భారతీయ సంస్కృతి

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద […]

Read More

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం […]

Read More

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు.  కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.  ఋషులు ఎన్నో […]

Read More

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 12  వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు […]

Read More

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం […]

Read More

భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన […]

Read More

భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు.  దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా […]

Read More

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం […]

Read More

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము

భగవద్గీత తెలుగులో అర్థం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం […]

Read More
TOP