google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

Car crushing lemons under its front tires as part of a traditional Indian ritual for protection.

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు?

వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు?

మన దేశంలో బైక్, కారు లేదా ఇతర వాహనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ముందుగా పూజ చేయడం ఆనవాయితీ. వాహనం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి తొక్కిస్తే మంచిదని, ఇలా చేయకపోతే వాహనానికి లేదా యజమానికి అపశకునం జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఇది కేవలం ఒక ఆచారమా? నమ్మకమా? లేక దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వకాలంలో మోటార్ వాహనాలు లేని సమయంలో ప్రయాణాలకు ప్రధానంగా ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు ఉపయోగించేవారు. ఎక్కువ దూరం ప్రయాణించడం లేదా అనారోగ్యం వల్ల గుర్రాలు, ఎడ్ల కాళ్లకు గాయాలు అవుతుండేవి. అవి బురద, మట్టి, ఇసుకలో నడవడం వల్ల ఆ గాయాలకు ఇన్ఫెక్షన్లు వచ్చేవి, కొన్నిసార్లు పురుగులు కూడా పట్టేవి.

అలాంటి సందర్భాల్లో గాయాలు త్వరగా మానిపించడానికి నిమ్మకాయలను వాటితో తొక్కించేవారని చెబుతారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్‌కు కొన్ని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని తెలిసిందే. అందువల్ల గాయాలలో ఉన్న సూక్ష్మజీవులను తగ్గించడంలో ఇది కొంత సహాయపడేదని భావించేవారు.

కాలక్రమేణా ఆ పద్ధతి ఒక ఆచారంగా మారింది. గుర్రాలు, ఎడ్ల స్థానంలో వాహనాలు వచ్చిన తర్వాత కూడా టైర్ల కింద నిమ్మకాయలను ఉంచి తొక్కించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇలా ఒక ప్రాచీన పద్ధతి నేటి కాలంలో నమ్మకంగా స్థిరపడిపోయింది.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top