శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 91-100 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా |
నామాక్షరపదా దేవీ ఉపసర్గనఖాంచితా || 91 ||
సమాధిగత లభ్యార్థా – అష్టాంగ యోగ సమాధి స్థితియందు దర్శనమిచ్చు తల్లి
శ్రోతవ్యా – వినతగినది
స్వప్రియా – తన స్వరూపమే అయిన సర్వసృష్టిని ప్రేమించు తల్లి
ఘృణా – తన భక్తుల యెడల మిక్కిలి కరుణ కలది
నామాక్షర పదాదేవీ – తన నామాక్షరములే తనకు స్థానముగా కలది
ఉపసర్గ నఖాంచితా – సరస్వతి స్వరూపిణి
నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ |
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా || 92 ||
నిపాతోరుద్వయీ- సరస్వతి స్వరూపిణి
జంఘామాతృకా – అకారము మొదలుకొని క్షకారము వరకుగల మాతృకలు అమ్మ కాలిపిక్కలుగా కలది
మంత్ర రూపిణి – వేదమంత్రాల స్వరూపిణి
ఆసీనా – ఆసనమునందు కూర్చుని ఉన్నది
శయనా – పానుపు మీద పడుకొని ఉన్నది
తిష్ఠంతీ – స్థిరముగా కూర్చుని ఉన్నది
ధావనా – అమ్మ యొక్క చైతన్య శక్తి
అధికా – అందరికంటే అధికురాలు
లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః |
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః || 93 ||
లక్ష్యలక్షణ యోగాఢ్యా – శాస్త్రములందు లక్ష్య లక్షణ యోగములను కలిగించునది
తాద్రూప్యగణనాకృతిః – విభిన్నమైన అనేక రూపాలను కలిగి ఉన్నది
సైకరూపా – ఒకే రూపాన్ని కలిగిన పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి
నైకరూపా – సర్వ శక్తి స్వరూపిణి
సేందురూపా – చంద్రుని రూపము గలది
తదాకృతిః – చంద్రుని వంటి ప్రసన్నమైన ఆకారము కలది
సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా |
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ || 94 ||
సమాస తద్ధితాకారా – సరస్వతీ స్వరూపిణి
విభక్తి వచనాత్మికా – వ్యాకరణ వాక్యంలో ఉన్నది
స్వాహాకారా – అగ్నికి భార్య అయిన స్వాహా స్వరూపిణి
స్వధాకారా – పితృదేవతలకు కవ్యాన్ని సమర్పించేటప్పుడు ఉచ్చరించే స్వధాకార స్వరూపిణి
శ్రీపత్యర్ధాంగ నందినీ – విష్ణువు యొక్క అర్ధాంగి
గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ |
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ || 95 ||
గంభీరా – గంభీర హృదయము కల తల్లి
గహనా – నిగూఢమైనది, తెలుసుకొనరానిది
గుహ్యా – రహస్యమైనది
యోనిలింగార్ధధారిణి – అర్ధనారీశ్వరిగా సమస్త సృష్టికి కారణమైనది
శేషవాసుకిసంసేవ్యా – ఆదిశేషుడు, వాసుకిచే సేవింపబడినది
చపలా – నిలకడ లేనిది
వరవర్ణిణీ – శ్రేష్టమైన రూపము కలది
కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా |
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాఽక్షయకామనా || 96 ||
కారుణ్యాకార సంపత్తిః – కారుణ్యము అనే సంపద కలిగినది
కీలకృత్ – జీవులలో జఠరాగ్నిని కలిగించునది
మంత్ర కీలకా – మంత్రములతో పూజింపబడుతున్నది
శక్తి బీజాత్మికా – మంత్రశక్తి, మంత్ర బీజ స్వరూపిణి
సర్వ మంత్రేష్టా – అన్ని మంత్రాలను ఇష్టపడేది
అక్షయ కామనా – ఎప్పటికీ తరిగిపోని సౌందర్యము కలిగినది
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా |
సత్యజ్ఞానాత్మికానందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ || 97 ||
ఆగ్నేయీ – పంచభూతములలో తేజస్సుగా పిలువబడే అగ్ని స్వరూపము
పార్థివా – పృధు చక్రవర్తి చేత పాలించబడినది, భూమి
ఆప్యా – జల స్వరూపిణి
వాయవ్యా – సమస్త ప్రాణికోటికి వాయువు నిచ్చునది
వ్యోమకేతనా – ఆకాశమంతటా వ్యాపించి ఉన్నది
సత్య జ్ఞానాత్మికానందా – సత్య, జ్ఞాన, ఆనంద స్వరూపిణి
బ్రాహ్మీ – బ్రహ్మ యొక్క శక్తి
బ్రహ్మ – బ్రహ్మ స్వరూపిణి, వేద స్వరూపిణి
సనాతనీ – ఎల్లప్పుడూ ఉండునది, నాశనం లేనిది
అవిద్యావాసనా మాయాప్రకృతిః సర్వమోహినీ |
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ || 98 ||
అవిద్యా వాసనా – జీవులకు నేను, నాది అనే అవిద్యా వాసనలను కలిగించునది
మాయా – మాయా స్వరూపిణి
ప్రకృతిః – పంచభూతాలతో కూడిన ప్రకృతి స్వరూపము
సర్వ మోహినీ – అందరినీ మోహింపజేయునది
శక్తిః – శక్తి స్వరూపిణి
ధారణ శక్తిః – అర్థం చేసుకుని, జ్ఞాపకముంచుకొనే శక్తి, స్మృతి శక్తి
చిదచిచ్చక్తియోగినీ – చిత్ అనగా కొంత, అచిత అనగా అంతా అని అర్ధము. కొంత శక్తి, పూర్ణమైన శక్తి, యోగశక్తి అమ్మయే
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ |
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నిరుపాస్తిః సుభక్తిగా || 99||
వక్త్రారుణా – ఎర్రని ముఖము కలది
మహామాయా – మహామాయా స్వరూపిణి
మరీచిః – సూర్యకిరణాలలో ప్రాణులను ఉత్తేజపరచే శక్తి
మదమర్దినీ – అహంకారమును నాశనము చేసేది
విరాట్ – సర్వోన్నతమైనది
స్వాహా – అగ్నిదేవుని భార్య అయిన స్వాహా రూపాన్ని ధరించినది
స్వధా – ప్రాణుల హృదయమునందు ఉన్నది
శుద్ధా – సత్త్వరజస్తమో గుణములు లేని శుద్ధమైనది
నిరూపాస్తి – అందరిచేత పూజింపబడునది
సుభక్తిగా – మంచి భక్తి ఉన్న వ్యక్తులను ఇష్టపడేది
నిరూపితాద్వయీ విద్యా నిత్యానిత్యస్వరూపిణీ |
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ || 100 ||
నిరూపితాద్వయీ విద్యా – అద్వైత విద్యను నిరూపించునది
నిత్యానిత్యస్వరూపిణీ – శాశ్వతమైన మరియు తాత్కాలికమైన ఆత్మ చైతన్య స్వరూపిణి
వైరాజమార్గసంచారా – పితృగణముల లోకములు విరజసములు.
ఆ మార్గంలో సంచరించునది
సర్వ సత్పథ దర్శినీ – అందరికీ సరైన మార్గాన్ని చూపునది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్సైట్లోని ఇతర పోస్ట్లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




