భజరంగ్ బాణ్
భజరంగ్ బాణ్ అనేది భక్తులు హనుమాన్ స్వామిని ఆరాధించడానికి పఠించే శక్తివంతమైన స్తోత్రం. ఈ పవిత్ర ప్రార్థనను తులసీదాస్ రచించినట్లు విశ్వసిస్తారు. భజరంగ్ బాణ్ పఠించడం ద్వారా భక్తులు భయాలు, అడ్డంకులు, దుష్టశక్తుల నుండి రక్షణ పొందుతారని నమ్మకం ఉంది. హనుమంతుని అపార శక్తి, భక్తి, ధైర్యాన్ని స్మరించుకునే ఈ స్తోత్రం భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
భజరంగ్ బాణ్ నిత్యం భక్తితో పఠిస్తే మనసుకు ధైర్యం, శక్తి, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కష్టసమయాల్లో ఈ స్తోత్రం జపించడం ద్వారా సమస్యలు తొలగి విజయాలు సిద్ధిస్తాయని భావిస్తారు. హనుమంతుని కృపతో శత్రువుల నుంచి రక్షణ, చెడు ప్రభావాల నుంచి విముక్తి, జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని ఈ స్తోత్రం ప్రాముఖ్యత చెబుతుంది.
నిశ్చయ ప్రేమ ప్రతీతి తే, వినయ కరై సన్మాన।
తేహి కే కారజ సకల శుభ, సిద్ధ కరై హనుమాన ॥
ఎవరైతే తన నిరీక్షణను పూర్ణ ప్రేమ మరియు విశ్వాసముతో వినయపూర్వకంగా ఉంచుకుంటారో, మభక్తుడైన హనుమంతుని అనుగ్రహంతో, అతని కార్యాలన్నీ శుభప్రదంగా విజయవంతమవుతాయి.
జయ హనుమన్త సన్త హితకారీ ।
సున లీజై ప్రభు వినయ హమారీ ॥
ఓ హనుమంతా, సాధువులకు క్షేమాన్ని ప్రసాదించేవాడా, దయచేసి నా విన్నపాన్ని వినుము.
జన కే కాజ విలమ్బ న కీజై ।
ఆతుర దౌరి మహా సుఖ దీజై ॥
ఓ ప్రభూ, వాయుపుత్రుడా, నీ సేవకుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆలస్యం చేయకుండా వాయువేగంతో వచ్చి భక్తుడిని సంతోషపెట్టు.
జైసే కూది సింధు కే పారా ।
సురసా బదన పైఠి విస్తారా ॥
హే హనుమంతా! నువ్వు అవలీలగా సముద్రాన్ని దాటుతుంటే, సురస అనే రాక్షసి తన భారీ శరీరంతో నిన్ను లంకకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆమె నోటిలోకి ప్రవేశించిన తర్వాత కూడా నువ్వు తిరిగి వచ్చావు.
ఆగే జాయ లంకిణీ రోకా ।
మారేహు లాత గయీ సురలోకా ॥
నువ్వు లంకకు చేరుకోగానే అక్కడ ఉన్న లంకిణి నిన్ను అడ్డుకోగా ఒక్క దెబ్బతో ఆమెను దేవలోకానికి పంపించావు.
జాయ విభీషణ కో సుఖ దీన్హా ।
సీతా నిరఖి పరమపద లీన్హా ॥
నీవు లంకకు వెళ్లి విభీషణునికి ఆనందాన్ని కలిగించావు. సీతమ్మను కనుగొని, ఆమె ఆశీర్వాదం ద్వారా అత్యున్నత స్థానాన్ని పొందావు.
బాగ ఉజారి సింధు మహం బోరా ।
అతి ఆతుర జమకాతర తోరా ॥
నీవు రావణుని లంకలోని ఉద్యానవనాలను ధ్వంసం చేసావు. రావణుడిచే పంపబడిన సైనికులకు నీవు యమ దూతవి అయ్యావు.
అక్షయ కుమార మారి సంహారా ।
లూమ లపేటి లంక కో జారా ॥
తోకతో లంకా నగరాన్ని మొత్తం దహనం చేసి, గడ్డి కుప్పలా కాల్చివేసావు, అవలీలగా దశకంఠుని కుమారుడు అక్షయకుమారుడిని చంపావు.
లాహ సమాన లంక జరి గయీ ।
జయ జయ ధుని సురపుర నభ భయీ ॥
లంకా నగరాన్ని దహనం చేసి, కాల్చివేసావు, అందరూ నిన్ను అభినందించి చేసిన ప్రశంసలు స్వర్గాన్ని తాకాయి.
