Govinda Namavali devotional image

గోవింద నామావళి

గోవింద నామావళి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీమహావిష్ణువు యొక్క దివ్య నామాలను భక్తితో స్మరించే పవిత్రమైన నామసంకీర్తన. “గోవింద” అనే నామం శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన నామాలలో ఒకటిగా భావించబడుతుంది. గోవిందుని వివిధ నామాలు, గుణాలు, మహిమలను స్మరిస్తూ భక్తులు ఈ నామావళిని పఠిస్తారు.

గోవింద నామావళి పారాయణం లేదా నామస్మరణ భక్తిశ్రద్ధలతో చేయడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోవింద నామాలను స్మరించడం ద్వారా మనశ్శాంతి, భక్తి భావం, ఆధ్యాత్మిక చైతన్యం, ఏకాగ్రత మరియు ధైర్యం పెరుగుతాయని సంప్రదాయంగా భావిస్తారు. ఉదయం పూజా సమయంలో, దేవాలయ ఆరాధనలో లేదా నిత్య నామస్మరణగా గోవింద నామావళిని పఠించవచ్చు. గోవింద నామావళి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సులభమైన మరియు మధురమైన నామస్మరణ సాధనగా ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది.

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 1 ॥

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 2 ॥

నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 3 ॥

దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 4 ॥

వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా
గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా [గోపీజనలోల]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 5 ॥

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 6 ॥

మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 7 ॥

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 8 ॥

సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
శ్రితజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా [దరిద్రజన పోషక]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 9 ॥

అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
భక్తవత్సలా గోవిందా కరుణాసాగర గోవిందా [శరణాగతవత్సల]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 10 ॥

కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 11 ॥

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 12 ॥

పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త గోవిందా మత్స్యావతార గోవిందా [ప్రదర్శక]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 13 ॥

శంఖచక్రధర గోవిందా శార్​ఙ్గగదాధర గోవిందా
విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 14 ॥

సాలగ్రామ[ధర] గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 15 ॥

కస్తూరితిలక గోవిందా కనకాంబరధర గోవిందా [కాంచనాంబరధర]
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 16 ॥

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏకస్వరూప గోవిందా రామకృష్ణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 17 ॥

భక్తనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 18 ॥

వైజయంతిమాల గోవిందా వడ్డికాసుల గోవిందా
వసుదేవసుత గోవిందా శ్రీవాసుదేవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 19 ॥

నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
నీలాద్రివాస గోవిందా నీలమేఘశ్యామ గోవిందా [క్షీరాబ్ఢివాస]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 20 ॥

స్వయం ప్రకాశ గోవిందా ఆనందనిలయ గోవిందా
శ్రీదేవినాథ గోవిందా దేవకి నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 21 ॥

తిరుమలవాస గోవిందా రత్నకిరీట గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా నిత్యశుభప్రద గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 22 ॥

ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 23 ॥

పద్మదలాక్ష గోవిందా తిరుమలనిల్య గోవిందా
శేషశాయినీ గోవిందా శేషాద్రినిలయ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 24 ॥

వరాహ ౠప గోవిందా శ్రీ కూర్మరూప గోవిందా
వామనౠప గోవిందా నరహరిరూప గోవిందా [హరిహరౠప]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 25 ॥

శ్రీ పరశురామ గోవిందా శ్రీ బలరామ గోవిందా
రఘుకుల రామ గోవిందా శ్రీ రామకృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 26 ॥

తిరుమలనాయక గోవిందా శ్రితజనపోషక గోవిందా
శ్రీదేవినాథ గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 27 ॥

గోవిందానామ గోవిందా వేంకటరమణా గోవిందా
క్షేత్రపాలక గోవిందా తిరుమలనాథ గోవిందా ।
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 28 ॥

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 29 ॥

శ్రీ రామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 30 ॥

వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 31 ॥

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 32 ॥

నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 33 ॥

జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 34 ॥

రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 35 ॥

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 36 ॥

ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 37 ॥

తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ గోవిందా] ॥ 38 ।

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top