Parasurama Avataram

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

పరశురాముడు తల్లిని,అన్నలను ఎందుకు చంపాడు?

మహావిష్ణువు దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. ఆ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు.

కుశ వంశానికి చెందిన మహారాజు గాది ఒకరోజు మహర్షిని కలిసి ఆయన కూతురు సత్యవతిని తనకు వివాహం చేయమని కోరగా, మహర్షి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇవ్వమని కోరాడు. గాది రాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో అడిగి అర్థం చేసుకున్నారు. మహర్షి హోమద్రవ్యాలు తయారుచేసి, భార్యతో ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు; ఇది మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను, ఇది తింటే తపస్సు గల ఉత్తమ బ్రాహ్మణులు పుడతారు అని చెప్పి స్నానానికి వెళ్లాడు.

అతను వెళ్లిన తరువాత సత్యవతి తల్లి పొరపాటున హవ్యం మార్చింది. ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు, నీకు పరమ క్రౌర్యం కలిగిన కొడుకు పుడతాడని చెప్పగా సత్యవతి బాధపడింది. తరువాత జాలిపడి నీ కొడుకు సాత్వికుడు, మనవడు ఉగ్రుడు అవుతాడు అని అనుగ్రహించాడు.

ఆ విధంగా జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశంతో జన్మించిన వాడు పరశురాముడు. జమదగ్నికి కోపం లేదు. ఆయన పత్నీ రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.

శత్రువులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకున్నాడు. అప్పుడు కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకున్నాడు. తాను క్షత్రియుడు కాను అని చెప్పాడు. కొంతకాలం తరువాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోయాడు. కర్ణుడు నేర్చుకున్న విద్యలు అవసర సమయంలో ఉపయోగపడవని శపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతున్నాయి.

పరశురాముడు ముక్కోపి అనే ప్రచారం ఉంది. అయితే ఆయన కోపానికి లోకకళ్యాణంతో సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుడికి కూడా విద్య నేర్పించాడు. ఇతర మహామునులతో పాటు పరశురాముడు అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై దర్శించుకున్నాడు. త్రేతాయుగంలో రాముని, ద్వాపరయుగంలో కృష్ణుని కూడా కలుసుకున్నాడు.

సీత స్వయంవరం సమయంలో రాముడితో యుద్ధం చేశాడు. కృష్ణుడు గుర్తించి అంగీకరించాడు. కృష్ణుడితో పాటు ఉన్న అర్జునుడిని కూడా గౌరవించాడు. భీష్ముడు వివాహాన్ని తిరస్కరించినప్పుడు ఆమె పరశురాముని ఆశ్రయించింది. తనకు విద్య నేర్పిన గురువు అయినప్పటికీ తన ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో వారి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ప్రపంచంలోనే మహాయోధుడిగా పేరు పొందుతాడు అనే వరాన్ని అనుగ్రహించాడు.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించడానికి వెళ్తుండగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రి అయిన శివుని ప్రసాదమైన పరశుపై గౌరవంతో వినాయకుడు తన దంతంతో ఆ పరశువును ఆపాడు.

తల్లి తన భర్త పట్ల శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండేది. జమదగ్ని ఆమెను వెళ్లి గంగాజలం తీసుకురమ్మన్నాడు. కొంచెం సమయం మించకుండా త్వరగా తెమ్మని చెప్పారు. రేణుకాదేవి భర్త చెప్పినట్లు గంగా నదికి వెళ్లింది. నమస్కరించి కళ్ళు తెరిచేసరికి గంధర్వులు జలక్రీడలు ఆడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసి కొద్దిసేపు ఆలస్యమైంది. వెంటనే గంగాజలాన్ని తీసుకుని భయంతో ఆశ్రమానికి చేరి భర్త ఎదుట ఉంచింది.

జమదగ్ని మహర్షి దివ్యదృష్టితో కారణం తెలుసుకుని కోపంతో ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశించాడు. పెద్ద కొడుకులు సమ్మతించలేదు. పరశురాముడు వెంటనే గొడ్డలి తీసుకుని తండ్రి ఆజ్ఞను పాటించాడు. సంతోషించిన జమదగ్ని వరం కోరమన్నాడు. పరశురాముడు సందేహించకుండా తండ్రి దయచేసి అమ్మను, సోదరులను మళ్లీ బతికించండి అన్నాడు. వారు పునర్జీవం పొందారు.

పరశురాముడు జమదగ్ని మహర్షి కుమారుడు. కార్తవీర్యార్జునుడు కృతవీరుని పుత్రుడు. అతడు చేతులు లేకుండా జన్మించి తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని వేయి చేతులను పొందాడు. మహర్షికి పరమభక్తుడు.

