భారతీయ సంస్కృతి

మూక పంచశతీ తెలుగులో అర్థం 2

మూక పంచశతీ తెలుగులో అర్థం 2 కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ ।పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥ కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ ।కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥ అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర […]

Read More

మూక పంచశతీ తెలుగులో అర్థం 1

మూక పంచశతీ తెలుగులో అర్థం కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా ।కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలతా ॥1॥ పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై, కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పూవుల గుత్తులు కలిగిన తీగవంటి శరీరము కలిగి, దయాసముద్రురాలైన, వర్ణించనలవికాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీనిలయం కరధృతకోదండబాణసృణిపాశమ్ ।కఠినస్తనభరనమ్రం కైవల్యానందకందం అవలంబే ॥2॥ ఆ శక్తి కాంచీ నగరము నుదుటి తిలకము వంటిది. ఆమె తన నాలుగు చేతులలో పాశము, విల్లు, బాణములు అంకుశము […]

Read More

మూక పంచశతీ తెలుగులో అర్థం

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని […]

Read More

Sree Rama Raksha stotram meaning in telugu

 శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ […]

Read More

Hanuman Bahuk Meaning in telugu

హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల సూర్యునివంటి దేహకాంతి […]

Read More

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను. […]

Read More

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం

కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజంవ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే|| 1|| ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడుపామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తల మీద చంద్ర వంక కలవాడు, అత్యంత కరుణ గల వాడునారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడుకాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరంనీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరంకాశికా పురాధినాథ కాలభైరవం భజే||2|| అనేక సూర్యుల తేజస్సు కలవాడు, జనన మరణ […]

Read More

Govinda namalu meaning in telugu

గోవిందా నామాలు – తెలుగులో అర్థం గోవిందాహరి గోవిందా-మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు. గోకుల నందనగోవిందా-ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు. శ్రీశ్రీనివాసా గోవిందా-‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవిందా-తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవిందా-నిత్యమూ భగవంతుణ్ణే త్రికరణశుద్ధిగా కొలిచే […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాతకామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిదిక్షయ వినిర్ముక్తా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణిప్రేమరూపా : ప్రేమమూర్తిప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునదినామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినదినందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషమునటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 […]

Read More
TOP