మూక పంచశతి పాదారవింద శతకం 51-60 శ్లోకాలు | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.

ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.

అవిశ్రాంతం తిష్ఠన్నకృతకవచః కందరపుటీ-
కుటీరాంతః ప్రౌఢం నఖరుచిసటాలీం ప్రకటయన్ ।
ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా
తమోవేతండేంద్రం తవ చరణకంఠీరవపతిః ॥51॥

అమ్మా! వేదములు అనే గుహలను నివాసముగా చేసుకుని ఉన్న మృగరాజు నీ చరణములు. తన పదునైన నఖముల ప్రకాశమనే జూలు విదుల్చుతూ, ఆ మృగరాజు నా అజ్ఞానము అనే మదగజమును చీల్చివేయుచున్నది.

పురస్తాత్కామాక్షి ప్రచురరసం ఆఖండలపురీ-
పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః ।
నఖశ్రీభిః స్మేరా బహు వితనుతే నూపురరవైః
చమత్కృత్యా శంకే చరణయుగలీ చాటురచనాః ॥52॥

జగన్మాతా! నీ సముఖములో దేవ కన్యలు అద్భుతమైన నాట్యమును ప్రదర్శిస్తుండగా, నీ పాద నఖములకాంతి, నీ కాలికి ఉన్న అందియల చిరుసవ్వడులు, ఆ నాట్యమును ప్రశంసించుచున్నట్లుగా అనిపిస్తున్నది.

సరోజం నిందంతీ నఖకిరణకర్పూరశిశిరా
నిషిక్తా మారారేః ముకుటశశిరేఖాహిమజలైః ।
స్ఫురంతీ కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే
తవాధత్తే మైత్రీం పథికసుదృశా పాదయుగలీ ॥53॥

మాతా! పద్మముయొక్క కాంతిని తిరస్కరిస్తూ, నీ పాద నఖముల నుండి వెలువడే వెన్నెల పచ్చ కర్చూరమంత చల్లనిదై, చంద్రుని అమృత ధారలలో తడిసినదై, అనేకమైన లేలేత చిగురుటాకులవలే మెరిసిపోతున్నవి నీ చరణములు.       

నతానాం సంపత్తేరనవరతం ఆకర్షణజపః
ప్రరోహత్సంసార ప్రసరగరిమస్తంభనజపః ।
త్వదీయః కామాక్షి స్మరహరమనోమోహనజపః
పటీయాన్నః పాయాత్ పదనలినమంజీరనినదః ॥54॥

  కామాక్షీ! నిన్ను శరణు వేడినవారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించే మంత్రమును, సంసార బాధలను తొలగించే మంత్రమును, ఈశ్వరునికి మోహన మంత్రమును ప్రసాదింపగల సమర్థములైనవి నీ పాదముల మంజీర నాదములు. ఆ నాదములు మమ్ము కరుణించుగాక.

వితన్వీథా నాథే మమ శిరసి కామాక్షి కృపయా
పదాంభోజన్యాసం పశుపరిబృఢప్రాణదయితే ।
పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంపాపరిసరం
దృశా నానంద్యంతే నలినభవనారాయణముఖాః ॥55॥

అమ్మా! ఆదిగురువైన ఈశ్వరునికి నీవు దేవేరివి. కంపానదీ తీరప్రాంతములో సంచరిస్తున నీ పాదపద్మములను బ్రహ్మాది దేవతలు కనులు విప్పార్చి మరీ తిలకిస్తుంటారు. అట్టి నీ పాదములను నా శిరసుపై ఉంచి నన్ను అనుగ్రహించు మాతా!

ప్రణామోద్యద్బృందార ముకుటమందారకలికా-
విలోలల్లోలంబ ప్రకరమయధూమప్రచురిమా ।
ప్రదీప్తః పాదాబ్జ ద్యుతివితతిపాటల్యలహరీ-
కృశానుః కామాక్ష్యా మమ దహతు సంసారవిపినమ్ ॥56॥

అమ్మా! దేవతలు నీకు నమస్కరించటానికి వంగినపుడు, వారి కిరీటములలోని ఎర్రని మణులనే మందార పుష్పములమీద తుమ్మెదల గుంపులు పరిభ్రమిస్తున్నాయి. నీ చరణముల కాంతి అనే ఎర్రని అగ్ని సంసార బాధలు అనే నా అరణ్యమును జ్వలింపచేయుగాక.

వలక్షశ్రీరృక్షాధిప శిశుసదృక్షైస్తవ నఖైః
జిఘృక్షుర్దక్షత్వం సరసిరుహభిక్షుత్వకరణే ।
క్షణాన్మే కామాక్షి క్షపితభవసంక్షోభగరిమా
వచోవైచక్షన్యం చరణయుగలీ పక్ష్మలయతాత్ ॥57॥

అమ్మా! కామాక్షీ, పద్మములు నీ పాదములనుండి కాంతి అనే భిక్షను అర్థిస్తునాయి. చంద్రకాంతి వంటి నీ తెల్లని పాద నఖముల కాంతి, మా సాంసారిక బాధలను చిందరవందర చేసి, మా వాక్పటిమను వృద్ధిపరచుగాక.

సమంతాత్కామాక్షి క్షతతిమిరసంతానసుభగాన్
అనంతాభిర్భాభిః దినమను దిగంతాన్విరచయన్ ।
అహంతాయా హంతా మమ జడిమదంతావలహరిః
విభింతాం సంతాపం తవ చరణచింతామణిరసౌ ॥58॥

అమ్మా! నీ పాదములు చింతామణి వంటివి. అంతటా నిండి ఉన్న చీకటులను పారద్రోలి, అన్ని దిక్కులను వెలుగులతో నింపే నీ పాదములనే చింతామణి నాలో నిండి ఉన్న జడత్వము అనే భీకర గజమును తీసివేయుగాక.

దధానో భాస్వత్తాం అమృతనిలయో లోహితవపుః
వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ ।
గతౌ మందో గంగాధరమహిషి కామాక్షి భజతాం
తమఃకేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే ॥59॥

అమ్మా! నీ పాదపద్మములు కాంతివంతమైన సూర్యుడు, అమృతమయుడైన చంద్రుడు, రక్తవర్ణముకల అంగారకుడు, సౌమ్యుడైన బుధుడు, గురుమార్తియైన గురువు, కళలను ప్రసాదించే శుక్రుడు, మందుడైన శని, తమోగుణుడైన రాహువు, తోకచుక్క అయిన కేతువుల సమూహమే కదా!

నయంతీం దాసత్వం నలినభవముఖ్యాన్ అసులభ-
ప్రదానాద్ దీనానామమరతరు దౌర్భాగ్యజననీమ్ ।
జగజ్జన్మక్షేమక్షయవిధిషు కామాక్షి పదయోః
దురీణామీష్టే కరస్తవ భణితుమాహోపురుషికామ్ ॥60॥

జగన్మాతా! విశేషమేమిటంటే, దీనులైన వారికి, నీ పాదములు మోక్షాన్ని ప్రసాదిస్తూ, బ్రహ్మాది దేవతలకు దుర్లభమైనవిగా ఉన్నాయి. సృష్టి, స్థితి, లయ కార్యములను నిర్వహించేవి పాదములు. అలాంటి పాదముల మహిమను వర్ణించడం ఎవరి తరమవుతుంది.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం

మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 81-90 శ్లోకాలు

మూక పంచశతి పాదారవిందశతకం 91-103 శ్లోకాలు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top