google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

33 crores god names

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా?

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా?

హిందూ ధర్మం ప్రకారం మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పబడుతుంది. యజుర్వేదం, అధర్వణవేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన ప్రాచీన శాస్త్రాలలో 33 విధాల దేవతల గురించి ప్రస్తావన ఉంది. హిందూ శాస్త్రాలే కాకుండా, బౌద్ధమత గ్రంథాలలో కూడా 33 దేవతల గురించి వివరణ లభిస్తుంది.

ఇక్కడ “కోటి” అనే పదం సంఖ్యను మాత్రమే సూచించదు. సంస్కృతంలో “కోటి” అంటే విధము, వర్గము అనే అర్థాలూ ఉన్నాయి. కాబట్టి 33 కోట్ల దేవతలు అంటే 33 విధాలైన లేదా 33 వర్గాలకు చెందిన దేవతలు అని అర్థం.

ఆ 33 వర్గాలలో వచ్చే దేవతలు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వాదశ ఆదిత్యులు – 12 మంది
ఏకాదశ రుద్రులు – 11 మంది
అష్ట వసువులు – 8 మంది
అశ్వినీ దేవతలు – 2 మంది
మొత్తం కలిసి 33 దేవతలు.

ద్వాదశ ఆదిత్యులు

హిందూ పురాణాల ప్రకారం అదితి, కశ్యప మహర్షుల 12 మంది పుత్రులను ద్వాదశ ఆదిత్యులు అంటారు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలలో సూర్యుని శక్తి భిన్నంగా ఉంటుంది. ఆ 12 స్థితులనే ద్వాదశ ఆదిత్యులుగా వర్ణించారు. వీరు జ్ఞానప్రదాతలుగా భావించబడతారు.

హిందువులు పవిత్రంగా భావించే వారణాసి నగరంలో ద్వాదశ ఆదిత్య దేవాలయాలు ఉన్నాయి. ఆయా మాసాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఏకాదశ రుద్రులు

శివుడు 11 రూపాలలో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. శైవ ఆగమాలు, పురాణాలలో ఈ ప్రస్తావన ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతంలో ప్రతి సంవత్సరం జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఏకాదశ రుద్రుల ఆరాధన విశేషంగా జరుగుతుంది.

అష్ట వసువులు

“వసువులు” అనగా దేవలోకంలో ఇంద్రుడు, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు ప్రకృతి తత్వాలకు ప్రతీకలు.

అశ్వినీ దేవతలు

అశ్వినీ కుమారులు దేవతల వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. ఆరోగ్యం, ఆయురారోగ్యానికి వీరిని ఆరాధిస్తారు.

దైవం అంటే దివ్యత్వం కలిగిన శక్తి. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్త ప్రాణులను రక్షించడమే వారి కర్తవ్యం అని మన శాస్త్రాలు తెలియజేస్తాయి. ప్రకృతిలోని ప్రతి విభాగానికి ఒక అధిష్ఠాన దేవతను భావించి ఆరాధించడం మన సనాతన ధర్మం యొక్క విశిష్టత.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top