మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల […]
Month: November 2024
భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరికొంతమంది యజ్ఞం, దానం, […]
భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద ఉంటుందో, వాడు అలాంటి […]
భగవద్గీత 16 వ అధ్యాయం –దైవాసుర సంపద్విభాగయోగము
16 వ అధ్యాయం – దైవాసుర సంపద్విభాగయోగము అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంచించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ, దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగతాయి. పార్ధా! రాక్షస సంపదలో […]
భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము
15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం కాని, ఆది మధ్యంతాలు […]
భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నీటికి మూల […]
భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు. కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం. ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర […]
భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము
12 వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం […]
భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము
11 వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను. నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు […]
భగవద్గీత 10 వ అధ్యాయం – విభూతి యోగము
10 వ అధ్యాయం –విభూతి యోగము నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, […]
భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము
9 వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా రూపం, ఈ విశ్వమంతా […]
భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్ధాలను […]
భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము
7 వ అధ్యాయం -జ్ఞాన విజ్ఞాన యోగము అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ది, అహంకారం. […]
భగవద్గీత 6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు […]
భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి […]
భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం సుమా! అన్నాడు. దానికి […]
భగవద్గీత 3 వ అధ్యాయం – కర్మ యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి సాంఖ్యూలకు జ్ఞానయోగం. […]
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే, బిచ్చమెత్తుకోవడం […]
1 వ అధ్యాయం – అర్జున విషాద యోగము
ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. -భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. మహాభారతంలో శ్రీమద్భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. సొంతవారు నాచే చంపబడుతున్నారు అన్న మొహం అర్జునుణ్ణి ఆవహించి విషాదాన్ని కలుగజేయగా, యుద్ధం చేయనన్న అర్జునుడి విషాదాన్ని […]
చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనంశింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితంచంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥ పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితంఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయంచంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥ మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరంపంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి […]
శివాష్టకం
శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ వటాధో […]
శ్రీ రుద్రం – చమకప్రశ్నః
శ్రీ రుద్రం – చమకప్రశ్నః ఓం అగ్నా॑విష్ణో స॒జోష॑సే॒మావ॑ర్ధంతు వాం॒ గిరః॑ ।ద్యు॒మ్నైర్వాజే॑భి॒రాగ॑తమ్ ।వాజ॑శ్చ మే ప్రస॒వశ్చ॑ మే॒ప్రయ॑తిశ్చ మే॒ ప్రసి॑తిశ్చ మేధీ॒తిశ్చ॑ మే క్రతు॑శ్చ మే॒స్వర॑శ్చ మే॒ శ్లోక॑శ్చ మేశ్రా॒వశ్చ॑ మే॒ శ్రుతి॑శ్చ మే॒జ్యోతి॑శ్చ మే॒ సువ॑శ్చ మేప్రా॒ణశ్చ॑ మేఽపా॒నశ్చ॑ మేవ్యా॒నశ్చ॒ మేఽసు॑శ్చ మేచి॒త్తం చ॑ మ॒ ఆధీ॑తం చ మే॒వాక్చ॑ మే॒ మన॑శ్చ మే॒చక్షు॑శ్చ మే॒ శ్రోత్రం॑ చ మే॒దక్ష॑శ్చ మే॒ బలం॑ చ మ॒ఓజ॑శ్చ మే॒ సహ॑శ్చ మ॒ఆయు॑శ్చ మే జ॒రా చ॑ […]
శ్రీ రుద్రం నమకం
శ్రీ రుద్రం నమకం కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితాచతుర్థం-వైఀశ్వదేవం కాండం పంచమః ప్రపాఠకః ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥నమ॑స్తే రుద్ర మ॒న్యవ॑ ఉ॒తోత॒ ఇష॑వే॒ నమః॑ ।నమ॑స్తే అస్తు॒ ధన్వ॑నే బా॒హుభ్యా॑ము॒త తే॒ నమః॑ ॥ యా త॒ ఇషుః॑ శి॒వత॑మా శి॒వం బ॒భూవ॑ తే॒ ధనుః॑ ।శి॒వా శ॑ర॒వ్యా॑ యా తవ॒ తయా॑ నో రుద్ర మృడయ । యా తే॑ రుద్ర శి॒వా త॒నూరఘో॒రాఽపా॑పకాశినీ ।తయా॑ నస్త॒నువా॒ శంత॑మయా॒ గిరి॑శంతా॒భిచా॑కశీహి ॥ యామిషుం॑ […]
శ్రీ రుద్రం లఘున్యాసం
శ్రీ రుద్రం లఘున్యాసం ఓం అథాత్మానగ్ం శివాత్మానం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ॥శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ ।గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ॥నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ ।వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ॥కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ ।జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ॥వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణమ్ ।అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ॥దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ ।నిత్యం చ శాశ్వతం శుద్ధం […]
శివ తాండవ స్తోత్రం
శివ తాండవ స్తోత్రం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ--విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురస్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురేమనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా--నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।సుధామయూఖలేఖయా విరాజమానశేఖరంమహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ […]