స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 121-130 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 121-130 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 121-130 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా |
దేహహృద్దీపికా దీప్తిర్జిహ్మపాపప్రణాశినీ || 121 ||
సర్వమంగళ సంపన్నా   – సకల ఐశ్వర్యాలతో నిండినది
సాక్షాన్మంగళ దేవతా      – మంగళకరమైన దేవత
దేహహృద్దీపికా             – హృదయమునందు ప్రకాశించు దీపిక
దీప్తి                         – కాంతితో ప్రకాశించునది
జిహ్మ పాప ప్రణాశినీ      – కుటిల బుద్ధిని, పాపములను నాశనం చేసేది

 

అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ |
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా || 122 ||
అర్ధచంద్రోల్లసదంష్ట్రా       – అర్ధచంద్రుని వలె మెరిసే దంతాలు కలిగినది
యజ్ఞవాటీ విలాసినీ       – యజ్ఞ వాటికయందు ఉండునది
మహాదుర్గా                 – దుర్గముడను రాక్షసుడిని సంహరించినది
మహోత్సాహా              – గొప్ప కార్యములు చేయుటకు ఉత్సాహము కలది
మహాదేవ బలోదయా    – మహాదేవుని బలమునకు కారణమైనది

డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ |
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా || 123 ||
డాకినీడ్యా        – విశుద్ధి చక్రానికి దేవత అయిన డాకినిచే పూజించబడునది
శాకినీడ్యా         – బందిన్యాది శక్తులతో కూడిన శాకినీచే స్తుతింపబడునది
సాకినీడ్యా        – మూలాధార దేవత అయిన సాకినిచే స్తుతింపబడునది
సమస్త జుట్      – సమస్త సృష్టిని లయము చేయునది
నిరంకుశా        – స్వతంత్రురాలు, దుష్టులను అణచివేయునది
నాకివంద్యా       – సకల దేవతలచే పూజింపబడునది
షడాధారాధి దేవతా – షట్చక్రాలకు అధిదేవత

భువనజ్ఞానినిఃశ్రేణీ భువనాకారవల్లరీ |
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ || 124 ||
భువన జ్ఞానినిశ్రేణి         – లోకాలలోని జనులు జ్ఞానమును పొందుటకు నిచ్చెన వంటిది
భువనాకార వల్లరీ         – సమస్త భువనములు అమ్మ రూపములు
శాశ్వతీ                      – శాశ్వతమైనది
శాశ్వతాకారా               – ఎప్పటికీ నశించని ఆకారము కలది
లోకానుగ్రహకారిణీ        – లోకాలను అనుగ్రహించునది

సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ |
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా || 125 ||
సారసీ                       – సారసము అనగా తామర పువ్వు. సారసములు గల తల్లి సారసి
మానసీ                     – మంచి మనస్సు కలిగినది
హంసీ                       – హంస రూపంలో నివసించేది, యోగిని స్వరూపిణి
హంసలోక ప్రదాయినీ  – యోగులకు సూర్యలోకమును ప్రసాదించునది
చిన్ముద్రాలంకృతకరా    – చిన్ముద్రతో కూడిన అరచేయి కలిగినది
కోటిసూర్య సమప్రభా   – కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలది

సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ |
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ || 126 ||
సుఖప్రాణి శిరోరేఖా        – సుఖముగా నివసించే ప్రాణుల నొసటిమీద రేఖ అమ్మ
సదదృష్ట ప్రదాయినీ       – భక్తులకు అదృష్టమును ప్రసాదించునది
సర్వ సాంకర్య దోషఘ్నీ   – అన్ని దోషాలను తొలగించునది
గ్రహోపద్రవ నాశినీ         – గ్రహాల వల్ల ఏర్పడే సమస్యలను తొలగించునది

క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ |
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ || 127 ||
క్షుద్ర జంతు భయఘ్నీ   – దుష్ట జంతువుల వల్ల కలిగే భయాన్ని పోగొట్టునది
విషరోగాది భంజనీ        – విషం వల్ల కలిగే వ్యాధులను దూరం చేయునది
సదా శాంతా                – ఎప్పుడూ ప్రశాంతంగా ఉండునది
సదా శుద్ధా                 – ఎప్పుడూ శుద్ధురాలై ఉండునది
గృహఛ్ఛిద్ర నివారిణీ       – గృహములో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడు కలతలను నివారించునది

కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా |
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యాకృతివర్జితా || 128 ||
కలిదోష ప్రశమనీ          – కలికాలమునందలి దోషములను ఉపశమింపచేయునది
కోలాహలపుర స్థితా       – కొల్హాపురమునందు కొలువై ఉన్నది
గౌరీ                          – తెల్లని శరీర వర్ణం కలది
లాక్షణికీ                     – ప్రత్యేక లక్షణాలను కలిగినది
ముఖ్యా                     – దేవతలలో ప్రధానమైనది
జఘన్యాకృతి వర్జితా      – సర్వ శుభ లక్షణములతో కూడిన ఆకృతి కలది

మాయావిద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా |
వాదినీ వసురూపా చ వసురత్నపరిచ్ఛదా || 129||
మాయా                    – జగత్తును నడిపించే మాయా శక్తి
అవిద్యా                     – దేహాత్మ భ్రాంతి తొలగించునది
మూలభూతా              – సమస్త సృష్టికి ప్రారంభమున ఉండి, ఆధారభూతమైనది
వాసవీ                      – ఇంద్రుని శక్తి
విష్ణుచేతనా                – విష్ణువు యొక్క చైతన్య శక్తి
వాదినీ                      – వీణా వాయిద్యములను పలికించునది
వసురూపా                 – సంపద స్వరూపిణి
వసు రత్న పరిచ్ఛదా     – బంగారు జరీతో, రత్నములు తాపించబడిన
                                      పట్టుచీరను ధరించినది

ఛాందసీ చంద్రహృదయా మంత్రాస్వచ్ఛందభైరవీ |
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా || 130 ||
ఛాందసీ                    – ఛందశ్శాస్త్ర స్వరూపిణి
చంద్రహృదయా            – చంద్రుని వంటి మనస్సు గలది
మంత్రా                      – వైదిక మంత్ర స్వరూపిణి
స్వచ్ఛంద భైరవీ           – భైరవ స్వరూపిణి
వనమాలా                  – వనపుష్పాలతో చేసిన మాలలను ధరించినది
వైజయంతీ                 – వైజయంతీ మాల ధరించింది
పంచదివ్యాయుధాత్మికా  – ఐదు దివ్య ఆయుధాలను ధరించినది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top