స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 81-90 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 81-90 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ |
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ || 81 ||
పాశాంకుశాన్వితా                   – రాగమనే పాశమును, క్రోధమనే అంకుశమును రెండు చేతులలో ధరించినది
దివ్యా                                 – దివ్యమైనది, శక్తివంతమైనది
వీణా వాఖ్యాక్ష సూత్రభృత్          – వీణ, పుస్తకం మరియు జపమాల పట్టుకున్నది
ఏకమూర్తి                             – పరాశక్తి స్వరూపిణి
త్రయీమూర్తి                         – లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే మూడు రూపాలు కలిగినది
మధుకైటభ భంజనీ                 – మధు కైటభులను రాక్షసులను సంహరించినది

సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ |
జాగ్రంతీ సర్వసంపత్తిః సుషుప్తా స్వేష్టదాయినీ || 82 ||
సాంఖ్యా           – సాంఖ్య యోగస్వరూపిణి
సాంఖ్యవతీ       – సాంఖ్యమునందు తెలుపబడిన తత్త్వములకు కారణమైనది
జ్వాలా            – జ్వాలా స్వరూపిణి
జ్వలంతీ          – ప్రకాశించేది
కామరూపిణీ     – తనకు నచ్చిన రూపాన్ని ధరించేది
జాగ్రంతీ           – ఎప్పుడూ మెలకువగా ఉండునది, స్థూల శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది
సర్వ సంపత్తిః    – సర్వ సంపత్తులనూ కలిగినది
సుషుప్తా          – గాఢ నిద్రలో ఉన్నది, కారణ శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది
స్వేష్టదాయిని    – కోరికలను తీర్చునది


కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీకుటిలాననా |
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ || 83 ||
కపాలినీ                     – కాళికా దేవి రూపంలో మెడలో కపాలములు ధరించినది, శివుని భార్య
మహాదంష్ట్రా                – పెద్ద దంతములు కలిగినది
భ్రుకుటీ కుటిలాలనా       – వంగిన మరియు దట్టమైన కనుబొమ్మలను కలిగినది
సర్వావాసా                 – జడచేతనములు ఆవాసముగా కలది
సువాసా                    – మంచి వ్యక్తులతో ఉండునది, మంచి వస్త్రము ధరించినది
బృహతీ                     – అందరికంటే గొప్పది
అష్టీ                         – ఎనిమిది రూపాలు గలది
శక్వరీ                       – శక్వరీ ఛందోరూపిణి

ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా |
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః || 84 ||
ఛందోగణ ప్రతిష్ఠా           – వేదములందు సుప్రతిష్టురాలై ఉన్న తల్లి
కల్మాషీ                     – అనేక వర్ణములు కలిగి ఉన్నది
కరుణాత్మికా               – దయగలది
చక్షుష్మతీ                  – అందరినీ రక్షించునది
మహాఘోషా                – వేద మంత్రోచ్ఛారణ చేసేది/ ఘోషించునది
ఖడ్గ చర్మ ధరా            – కత్తి మరియు డాలు ధరించినది
అశనిః                       – ఇంద్రుని వజ్రాయుధమునందలి శక్తి

శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ |
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా || 85 ||
శిల్ప వైచిత్ర్య విద్యోతా     – శిల్ప నిర్మాణ పరిజ్ఞానం కలది
సర్వతోభద్ర వాసినీ        – అన్ని ప్రదేశాలలో సురక్షితంగా ఉండునది
అచింత్య లక్షణాకారా      – శుభ లక్షణములు కలిగినది
సూత్రభాష్య నిబంధనా    – వేదాలకు వివరణలు వ్రాసే వ్యక్తుల రూపంలో ఉండునది

సర్వవేదార్థసంపత్తిః సర్వశాస్త్రార్థమాతృకా |
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా || 86 ||
సర్వ వేదార్థ సంపత్తి      – సర్వ స్మృతులు సంపదగా కలిగినది
సర్వ శాస్త్రార్ధ మాతృకా    – అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది, వేద మాత
అకారాది క్షకారాంతసర్వవర్ణకృత స్థలా    
                        – “అ” నుండి “క్ష” వరకు వర్ణమాలలోని అన్ని అక్షరాల స్వరూపం

సర్వలక్ష్మీః సదానందా సారవిద్యా సదాశివా |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా || 87 ||
సర్వలక్ష్మి                   – లక్ష్మీ స్వరూపిణి
సదానందా                 – ఎప్పుడూ సంతోషంగా ఉండేది
సారవిద్యా                  – జ్ఞానం యొక్క సారాంశం
సదాశివా                   – సదాశివుని భార్య
సర్వజ్ఞా                     – అన్నీ తెలిసినది
సర్వ శక్తిః                   – సర్వ శక్తి స్వరూపిణి
ఖేచరీ రూపగా             – ఎగిరే అన్ని ప్రాణుల రూపంలో ఉన్న ఆమె, ఖేచరీ ముద్రా రూపిణి
ఉచ్రితా                      – అందరికన్నా గొప్పదైనది

అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః |
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా || 88 ||
అణిమాది గుణోపేతా      – అణిమాది అష్ట సిద్ధి స్వరూపిణి
పరాకాష్ఠా                   – అంతటా వ్యాపించి ఉండు తల్లి
పరాగతిః                    – మోక్షమును పొందుటకు గొప్ప మార్గమైనది
హంసయుక్త విమానస్థా  – హంసలతో నిండిఉన్న సౌధమునందు ఉండునది
హంసారూఢా               – హంసపై ప్రయాణించేది
శశిప్రభా                     – చంద్రునిలా ప్రకాశించేది

భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా |
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ || 89||
భవానీ                      – శివుని భార్య
వాసనాశక్తిః                 – సకల ప్రాణుల ప్రతిభలో ఉండు వాసనాశక్తి
ఆకృతిస్థా                   – అన్ని ఆకృతులుగా రూపుదిద్దుకొన్నది
ఖిలా                        – సకల జీవరాశి స్వరూపము
అఖిలా                      – ప్రతిచోటా ఉండునది
తంత్ర హేతుః               – మొత్తం తంత్రాలకు కారణం అయినది
విచిత్రాంగి                   – ప్రకృతి శరీరముగా కలది
వ్యోమగంగా వినోదినీ      – ఆకాశ గంగ తీరమున వినోదించునది

వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ |
మహానదీ నదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా || 90 ||
వర్షా                         – వర్షమునకు కారణమైనది
వార్షికా                      – సంవత్సరమునకు పూజలందుకొని భక్తులను కరుణించేది
ఋగ్యజుస్సామ రూపిణీ -ఋక్, యజుర్, సామ వేదాల స్వరూపము
మహానదీ                   – గొప్ప నదీ స్వరూపిణి
నదీ పుణ్యా                – నదులు ప్రసాదించే పుణ్య స్వరూపము
గణ్యపుణ్య గుణక్రియా   – పుణ్య సుగుణాల వలన ముల్లోకాలలోనూ కీర్తిని పొందినది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top