స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 61-70 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 61-70 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా |
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ || 61 ||
కేతకీ               – మొగలి పూవులయందు మక్కువ కలది
మల్లికా             – మల్లెపూల యందు ప్రీతి కలది
అశోకా              – దుఃఖం లేనిది
వారాహీ            – శ్రీమహావిష్ణువు యొక్క వరాహావతారం యొక్క శక్తి
ధరణీ                – భూమి
ధ్రువా                – స్థిరమైనది
నారసింహీ          – మహావిష్ణువు యొక్క నరసింహ అవతారం యొక్క శక్తి
మహోగ్రాస్యా       – భయంకరమైన ముఖము కలది
భక్తానామార్తినాశినీ – భక్తుల దుఃఖాలను నశింపజేసేది


అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ |
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా || 62 ||
అంతర్బలా                 – మానసికంగా దృఢంగా ఉన్నది
స్థిరా                         – శాశ్వతమైనది
లక్ష్మీః                        – మంచి లక్షణాలను కలిగి ఉన్నది
జరామరణ నాశినీ         – వృద్ధాప్యాన్ని, మరణాన్ని నిరోధించునది
శ్రీరంజితా                   – శోభ చేత, అలంకారముల చేత, కీర్తి చేత భక్తులను రంజింపజేయునది
మహాకాయా               – గొప్ప తేజస్సుతో కూడిన శరీరము కలది
సోమసూర్యాగ్నిలోచనా   – చంద్రుడు, సూర్యుడు, అగ్ని కన్నులుగా కలిగినది


అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ |
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః || 63 ||
అదితిః దేవమాతా        – దేవతలందరికీ తల్లి అయిన అదితి
అష్టపుత్రా                   – అష్టదిక్కులు పుత్రులుగా గల భూదేవీ స్వరూపిణీ
అష్టయోగినీ         – ఆమె యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి అనే ఎనిమిది యోగాలు తన స్వరూపముగా కలది
అష్ట ప్రకృతిః           – పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను అష్ట విధాలైన ప్రకృతులు అమ్మ స్వరూపాలు
అష్టాష్ట విభ్రాజ ద్వికృతాకృతిః        – కళలలో ప్రకాశించేది,  యోగినుల స్వరూపము

దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ |
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ || 64 ||
దుర్భిక్షధ్వంసినీ దేవీ     – కరువు కాటకాలను నాశనం చేయు తల్లి
సీతా                        – శ్రీరాముని భార్య
సత్యా                       – శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సత్య, పరబ్రహ్మ స్వరూపిణి
రుక్మిణి                      – శ్రీకృష్ణుని భార్య రుక్మిణి
ఖ్యాతిజ                     – భృగు మహర్షి, ఖ్యాతి దంపతులకు పుట్టినది
భార్గవీ దేవి                 – భృగు మహర్షి కుమార్తె
దేవయోనిః                 – దేవతలందరికీ జన్మనిచ్చింది
తపస్వినీ                   – తపస్సు చేయునది

శాకంబరీ మహాశోణా గరుడోపరిసంస్థితా |
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా || 65 ||
శాకంబరీ                    – శాకంబరీ అవతారము దాల్చినది
మహాశోణా                 – మిక్కిలి ఎర్రనైనది
గరుడోపరి సంస్థితా        – గరుడ వాహనముపై కూర్చున్నది
సింహగా                    – సింహం మీద ప్రయాణించేది
వ్యాఘ్రగాదేవి               – పులి వాహనముగా కలది
వాయుగా                   – వాయువును కదిలేలా చేయునది
మహాద్రిగా                  – గొప్ప పర్వతములందు సంచరించునది

అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా |
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిఃశాస్త్రైకలోచనా || 66 ||
అకారాది క్షకారాంతా                – అ నుండి క్ష వరకు అక్షరముల రూపమై ఉన్నది
సర్వవిద్యాధిదేవతా                 – అన్ని విద్యలకు అధిదేవత
మంత్ర వ్యాఖ్యాన నిపుణా           – మంత్రాలను వివరించడంలో నిపుణురాలు
జ్యోతిశ్సాస్త్రైక లోచనా               – భవిష్యత్తును తెలుసుకోగల తల్లి

ఇడాపింగళికామధ్యసుషుమ్నా గ్రంథిభేదినీ |
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ || 67 ||
ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంథి విభేదినీ
                        – ఇడా, పింగళ నాడి మధ్య ఉన్న సుషుమ్న నాడి మధ్యనున్న మూలాధార చక్రమునందుండు కుండలినీ శక్తి
కాలచక్రాశ్రయోపేతా – కాలచక్రముతో కూడుకొని ఉన్న శక్తి అమ్మ
కాలచక్ర స్వరూపిణి  – కాలచక్రము అమ్మ స్వరూపమే

వైశారదీ మతిశ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా |
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వళిః || 68 ||
వైశారదీ           – గొప్ప పాండిత్యము కలది
మతిశ్రేష్ఠా         – అత్యంత తెలివైనది
వరిష్ఠా             – ఉత్తమమైనది
సర్వ దీపికా      – ప్రతి ఒక్కరికీ వెలుగునిచ్చేది
వైనాయకీ        – వినాయకుని శక్తి
వరారోహా         – గొప్ప ఔన్నత్యము కలది
శ్రోణివేలా          – అనాయాసమైన మరణములకు మార్గమైనది
బహిర్వళి         – ఉదరమునందు మూడు ముడుతలు కలది


జంభినీ జృంభిణీ జృంభకారిణీ గణకారికా | [జంభ]
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ || 69||
జంభినీ                     – ధనుర్బాణములు కలది
జృంభిణీ                    – శత్రువులపై పరాక్రమమును చూపించునది
జృంభకారిణీ                – బాగుగా నోరు తెరిచి ఉండునది, కాళికా దేవి
గణకారికా                  – ప్రమధ గణములను ఏర్పరచినది
శరణీ                        – పోషించి, రక్షించునది
చక్రికా                       – దివ్య చక్రము కలిగినది
అనంతా                    – అంతం లేనిది
సర్వవ్యాధి చికిత్సకీ        – సర్వ వ్యాధులనూ నయం చేయునది

దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా |
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజినీ || 70 ||
దేవకీ                        – కృష్ణుని తల్లి
దేవ సంకాశా               – దేవతలకు సమీపముగా ఉండి కష్టములను తీర్చునది
వారిధిః                      – పంచభూతములలో రెండవదైన జలము అనగా సముద్రము అమ్మ రూపమే
కరుణాకరా                 – కరుణా స్వరూపిణి
శర్వరీ                       – రాత్రి స్వరూపిణి, ప్రజల నుండి చీకటిని
                                      (అజ్ఞానాన్ని) తొలగిస్తుంది
సర్వ సంపన్నా            – అన్ని రకాల సంపదలను కలిగి ఉంది
సర్వ పాప ప్రభంజనీ      – సర్వ పాపములను పోగొట్టునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top