సహస్ర చంద్ర దర్శనం మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి సహస్ర చంద్ర దర్శనం. దీన్నే శతాభిషేకం, సహస్ర పూర్ణ చంద్రోదయం,చంద్ర రథారోహణం అని కూడా అంటారు. దూరమైన బంధువుల్ని, మర్చిపోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి, వారి సమక్షంలో చేసుకునే వేడుక ఇది. సహస్ర చంద్ర దర్శనం అనేది దంపతులకు లేదా ఒక్కరికి – […]