనది
రాజీవలోచన – పద్మనయన
రంజని – రంజింపచేయునది
రాజరాజేశ్వరి – పరమేశ్వరి
ల
లావణ్య – సౌందర్యము
లతిక – పూల తీగ
లాస్యప్రియ – నృత్యమునందు ప్రీతి కలది
లలితాంబిక – జగన్మాత
వ
విరాజిత – ప్రకాశించునది
వైభవ – మహిమ కలది
వరదా – వరములు ప్రసాదించునది
విమల – మలినరహితమైనది
విద్య – జ్ఞానస్వరూపిణి
విజయ – జయాన్ని ప్రసాదించునది
వసుధా – సంపదను ఇచ్చునది
వైష్ణవి – వైష్ణవీ దేవి రూపము
శ
శాంభవి – శంభుని భార్య
శాంకరి – శంకరుని భార్య
శ్రీకరి – ఐశ్వర్యాన్ని ప్రసాదించునది
శివప్రియా – శివునికి ప్రియమైనది
శుభంకరి – శుభమును కలిగించునది
శ్రీమాతా – మంగళకరమైన తల్లి
స
స్మిత – చిరునవ్వు
సౌభాగ్య – భాగ్యప్రదమైనది
సర్వమంగళ – శుభస్వరూపిణి
సర్వేశ్వరి – విశ్వాధిపతి
సుముఖి – మంగళకర ముఖము కలది
సౌమ్య – సౌమ్య స్వభావము కలది
సరస్వతి – విద్యాస్వరూపిణి
సావిత్రి – గాయత్రీ మాత
హ
హృద్య – హృదయానికి ఆనందమును కలిగించునది
హర్షిత – ఆనందించునది
హంసిని – హంసస్వరూపిణి
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


