స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 31-40 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 31-40 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా |
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా || 31 ||
కౌశికీ              – పార్వతి దేవి శరీర కోశమునుండి బయల్పడిన శక్తి
వైదికీదేవీ         – వేదమాత
సౌరీ               – సూర్యుని యొక్క శక్తి
రూపాధికా        – అన్ని రూపములలో అధికురాలు
అతిభా            – మిక్కిలి కాంతి కలిగినది
దిగ్వస్త్రా           – దిక్కులను వస్త్రంగా ధరించునది, దిగంతముల వరకు వ్యాపించిన తల్లి
నవవస్త్రా          – ఎప్పుడూ నూతన వస్త్రములతో అలకరింపబడునది
కన్యకా            – వివాహం కాని కన్యాకుమారి స్వరూపిణి
కమలోద్భవా    – కమలం నుండి పుట్టినది

శ్రీః సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా |
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ || 32 ||
శ్రీః                  – లక్ష్మీ దేవి
సౌమ్యలక్షణా     – ప్రశాంతమైన రూపాన్ని కలిగినది
అతీత దుర్గా      – అందరికీ అతీతమైన దుర్గా స్వరూపిణి
సూత్ర ప్రబోధికా – వేదములలోని యజ్ఞ కర్మల విజ్ఞానమును ప్రసాదించునది
శ్రద్ధా               – శ్రద్ధగలది
మేధా             – బుద్ధి రూపకమైన శక్తి స్వరూపిణి
కృతిః              – సజ్జనులకు సహాయపడు తల్లి
ప్రజ్ఞా               – చూచిన వెంటనే, విన్న వెంటనే గ్రహించగల జ్ఞానము ప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞా స్వరూపిణి
ధారణా            – అర్థం చేసుకునే ధారణా శక్తిని ప్రసాదించునది
కాంతిరేవ చ      – వెలుగు


శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ |
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ || 33 ||
శ్రుతిః              – వేద స్వరూపిణి
స్మృతిః             – స్మృతి స్వరూపిణి
ధృతి              – ధైర్యము
ధన్యా             – పుణ్యాత్మురాలు, ధనమునిచ్చునది
భూతిః             – సకల సంపదలను ఇచ్చునది
ఇష్టి             – అగ్నిహోత్రం, తపస్సు, వేదాధ్యయనము మొదలైన ఇష్టకర్మలు అన్నీ అమ్మ స్వరూపములు
మనీషిణీ          – మిక్కిలి మేధా సంపత్తి కలిగిన తల్లి
విరక్తిః              – వైరాగ్యమును కలిగించు మహాజ్ఞాన స్వరూపిణి
వ్యాపినీ           – సర్వత్రా వ్యాపించి ఉన్నది
మాయా           – మాయాశక్తి స్వరూపిణి
సర్వమాయా ప్రభంజనీ   – సమస్తమైన మాయలనూ భంజించు తల్లి

మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ |
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా || 34 ||
మాహేంద్రీ                  – మహేంద్రుని శక్తి
మంత్రిణీ                    – ఆలోచన చేసి కార్యాకార్యములను తెలుపునది.
                                      ‘మంత్రి’కి స్త్రీ లింగము మంత్రిణి
సింహీ                       – సింహం రూపాన్ని ధరించేది/సింహం వలె ధైర్యవంతురాలు
ఇంద్రజాల స్వరూపిణీ     – ఇంద్రజాల, మాయా స్వరూపిణి
అవస్థాత్రయ నిర్ముక్తా     – మానవులకు ఉండే జాగరణ, నిద్ర, స్వప్న  అనే మూడు అవస్థలు లేనిది
గుణత్రయ వివర్జితా       – సత్వ, రజ, తమో గుణాలనే మూడు గుణాలకు అతీతమైనది

ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా |
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా || 35 ||
ఈషణత్రయ నిర్ముక్తా               – పుత్రులు, సంపద, స్వర్గం అనే మూడు కోరికలు లేనిది
సర్వరోగ వివర్జితా                   – అన్ని వ్యాధులను నయం చేయునది
యోగిధ్యానాంత గమ్యా             – యోగుల యొక్క ధ్యాన అంతమే తన గమ్యముగా కలది
యోగధ్యాన పరాయణా             – యోగా ధ్యానము నందు ఆసక్తి గలది


త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ |
భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతిః || 36 ||
త్రయీశిఖా                 – మూడు వేదముల శిఖ అనగా ఉపనిషత్తు స్వరూపిణి
విశేషఙ్ఞా                     – విశేషమైన జ్ఞానము కలది
వేదాంత జ్ఞాన రూపిణి    – వేదాంత జ్ఞాన స్వరూపం
భారతీ                       – సరస్వతి
కమలా                     – కమలము చేతియందు ఉన్నది
భాషా                        – సరస్వతి దేవి
పద్మా                       – కమలం నుండి పుట్టినది
పద్మావతి                  – పద్మము నివాసముగా కలది
కృతిః                        – కార్యము, కార్యముల యొక్క ఫలితం తానే అయినది


గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ |
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా || 37 ||
గౌతమీ           – గౌతమ ఋషి కుమార్తెగా జన్మించినది
గోమతీ            – గోమతి నది
గౌరీ               – తెల్లని శరీర ఛాయ కలది
ఈశానా           – ఈశ్వరుని భార్య
హంసవాహిని    – హంస వాహనముగా కలది
నారాయణీ       – నారాయణుని శక్తి
ప్రభాధారా        – నక్షత్రాలు, సూర్యుడు మొదలైన కాంతికి ఆధారమైనది
జాహ్నవీ         – జహ్ను మహర్షి కుమార్తె
శంకరాత్మజా     – శివుని భార్య


చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా |
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ || 38 ||
చిత్రఘంటా       – పాదములకు చిరుమువ్వలు ఆభరణములుగా కలది
సునందా         – ఆనంద స్వరూపిణి
శ్రీః                  – సంపదలను ఇచ్చునది
మానవీ           – మనువు కుమార్తె
మనుసంభవా   – మనుస్మృతి రూపమైన జ్ఞాన స్వరూపిణి
స్తంభినీ           – స్థిరమైనది
క్షోభిణీ             – శత్రువులకు మనఃక్షోభను కలిగించునది
మారీ              – అసురులను సంహరించేది
భ్రామిణీ           – సమస్తమును నడిపించునది
శత్రుమారిణి      – శత్రువులను సంహరించునది

మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ |
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ || 39||
మోహినీ          – సర్వ లోకులనూ మోహింపజేయు మాయాశక్తి
ద్వేషిణీ            – దుర్జనులను ద్వేషించునది
వీరా               – వీరత్వము, శౌర్యము కలది
అఘోరా          – శాంతస్వరూపిణి
రుద్ర రూపిణి     – రుద్రుని భార్య
రుద్రైకాదశినీ     – ఏకాదశ రుద్రరూపిణి
పుణ్యా            – పుణ్యకార్య స్వరూపిణి
కల్యాణీ            – మంగళకరమైన, శుభ లక్షణములు కలది
లాభకారిణీ       – తనను ఆరాధించువారికి లాభములను కలిగించునది

దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ |
సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ || 40 ||
దేవదుర్గా                   – దేవతలచేత పూజింపబడు దుర్గ
మహాదుర్గా                 – గొప్పదైన తల్లి
స్వప్నదుర్గ                 – తపస్సమాధిలో స్వప్నము వలె సాక్షాత్కరించు దుర్గా భవాని
అష్టభైరవీ                   – అష్ట భైరవ స్వరూపిణి
సూర్యచంద్రాగ్నిరూపా     – సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురి తేజస్స్వరూపము
గ్రహనక్షత్రరూపిణీ         – నక్షత్రాలు, గ్రహాలు తన స్వరూపముగా కలది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top