హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా హిందూ భక్తి సాహిత్యంలో అత్యంత శక్తివంతమైన స్తోత్రం “శ్రీ హనుమాన్ చాలీసా”. స్వామివారి అపారమైన బలాన్ని, కరుణను వర్ణించే ఈ స్తోత్రాన్ని పఠిస్తే సకల భయాలు తొలగిపోతాయి. బాలగంగాధర తిలక్ అన్నట్లుగా ఇది “ప్రతి హిందువు ఇంట ఉండవలసిన మహా మంత్రం”. 16వ శతాబ్దంలో గొప్ప రామభక్తుడైన గోస్వామి తులసీదాసు (Goswami Tulsidas) దీనిని సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే ‘అవధి’ (ప్రాచీన హిందీ) మాండలికంలో రచించారు. ‘చాలీసా’ అనగా హిందీలో నలభై (40). […]


