సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 21. శ్లోకం తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీంనిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్,మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసామహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !! తాత్పర్యం: తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహదానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు. 22. […]
Author: Aparna
సౌందర్యలహరి 11-20 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 11. శ్లోకం చతుర్భిః శ్రీకణ్ఠైశ్శివయువతిభిః పంచభిరపిప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః!చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయత్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!! తాత్పర్యం: తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది. 12. శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుంకవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయఃయదాలోకౌత్సుక్యా అమరలలనాయాంతి మనసాతపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. తాత్పర్యం: […]
సౌందర్యలహరి 1-10 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ॥అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపిప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥1 ॥ తాత్పర్యముః సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడౌతాడు. హరి హర బ్రహ్మాదులచేత […]
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
సౌందర్యలహరి – తెలుగులో అర్థం ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి.
కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం
కనకధారా స్తోత్రం –తెలుగులో అర్థం కనకధారా స్తోత్రం – తెలుగులో అర్థం జగద్గురు ఆదిశంకరాచార్యుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి భిక్ష కు వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేద రాలు. భిక్ష వేయడానికి ఆమె ఇంట్లో ఏ ఆహార పదార్థాలు లేవు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికింది. ఎలాగో […]
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠనంతోపాటు […]
తిరుప్పావై తెలుగులో అర్థం
తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్థం నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ | స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః || అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్, ఇన్నిశైయాల్ పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు, శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై, పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రమ్, నాన్ […]
శ్రీ లలితా సహస్రనామం
శ్రీ లలితా సహస్రనామాలకు తెలుగులో అర్థం video రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ open చేసి చూడండి ఇవి కూడా చూడండి 👇👇👇👇👇