అబ విలంబ కేహి కారణ స్వామీ ।
కృపా కరహు ఉన అంతర్యామి॥
నీవు సర్వజ్ఞుడవు, అందరి హృదయాలలో ఏముందో తెలుసుకోగలవు. ఓ ప్రభూ, అలాంటప్పుడు ఈ సేవకుని రక్షించడానికి ఇంత ఆలస్యం ఎందుకు? దయచేసి నా కష్టాలను తొలగించుము.
జయ జయ లఖన ప్రాణ కే దాతా ।
ఆతుర హోయ దుఖ కరహు నిపాతా ॥
రాముని సోదరుడైన లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన ఓ అతిబలవంతా! హనుమంతా! నీకు జయం కలుగుగాక.
జై హనుమాన జయతి బల-సాగర ।
సుర-సమూహ-సమరథ భట-నాగర ॥
ఓ హనుమంతుడా, నీకు విజయం కలుగుగాక. దేవతలందరితో పాటు విష్ణువు యొక్క శక్తిని కలిగి ఉన్న వాయు కుమారుడైన హనుమంతుడికి నమస్కారం.
ఓం హను హను హను హనుమంత హాఠీలే |
బైరిహి మారు వజ్ర కీ కీలే ||
నన్ను కరుణించి, నీ పిడుగుపాటుతో నా శత్రువులను సంహరించు.
ఓం హ్నీం హ్నీం హ్నీం హనుమన్త కపీశా ।
ఓం హుం హుం హుం హను అరి ఉర సీసా ॥
హ్రీం హ్రీం హ్రీం మంత్రాల రూపంలో నిన్ను వేడుకుంటున్నాను. ఓ మహా బలవంతుడైన కపీశా, నా శత్రువుల హృదయాలను, తలలను బద్దలు కొట్టు.
జయ అంజని కుమార బలవంతా ।
శంకరసువన వీర హనుమంతా ॥
ఓ అంజనీ పుత్రుడా, ఓ సాటిలేని బలవంతుడా! శివుని అంశవూ, ధైర్యవంతుడవూ అయిన హనుమంతుడా, దయచేసి నన్ను రక్షించు.
వదన కరాల కాల-కుల-ఘాలక ।
రామ సహాయ సదా ప్రతిపాలక ॥
అతి భారీ కాయంతో రామునికి ప్రియభక్తుడవైన నీవు, రాముడి ఆజ్ఞలను పాటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు.
భూత, ప్రేత, పిశాచ నిశాచర ।
అగ్ని బేతాల కాల మారీ మర ॥
నీవు రాత్రిపూట సంచరించే దయ్యాలు, పిశాచాలు, దుష్టశక్తులను నాశనం చేస్తావు.
ఇన్హే మారు, తోహి శపథ రామ కీ ।
రాఖు నాథ మరజాద నామ కీ ॥
శ్రీరాముని సాక్షిగా నీవు దుష్టులను చంపి, మమ్ములను రక్షించు.
సత్య హోహు హరి శపథ పాయ కే |
రామదూత ధరు మారు జాయ కే ||
శ్రీ హరి ద్వారా నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, నా అభ్యర్థనను నెరవేర్చండి – ఓ రాముని దూత, నా శత్రువులను మరియు నా అడ్డంకులను నాశనం చేయండి.
జయ జయ జయ హనుమంత అగాధా ।
దుఖ పావత జన కేహి అపరాధా ॥
అనంతమైన శక్తులు కలిగి దయగల ఆంజనేయా! నీకు విజయం కలుగుగాక. నీ సేవకుడు ఏ నేరమూ చేయడు, శిక్షించబడడు.
పూజా జప తప నేమ అచారా ।
నహి జానత క చు దాస తుమ్హారా ॥
ఓ ధన్యుడా, నీ ఈ దాసునికి పూజా విధానం, జప నియమాలు, తపస్సు, ఆలోచనల గురించి ఎటువంటి జ్ఞానం లేదు, దయచేసి అజ్ఞాని అయిన ఈ దాసుణ్ణి రక్షించండి.
వన ఉపవన మగ గిరి గృహ మాహీ ।
తుమ్హరే బల హం డరపత నాహీ ॥
నిన్ను శరణుజొచ్చినవాడు- ఆ ప్రదేశం అరణ్యమైనా, సుందరమైన ఉద్యానవనమైనా, గృహమైనా, పర్వతమైనా, నీ అనుగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడూ భయపడడు.
పాయ పరో కర జోరి మనావై |
యహి అవసర అబ కేహి జోహరావై ||
ఓ హనుమంతా, ఈ దాసుడు ముకుళిత హస్తాలతో, నీ పాదాల వద్ద పడి ఉన్నాడు. నా కష్టాల గురించి నీకు తప్ప ఈ విశ్వంలో ఎవరికి నేను చెప్పగలను, ఎవరిని శరణు వేడగలను?
