భారతీయ సంస్కృతి

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం […]

Read More

భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు.  అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. […]

Read More

2 వ అధ్యాయం – సాంఖ్య యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు […]

Read More

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము

భగవద్గీత తెలుగులో అర్థం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం […]

Read More
TOP