గజేంద్ర మోక్షం
గజేంద్ర మోక్షం పోతన రచించిన భాగవతంలో గజేంద్రమోక్ష గాథ విపులంగా వివరించబడింది. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచిన తరువాత తామస మన్వంతరంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి భూలోకానికి అవతరించాడని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుని కథను విపులంగా చెప్పమని అడుగుతాడు. త్రికూట పర్వతం క్షీరసాగరంలో త్రికూటం అనే అద్భుతమైన పర్వతం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో త్రిభుజాకారంలో విస్తరించి ఉంటుంది. దానికి మూడు […]