జనకసుతా హరి దాస కహావై ।
తాకీ శపథ విలంబ న లావో ॥
జనకుని సుత అయిన జానకికీ, శ్రీరామునికి నీవు సేవకుడవు. రాముని ఆజ్ఞ ప్రకారం ఈ దాసుని కష్టాలను పరిష్కరించడంలో ఆలస్యం చేయవద్దు.
జయ జయ జయ ధుని హోత ఆకాశా ।
సుమిరత హోయ దుసహ దుఖ నాసా ॥
నీ పాదాలను ఆశ్రయిస్తూ, ముకుళిత హస్తాలతో నిన్ను వేడుకుంటున్నాను, స్వామి, నాకు సరైన మార్గం చూపు. నీ కీర్తి ఆకాశాన్నంటింది. నిన్ను స్మరించడం వల్ల నీచమైన దుఃఖాలు కూడా నశిస్తాయి.
చరన పకరి కర జోరి మనావౌ ।
యహి అవసర అబ కేహి గౌహరావౌ ॥
ఓ రామదూత హనుమంతా, ముకుళిత హస్తాలతో నేను నీ పాదాల వద్ద ఆశ్రయం పొందుతున్నాను.
ఉఠు ఉఠు చలు తోహి రామ దుహాఈ ।
పాయ పరో కర జోరి మనాయీ ॥
నా బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి. ఓ హనుమంతా, నీ గర్జనకు రాక్షసుల గుంపులు భయపడిపోయాయి.
ఓం చం చం చం చం చం చపల చలంతా।
ఓం హను హను హను హను హనుమంతా॥
ఓ హనుమంతా, వాయువేగంతో కదిలేవాడా, నా కష్టాలను నాశనం చేయుము.
ఓం హం హం హాంక దేత కపి చంచల।
ఓం సం సం సహమి పరానే ఖల-దల ॥
హను అనే నీ శబ్దం ద్వారా దుష్టులందరూ సూర్యోదయ సమయంలో చీకటిలాగా పాలిపోయారు.
అపనే జన కో తురత ఉబారౌ ।
సుమిరత హోయ ఆనంద హమారో ॥
ఓ ప్రభూ, నీ సేవకులు నిన్ను స్మరించుకోవడం ద్వారా సంతోషిస్తారు. ఓం వానరవీరా, నీ గర్జనకు రాక్షసుల గుంపులు భయపడిపోయాయి.
యహ బజరఙ్గ-బాణ జేహి మారై ।
తాహి కహో ఫిర్ కౌన ఉబారై ॥
నీవు వేసిన భజరంగ్ బాణం నుండి అతణ్ని ఈ మొత్తం విశ్వంలో ఎవరూ రక్షించలేరు. నీ భక్తులకు తక్షణ క్షేమాన్ని, సంతోషాన్ని అందించు.
పాఠ కరై భజరంగ్-బాణ కీ ।
హనుమత రక్షా కరై ప్రాణ్ కీ ॥
ఎవరైతే ఈ బజరంగ్ బాణ్ ను క్రమం తప్పకుండా పూర్తి భక్తితో పఠిస్తారో, వారి ప్రాణాలను హనుమంతుడు రక్షిస్తాడు.
యహ భజరంగ బాణ జో జాపై ।
తేహి తే భూత-ప్రేత సబ కాపై ॥
భజరంగ్ బాణ్ పఠించిన చోట, భూత ప్రేత పిశాచాలు భయంతో వణికిపోతాయి.
ధూప దేయ జో జపై హమేసా ।
తాకే తన నహిం రహై కలేశా ॥
ధూపం వేసి పూర్తి అంకితభావంతో బజరంగ్ బాణ్ పఠించే ఏ వ్యక్తికీ ఎటువంటి వ్యాధులూ, ఇబ్బందులూ దరిచేరవు.
దోహా
ఉర ప్రతీతి ధృఢ సరన హవై, పాఠ కరై ధరి ధ్యాన ।
బాధా సబ హర కరై, సబ కామ సఫల హనుమాన ॥
ప్రేమ ప్రతీతిహి కపి భజే, సదా ధరై ఉర్ ధ్యానా|
తేహి కే కారజ్ సకల శుభ్, సిద్ధ్ కరై హనుమాన్||
ఎవరైతే హనుమంతుని ప్రేమతో, విశ్వాసంతో స్మరించుకుని, ఎప్పుడూ వారి హృదయాలలో స్మరించుకుంటారో, వారి పనులన్నీ హనుమంతుని దయతో నెరవేరుతాయి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