కార్తవీర్యార్జునుడు ఒకసారి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి తన పరివారంతో వస్తాడు. తన దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో కార్తవీర్యార్జునునికి, అతని పరివారానికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. వారికి సకల సదుపాయాలు విశ్రాంతి కోసం కల్పిస్తాడు. కామధేనువును ఇవ్వమని కార్తవీర్యార్జునుడు కోరగా జమదగ్ని మహర్షి నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు వెళ్లిపోతాడు. మరలా తిరిగి వచ్చేసరికి పరశురాముడు తీర్థయాత్రలకు వెళ్లి ఉంటాడు. తర్వాత విషయం తెలుసుకుని బలవంతంగా కామధేనువును తీసుకుపోయిన కార్తవీర్యార్జునుడిపై కోపం తెచ్చుకుని ఆయన రాజ్యానికి వెళ్లి, అక్కడే వెయ్యి చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడిని సంహరించి కామధేనువును తీసుకొని తిరిగి తండ్రి ఆశ్రమానికి వస్తాడు.

ఇలా చేశానని తండ్రికి పరశురాముడు చెప్పగా మహర్షి కోపంతో నీవు వెళ్లి పుణ్యక్షేత్రాలు దర్శించమని చెప్పారు. దర్శనానికి వెళ్లిన సమయంలో కార్తవీర్యార్జునుని కుమారులు వచ్చి అపో దీక్షలో ఉన్న జమదగ్ని తలను నరికేసి వెళ్లిపోతారు. ఈ సంగతి రేణుక చూసి పరశురామా అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ ఏడుపు విని పరశురాముడు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం తెలుసుకుని ఆ కుమారులపై యుద్ధానికి వెళుతుంటే అతని తాతగారు వచ్చి జమదగ్ని మహర్షిని తిరిగి పునరుజ్జీవింపజేస్తారు.

కాని తన తల్లికి ఆవేదన కలిగించిన అహంకారులు ఉండకూడదని మాహిష్మతిపురం ఒక్కటే కాకుండా మార్గంలో ఉన్న పల్లెలతో సహా వెతికి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేసి భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. తర్వాత పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి తల్లిదండ్రులకు తర్పణం అర్పించాడు. కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాక్కుని తప్పించుకున్నారు. తరువాత యజ్ఞాలను నిర్వహించి పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానం చేసి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు.

త్రేతాయుగంలో రాముడు సీతమ్మవారిని పెళ్లి చేసుకొని వస్తుండగా ఈ విషయం పరశురామునికి తెలుస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న విష్ణు చాపాన్ని తీసుకొని నీవు శివుని విల్లు విరిచావా అని రాముని అడుగుతాడు. అప్పుడు రాముడు విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి నా బాణం వృథా కాకూడదు, మా గురువుగారు స్నేహితులు కనుక మీ పుణ్యలోకాలను నాశనం చేయమంటారా లేక మీ పాదగమనాన్ని నిరోధించమంటారా చెప్పండి అని అడుగుతాడు. పరశురాముడు నీవు ఎవరో నాకు తెలిసింది, నీవు మహావిష్ణువు కనుక నేను మహేంద్రగిరికి వెళ్లి తపస్సు చేసుకుంటాను అని చెప్తాడు. ఇలా రామునిలోని విష్ణుత్వాన్ని పరశురాముడు వెల్లడిస్తాడు.

దేశంలో పరిపాలనా దక్షుడు అయిన రాజు లేకపోతే అరాచకత్వం రాజ్యమేలుతుందని అప్పటి స్థితి తెలియజేస్తుంది. క్షత్రియులు లేకపోవడం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగారు. భూదేవి కశ్యపునితో మహాత్మా పరశురాముని వద్ద నుంచి కొందరు రాజకుమారులను రక్షించి నాలో దాచుకున్నాను, వారిని పిలిపించి నాకు అధిపతులుగా నియమిస్తే నేను సుఖంగా ఉంటాను అంది. అందరినీ పిలిపించి ఆమె చెప్పినట్లే వారిని అభిషేక్తుల్నిచేశాడు. దశరథ మహారాజు కూడా వారిలో ఒకడు. నేల తల్లి ఎంతో సంతోషించింది.

గంధర్వులు, సిద్ధులు ఆయన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా పరశురాముడు ఐహిక బంధాలను తెంచుకుని శాంతచిత్తుడై తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు అని చెప్పారు. వచ్చే మన్వంతరంలో పరశురాముడు సప్తఋషులలో ఒకడవుతాడు. పరశురాముడు చిరంజీవి. కలియుగాంతంలో రాబోయే శ్రీమహావిష్ణువు అవతారమైన కల్కి అవతారానికి విద్యలను ఉపదేశిస్తాడు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top