గోవిందా నామాలు – తెలుగులో అర్థం గోవిందాహరి గోవిందా-మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు. గోకుల నందనగోవిందా-ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు. శ్రీశ్రీనివాసా గోవిందా-‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవిందా-తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవిందా-నిత్యమూ భగవంతుణ్ణే త్రికరణశుద్ధిగా కొలిచే […]