ఇందుకే పెద్దవారు ఆవుకి ప్రదక్షిణలు చేయమనేది
భారతీయ సంస్కృతిలో హిందూమతంలో గోపూజకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భవిష్య పురాణం ప్రకారం ఆవులో మూడు లోకాలలోని మూడు వర్గాల దేవతలు నివసిస్తారు సనాతన సంప్రదాయంలో గోమాతకు చాలా ప్రాముఖ్యత ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదవ అధ్యాయం 28వ శ్లోకంలో ఆవు గురించి ఇలా పేర్కొన్నాడు జనానామస్మి కామధేను అంటే కోరికలను తీర్చే ఆవునని అర్థం ఆవుకు చేసే ప్రదక్షిణం ఎన్నో పాపాలను పోగొడుతుందని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని అంటారు ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయడం వలన ఆవు పాలు త్రాగడం వలన ఏ విధంగా ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం పూర్వకాలంలో ఎవరైనా వ్యక్తికి ఏదైనా అనారోగ్యం సంభవిస్తే 21 రోజుల పాటు ఆవు చుట్టూ ఉదయం సాయంత్రం ప్రదక్షిణ చేసి ఆ ఆవు పాలు త్రాగమని చెప్పేవారు ప్రతి రోజు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అతని శ్వాస ద్వారా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అతని నుండి వీచే గాలి ద్వారా అతని పాదధూళి ద్వారా ఆ గోమాత అతనికి ఉన్న అనారోగ్యాన్ని తెలుసుకునేది మేతకు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యాన్ని బట్టి వేర్లు మూలికలు తిని వచ్చి ఔషధ గుణాలతో నిండిన ఆవు పాలు తాగడం వలన క్రమంగా 21 రోజుల్లో ఆ వ్యక్తి అనారోగ్యం తగ్గిపోయేది ఎంత అద్భుతమో కదా కనుక ఆవుకు ప్రదక్షిణం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన సంస్కృతి వారసత్వమైన గోమాతను రక్షిద్దాం వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

