google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

“Illustration of Lord Vishnu sitting on Sheshnag with symbols of the Vishnu Sahasranamam, decorative Sanskrit script background, and baby boy names highlighted”

విష్ణు సహస్రనామంలోని మగ పిల్లల పేర్లు

విష్ణు సహస్రనామంలోని మగ పిల్లల పేర్లు

విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి.

అగ్రాహ్య – ఇంద్రియ, మనో, బుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు
అచ్యుత – ఎట్టి వికారములకు లోనుకానివాడు, ఎటువంటి మార్పు పొందనివాడు
అశోక – శోకము లేనివాడు
అర్ణవ – జ్ఞాన సముద్రమువంటి వాడు
అతుల – సాటిలేనివాడు
అనయ – తనను నడిపించువాడు మరొకడు లేనివాడు
అజిత – ఎవరికి తలవొగ్గని, జయింపలేనివాడు
అనీశ – తనకు ప్రభువు గాని నియామకుడు గాని లేనివాడు
అర్చిష్మాన్ – తేజోరూపుడు
అర్చిత – సమస్త లోకములచే పూజింపబడువాడు
అనిరుద్ధ – శత్రువులచే అడ్డగింపబడనివాడు
అనంత – అంతము లేనివాడు, సర్వత్రా సర్వకాలములందు ఉండువాడు
అర్క – శ్రేష్ఠులైన బ్రహ్మాదులచే అర్చించబడువాడు
అనిల – ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు
అశ్వత్థ – అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు
అనఘ – పాపరహితుడు
అచింత్య – చింతించుటకు వీలుకానివాడు

అనంతజిత్ – అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించువాడు
అవ్యయ – వినాశము లేనివాడు
అధోక్షజ – ఇంద్రియాలకు అతీతమైనవాడు
అధృత – స్వతంత్రుడు, అందరిచేత ప్రేమించబడువాడు
అమితవిక్రమ – అమితమైన పరాక్రమము కలవాడు
అనుత్తమ – అందరిలో ఉత్తముడు

ఆదిత్య – అదితి కుమారుడు, సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు
ఆదిదేవ – తొలి దేవుడు
ఆనంద – ఆనంద స్వరూపుడు
ఆశ్రిత – అందరికీ ఆశ్రయమైనవాడు

ఈశ్వర – స్వయంప్రభువు, సర్వశక్తిమంతుడు
ఈశాన – సర్వభూతములను శాసించువాడు

ఉపేంద్ర – ఇంద్రునికి అన్నయైన వాడు (వామన రూపంలో)
ఉద్భవ – ఉత్కృష్ట జన్మ గలవాడు

కేశవ – కేశి అసురుని సంహరించినవాడు
కృష్ణ – సచ్చిదానంద స్వరూపుడు, నీలమేఘ శ్యాముడు
కుముద – భూమి భారాన్ని తొలగించి సంతోషం కలిగించువాడు
కపిల – ఋషులలో కపిలుడు

గోవింద – గోవులను రక్షించువాడు, భూమికి ఆధారభూతుడు

చక్రీ – సుదర్శన చక్రమును ధరించినవాడు
చంద్రాంశు – చంద్రునివలె ప్రకాశించువాడు

జనార్దన – జనులకు ఆనందం కలిగించువాడు
జయ – సర్వులను జయించువాడు
జయంత – విజయానికి ఆధారభూతుడు
జితమన్యు – క్రోధరహితుడు
జీవన – సర్వజీవులలో ప్రాణశక్తి
జనేశ్వర – జనులందరికీ ఈశ్వరుడు

త్రివిక్రమ – మూడు అడుగులతో ముల్లోకాలను వ్యాపించినవాడు
త్రిలోకేశ – మూడు లోకాలకు ప్రభువు

దామోదర – ఉదారబుద్ధితో పొందబడువాడు
దేవ – దేవదేవుడు
దక్ష – సమర్థతతో కర్మలను నిర్వర్తించువాడు
దేవకీనందన – దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు
దేవేశ – దేవతలకు ప్రభువు
దుర్జయ – జయించలేనివాడు

ధ్రువ – స్థిరుడు, అవినాశి
ధర్మ – ధర్మ స్వరూపుడు
ధనంజయ – ధనాన్ని జయించినవాడు
ధనేశ్వర – సంపదకు అధిపతి
ధనుర్ధర – ధనస్సు ధరించినవాడు
దుర్లభ – పొందుటకు అరుదైనవాడు
ద్యుతిధర – తేజస్సు కలవాడు

నారాయణ – నరులకు ఆశ్రయమైనవాడు
నందన – ఆనందం ప్రసాదించువాడు
నంద – విషయసుఖాలకు అతీతుడు

పద్మనాభ – నాభిలో పద్మము గలవాడు
ప్రభు – సర్వానికి ప్రభువు
పురుషోత్తమ – పురుషులందరిలో ఉత్తముడు
పర్జన్య – వర్షాన్ని కురిపించువాడు
పవన – పవిత్రం చేయువాడు
పరమేశ్వర – పరమేశ్వరుడు
ప్రీతివర్ధన – భక్తుల ప్రేమను వృద్ధి చేయువాడు
ప్రణవ – ఓంకార స్వరూపుడు
ప్రమోద – ఆనందమయుడు
ప్రభవ – శక్తిశాలి
ప్రద్యుమ్న – విశిష్ట సంపద కలవాడు
పుండరీకాక్ష – కమల నేత్రుడు
పురంధర – ఇంద్రుడు

బ్రాహ్మణ్య – బ్రహ్మను అభిమానించువాడు
బ్రహ్మ – సృష్టికర్త
బ్రహ్మవర్ధన – సృష్టిని వృద్ధి చేయువాడు
బ్రహ్మజ్ఞ – బ్రహ్మతత్త్వాన్ని తెలిసినవాడు
భూషణ – ఆభరణములు ధరించినవాడు
బ్రహ్మవిత్ – బ్రహ్మజ్ఞాని

భాను – స్వప్రకాశుడు
భగవాన్ – ఆరు ఐశ్వర్య గుణములు కలవాడు

మను – మననము చేయువాడు
మాధవ – లక్ష్మీదేవికి భర్త
మధుసూదన – మధు రాక్షసుని సంహరించినవాడు
మధు – మధుర స్వరూపుడు
మహేంద్ర – దేవేంద్రునికి ప్రభువు
మహీధర – భూమిని ధరించినవాడు
మహార్ధి – మహావిభూతులు కలవాడు
మనోహర – మనస్సులను హరించువాడు
మహాదేవ – గొప్ప దేవుడు
ముకుంద – ముక్తి ప్రసాదించువాడు
మహర్షి – మహా ఋషి
మహాతేజ – గొప్ప తేజస్సు గలవాడు
మహాన్ – దేశకాలాతీతుడు
మహావీర – గొప్ప వీరుడు

యజ్ఞభృత్ – యజ్ఞాలను సంరక్షించువాడు
యజ్ఞకృత్ – యజ్ఞాలను నిర్వహించువాడు

రుద్ర – దుఃఖాన్ని తొలగించువాడు
రోహిత – మత్స్యరూపుడు
రవి – సూర్యరూపుడు
రామ – నిత్యానంద స్వరూపుడు
రథాంగపాణి – చక్రధారి
రత్ననాభ – రత్నములు ధరించినవాడు
రవిలోచన – సూర్యసమాన నేత్రములు కలవాడు

లోహితాక్ష – ఎర్రని నేత్రములు గలవాడు
లోకనాథ – లోకాల ప్రభువు
లక్ష్మీవాన్ – సంపద కలవాడు

విష్ణు – విశ్వవ్యాపి
విక్రమ – శౌర్యవంతుడు
విష్వక్సేన – అసురసేనలను జయించినవాడు
వేదవిత్ – వేదజ్ఞాని
విజయ – విజయప్రదుడు
విశిష్ట – శ్రేష్ఠుడు
వర్ధన – శ్రేయస్సును వృద్ధి చేయువాడు
వర్ధమాన – వృద్ధి చెందువాడు
వేగవాన్ – వేగశాలి
విశ్రాంతి – పరమ విశ్రాంతి స్థానం
విదారణ – దుష్టులను సంహరించువాడు
వినయ – వినయాన్ని కలిగించువాడు
వరుణ – జలాధిపతి
విశోక – శోకరహితుడు
విశోధన – పాపనాశకుడు
వీర – వీరత్వముగలవాడు
వాసుదేవ – వాసుదేవుని కుమారుడు
వంశవర్ధన – వంశాన్ని వృద్ధి చేయువాడు
వాసు – సంపద కలవాడు
వేదాంగ – వేదాంగ స్వరూపుడు

శ్రీమాన్ – లక్ష్మీ సమేతుడు
శర్వ – సంహారకుడు
శివ – శుభప్రదుడు
శ్రీనివాస – లక్ష్మీ నివాసుడు
శౌరి – శూరవంశంలో జనించినవాడు
శత్రుఘ్న – శత్రువులను సంహరించువాడు
శ్రీవత్స – లక్ష్మీచిహ్నం గలవాడు
శ్రీపతి – లక్ష్మీపతి
శ్రీధర – లక్ష్మీధారి
శంభు – శుభకర్త
శ్రీకర – శుభప్రదుడు
శతానంద – అనేకానందములు గలవాడు
శూరసేన – శూరసైన్యాధిపతి
శతానన – అనేక ముఖములు గలవాడు
శుభాంగ – సుందర అవయవములు గలవాడు
శత్రుజిత్ – శత్రువులను జయించువాడు
శిశిర – శాంతికరుడు

సురేశ – దేవతలకు ప్రభువు
సిద్ధ – సంపూర్ణుడు
సత్య – సత్యస్వరూపుడు
సింహ – పాపనాశకుడు
సిద్ధార్థ – లక్ష్యసాధకుడు
సుదర్శన – సుందర దర్శనముగలవాడు
సుషేణ – శోభన సేన గలవాడు
సుందర – సౌందర్యవంతుడు
సులోచన – సుందర నేత్రములు గలవాడు
సర్వజ్ఞ – సర్వజ్ఞుడు
సూర్య – ప్రాణశక్తి ప్రసాదకుడు
సురేశ్వర – దేవతాధిపతి

హృషీకేశ – ఇంద్రియాల ప్రభువు
హరి – సంసారదుఃఖ నాశకుడు
హేమాంగ – బంగారు వర్ణ అవయవములు గలవాడు

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top