సౌందర్యలహరి 11-20 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 11. శ్లోకం చతుర్భిః శ్రీకణ్ఠైశ్శివయువతిభిః పంచభిరపిప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః!చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయత్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!! తాత్పర్యం: తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది. 12. శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుంకవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయఃయదాలోకౌత్సుక్యా అమరలలనాయాంతి మనసాతపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. తాత్పర్యం: […]

