దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను. […]