Narakasura Vadha - Lord Krishna and Satyabhama defeating demon Narakasura"

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా?

నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా?

సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి.నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడా? సత్యభామా? చీకట్లను పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు అసలు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి భూదేవికి కొడుకైన నరకాసురుడు రాక్షసుడిగా ఎందుకు మారాడు జనని చేతిలోనే ఎందుకు మరణించాడు అసలు నరకాసురుడు చేసిన తప్పేంటి అనే విషయాలను తెలుసుకుందాం దశమ స్కందం ఉత్తరభాగంలో హరివంశ పురాణం విష్ణు పురాణంలో నరకాసురుని సంహారం గురించిన విషయాలు ఉంటాయి ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కృతయుగంలో హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు.

దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీమహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరలతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకొచ్చాడు వారికి ఒక పుత్రుడు కలిగాడు కానీ నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కావడంతో ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడు కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి ప్రతి యుగంలో గర్భం దాల్చి త్రేతాయుగంలో జన్మించింది త్రేతాయుగంలో రావణ వధానంతరం జన్మించిన పుత్రుడిని జనక మహారాజుకు అప్పగించి విద్యాబుద్ధులు నేర్పమని అడిగింది జనకుడు భూదేవి కుమారుడికి నరకుడు అని పేరు పెట్టి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేశాడు జనక మహారాజు పరిరక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారాడు కాలక్రమంలో అతని ఆగడాలను భరించలేక జనకుడు నరకుడిని భూదేవికి అప్పగించాడు నరకుడికి తల్లి భూదేవి జన్మవృత్తాంతం చెప్పింది విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణువు ప్రత్యక్షమై తన కుమారుడికి శక్తి ఆయుధాన్ని దివ్య రథాన్ని వరంగా ఇచ్చి కామరూప దేశాన్ని ప్రాగ్జ్యోతిష నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించమని చెప్పాడు.

ఆ నగరం ఆరు దుర్గాలతో శత్రుదుర్భేద్యమైన అద్భుత నగరం కామాక్షి అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తూ తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది మొదట స్త్రీలను తల్లిలా భావించేవాడు కానీ అతని దృష్టిలో స్త్రీ భోగవస్తువుగా మారింది స్నేహ ప్రభావం వల్ల నరకాసురుడు మెల్లగా ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల లోని 16000 మంది రాజకుమార్తెలను బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించాడు మురుడు అనే ఐదు తలల రాక్షసుడిని చేరదీసి సేనానిగా కోటకు రక్షకుడిగా నియమించాడు ఎన్నో యుద్ధాలు చేసి వేలాది మందిని చంపాడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి నరకుడు అనేక వరాలు పొందాడు ఆ వరగర్వంతో ఋషులను లోకాల ప్రజలను బాధించేవాడు దేవతలను కూడా విడిచిపెట్టకుండా హింసించడం ప్రారంభించాడు.

దండయాత్ర చేసి ఇంద్రుని తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించాడు ప్రజాపతి భార్య అదితి కుండలాలను వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు సంచరించే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు మితిమీరిన కామం అంతులేని క్రోధం అంతకుమించిన లోభత్వం అన్నిటికన్నా అహంకారంతో చెలరేగిపోయాడు చేయాలో చూడలేక ఇంద్రుడు దేవతలు ద్వాపర యుగంలో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని నరకుడు నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు అందుకు అంగీకరించి గరుడవాహనంపై ఎక్కి నరకుడు మీద యుద్ధానికి వెళ్లబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి మీ యుద్ధ ఘోషలు ఎప్పుడూ వినడం తప్ప చూడలేదు నేను కూడా మీతో పాటు యుద్ధరంగానికి వచ్చి యుద్ధాన్ని చూసి ఆ విశేషాలు ఇక్కడ రాణులందరికీ వివరిస్తాను అని అంటుంది కాబట్టి సత్యభామను వెంటబెట్టుకొని గరుత్మంతునిపై ఆకాశమార్గంలో ప్రాగ్జ్యోతిషపురానికి నరకుడు మీద యుద్ధానికి వెళ్లాడు పట్టణం ఐదు రకాలైన పర్వతదుర్గం రాయదుర్గం జలదుర్గం అగ్నిదుర్గం వాయుదుర్గాలతో కూడి ఉంటుంది ఐదు ముఖాలు కలిగిన మురాసురుడు ఏర్పరిచిన కత్తిలాంటి పదునైన బలమైన ఆరు వేల పాశాలతో చుట్టుకొని ఉంటుంది ధనుష్టంకారం విని అక్కడి రాక్షసులు విష్ణుమూర్తి స్వయంగా వచ్చాడని గ్రహించారు మురాసురుడు శక్తి అనే ఆయుధాన్ని శ్రీకృష్ణునిపై విసరగా దాన్ని కృష్ణుడు తన బాణంతో రెండు ముక్కలు చేశాడు తర్వాత గదను విసరగా దాన్ని మధ్యలోనే చేదించి మరొక బాణంతో మురాసురుడి శిరస్సును ఖండించి పాశాలన్నింటిని చేదించి ముందుకు నడిచాడు కృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది అడ్డువచ్చిన అనేకమంది రాక్షసులను సంహరించి శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించి పాంచజన్యాన్ని పూరించాడు

నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణునిపై యుద్ధానికి బయలుదేరాడు ఇద్దరి మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు ధనస్సును ఎక్కుపెట్టి బాణాలతో నరకాసురుడి రథాన్ని సారథిని గుర్రాలను నేలకూల్చాడు ఆయుధాలు రథము అన్నీ ధ్వంసమైన తర్వాత నరకాసురుడు శూలాన్ని కృష్ణుడిపై విసరగా దాన్ని తన ఆయుధంతో ముక్కలు చేశాడు ఇక్కడ నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు శ్రీకృష్ణుడు రథంలో కూలబడ్డాడు సత్యభామ ధనస్సును చేపట్టి నరకాసురుడితో ఘోరయుద్ధం సాగించింది ఒకపక్క శ్రీకృష్ణుడి వైపు అమృత కిరణాలను ప్రసరిస్తూనే మరొకపక్క నరకుడిపై రౌద్ర బాణాలను విడిచింది కొంతసేపటికి శ్రీకృష్ణుడు స్వస్థుడై లేచి సత్యభామ సమేతంగా సుదర్శన చక్రంతో ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుని రెండు ముక్కలుగా నరికి వధించాడు ప్రజలంతా శ్రీకృష్ణుని స్తుతించారు సత్యభామను అభినందించారు భూదేవి తన పుత్రుని మరణం చూసి కుండలాలను తీసుకుని శోకంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి గోవిందా నీ వల్లనే ఈ పుత్రుడు కలిగాడు నీవే సంహరించావు వరాహ రూపంలో నీ అనుగ్రహంతో జన్మించిన పుత్రుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు వాటిని క్షమించి సన్మార్గంలో నడిపించవచ్చు కదా అన్నది అప్పుడు కృష్ణుడు వసుంధర నాపైన సద్భావం భక్తి లేని వారు ధర్మం తప్పిన వారు ఆత్మీయులైన నేను సహించను కంసుడు మొదలైన వారు ఏమయ్యారో నీకు తెలుసు కదా నన్ను ఎప్పుడు నమ్మి ధ్యానించే వారు రాక్షసులైనా సరే ఆదరిస్తాను.

అందుకు ప్రహ్లాదుడు విభీషణుడు సాక్షులు కనుక లోకానికి అపకారి అయిన నరకుడిని క్షమించలేను శిష్టరక్షణ ధర్మస్థాపన నా లక్ష్యం అని చెప్పాడు అప్పుడు భూదేవి నరకుడి కొడుకును రాజుగా చేయమని అడగడంతో కృష్ణుడు నరకాసురుడి కొడుకైన భగదత్తునికి రాజాధికారాన్ని ఇచ్చాడు భూదేవి రత్నాలు పొదిగిన బంగారు కుండలాలను వైజయంతి అనే వర్ణమాలను వరుణుడి తెల్లటి గొడుగును ఒక గొప్ప రత్నాన్ని సమర్పించి భక్తితో నమస్కరించింది నగరంలో ప్రవేశించి నరకుడు చెరలో ఉన్న 16000 మంది రాజకన్యలను చూశాడు ఆ రాజకుమార్తెలు శ్రీకృష్ణుని చూసి ఆకర్షితులై మోహించాయి కృష్ణుడే తమ భర్త అని భావించాయి తన ఆదరణ కోసం వేడుకుంటున్న ఆ 16000 మంది కన్న్యలకు తెల్లని వస్త్రాలు సర్వాభరణాలు పూలమాలలు పంపి వారందరినీ పల్లకుల్లో ఎక్కించి ద్వారకకు పంపించాడు తర్వాత దేవేంద్రుని పట్టణమైన అమరావతిలోని దేవమాత అదితి అంతఃపురానికి వెళ్లి కుండలాలను సమర్పించి నమస్కరించాడు నరకాసుర వధలో సత్యభామ పాత్ర గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప మరెవ్వరూ తనను సంహరించలేరనే వరం పొందాడట.

ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధంలో మూర్ఛపోయినట్లు నటించగా భూదేవి అవతారమైన సత్యభామ ధనస్సు ఎక్కుపెట్టి వదిలిన బాణంతో నరకుడు మరణించాడని చెప్తారు నరకాసురుడు మరణించాడని ప్రజలకు దేవతలకు తెలియడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు ఆ రోజు చీకటిని పారద్రోలుతూ తమ జీవితంలో వెలుగులు నింపేలా దీపాలను వెలిగించారు బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకున్నారు నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి తర్వాత రోజు దీపావళి జరుపుకుంటారు పుట్టుకతో ధర్మంతో భక్తితో ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాడు నడవడిలో ధర్మం దారి తప్పితే సాక్షాత్తు భగవంతుడే తన సంతానమైనా శిక్షించక తప్పదు అని సూచిస్తుంది నరకాసురుడు కథ.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top