క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది. […]
Category: పురాణాలు
పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి
కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్ అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం […]
మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల […]