దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ […]