భగవద్గీత తెలుగులో అర్థం 12 వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు […]
Author: Aparna
భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 11 వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను. నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం […]
భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 10 వ అధ్యాయం –విభూతి యోగము నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి, […]
భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 9 వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా […]
భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే […]
భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 7 వ అధ్యాయం -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, […]
భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన […]
భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
భగవద్గీత తెలుగులో అర్థం 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా […]
భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం […]
భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం
భగవద్గీత తెలుగులో అర్థం 3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. […]