శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత సప్తదశ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము – మూడు రకాల శ్రద్ధలు, ఆహారం, యజ్ఞం మరియు తపస్సు గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద […]

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము Read More »

శ్రీమద్భగవద్గీత షోడశ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము – దైవీ మరియు ఆసురీ గుణాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు

భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము

భగవద్గీత తెలుగులో అర్థం 16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి.

భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము Read More »

శ్రీమద్భగవద్గీత పంచదశ అధ్యాయము పురుషోత్తమయోగము – అశ్వత్థ వృక్షం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణుని తత్వం

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము Read More »

శ్రీమద్భగవద్గీత చతుర్దశ అధ్యాయము గుణత్రయ విభాగయోగము – సత్త్వ, రజో, తమో గుణాల స్వభావం గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము

భగవద్గీత తెలుగులో అర్థం 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ

భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము Read More »

శ్రీమద్భగవద్గీత త్రయోదశ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము – శరీరం, ఆత్మ మరియు పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు.  కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.  ఋషులు ఎన్నో

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము Read More »

శ్రీమద్భగవద్గీత ద్వాదశ అధ్యాయము భక్తియోగము – అనన్యభక్తి మరియు భగవంతుని పట్ల ప్రేమ గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 12  వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము Read More »

శ్రీమద్భగవద్గీత ఏకాదశ అధ్యాయము విశ్వరూపదర్శనయోగము – అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము Read More »

శ్రీమద్భగవద్గీత దశమ అధ్యాయము విభూతియోగము – శ్రీకృష్ణుని దివ్య విభూతులు మరియు విశ్వవ్యాప్తమైన పరమాత్మ స్వరూపం

భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 10  వ అధ్యాయం –విభూతి యోగము నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి,

భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము Read More »

శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం – రాజవిద్యా రాజగుహ్యయోగము

భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా

భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము Read More »

శ్రీమద్భగవద్గీత నవమ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము – భక్తి, పరమాత్మ తత్వం మరియు దివ్య రహస్య జ్ఞానం గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి?  ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము Read More »

Scroll to Top