మూక పంచశతీ తెలుగులో అర్థం కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము […]