గోదాదేవి చరిత్ర
గోదాదేవి చరిత్ర అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. గోదాదేవిని కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్తమాల్యద అని కూడా పిలుస్తారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆ స్వామిని ఎలా మెప్పించింది? ఏ వ్రతం ఆచరించింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి తులసివనంలో అయోనిజగా ప్రత్యక్షమైంది. శ్రీవిల్లిపుత్తూరుకు సంబంధించిన ఒక పురాణగాథ ఉంది. వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని […]


