శ్రీ లక్ష్మీ సహస్రనామం 21-30 స్తోత్రాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ |
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా || 21 ||

ఏకాక్షర పరా – ఓం, శ్రీ మొదలైన ఏకాక్షరములందు ఆసక్తి కలిగినది
తారా – దశమహా విద్యలలో రెండవది, శక్తి స్వరూపిణి
భవబంధ వినాశినీ – సంసార బంధములను నశింపజేసి, మోక్షమును ఇచ్చునది
విశ్వంభరా – విశ్వమును ధరించునది
ధరాధారా – సమస్తమునకు ఆధారభూతమైనది
నిరాధారా – ఎలాంటి ఆధారము అవసరము లేనిది
అధికస్వరా – వర్ణించ వీలుకానిది

రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః |
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా || 22 ||

రాకా – పౌర్ణమి చంద్రుని వంటిది ఆమె
కుహూ – అత్యంత చీకటి చేత ఆశ్చర్యపరచునది
అమావాస్యా – అమావాస్య స్వరూపము
పూర్ణిమా – నిండు పౌర్ణమి కళలు కలిగినది
అనుమతి – ఒక కళ తక్కువగా ఉన్న చంద్రునితో కూడిన పౌర్ణమి
ద్యుతిః – కాంతి స్వరూపిణి
సినీవాలీ – కృష్ణ చతుర్దశితో కూడిన అమావాస్య
శివా – శివుని భార్య
అవశ్యా – ఎవరికీ వశము కానిది
వైశ్వదేవీ – వైశ్వదేవ యజ్ఞ స్వరూపము
పిశంగిలా – విష్ణువు భార్య

పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ |
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ || 23 ||

పిప్పలా – రావి చెట్టు స్వరూపం
విశాలాక్షీ – విశాలమైన కన్నులు కలది
రక్షోఘ్నీ – రాక్షసులను నాశనము చేయునది
వృష్టికారిణీ – వర్షములను కురిపించి భూమిని సస్యశ్యామలము చేయునది
దుష్టవిద్రావిణీ దేవీ – దుష్టులను తరిమికొట్టే తల్లి
సర్వోపద్రవనాశినీ – అన్నిరకాల ఆపదలను నాశనం చేయునది

శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ |
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ || 24 ||

శారదా – జ్ఞానాన్ని ప్రసాదించునది, సరస్వతి మాత
శరసంధానా – శరములను వింటియందు సంధించుటలో నేర్పు కలది
సర్వశస్త్రస్వరూపిణీ – అన్ని ఆయుధాల స్వరూపిణి
యుద్ధమధ్యస్థితా – యుద్ధంలో జయరూపిణిగా ఉండేది
దేవీ – దేవత
సర్వభూతప్రభంజనీ – అన్ని దుష్టశక్తులను నాశనం చేయునది

అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ |
గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా || 25 ||

అయుద్ధా – యుద్ధంలో దుష్టులను సంహరించునది
యుద్ధరూపా – యుద్ధము తన స్వరూపముగా కలది
శాంతా – భక్తులకు శాంతి ప్రసాదించునది
శాంతిస్వరూపిణీ – శాంతమే తన స్వరూపముగా గలది
గంగా సరస్వతీ వేణీ యమునా నర్మదాపగా – అన్నీ నదులు తన స్వరూపముగా కలది

సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా |
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా || 26 ||

సముద్రవసనావాసా – సముద్రములు చీరగా కలది
బ్రహ్మాండశ్రేణిమేఖలా – బ్రహ్మాండములను ఆభరణముగా ధరించినది
పంచవక్త్రా – ఐదు ముఖాలు కలిగినది
దశభుజా – పది చేతులు కలిగినది
శుద్ధస్ఫటికసన్నిభా – స్వచ్ఛమైన స్ఫటికం వలె ప్రకాశించునది

రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ |
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా || 27 ||

రక్తా – ఎర్రని వర్ణము కలిగినది
కృష్ణా – నల్లని శరీర వర్ణము కలిగినది
సితా – తెల్లని వర్ణము కలిగినది
పీతా – పచ్చని వర్ణము కలిగినది
సర్వవర్ణా – సర్వ వర్ణ స్వరూపిణి
నిరీశ్వరీ – ఎవరికీ ఆధీనము కానిది
కాళికా – పరమేశ్వరి
చక్రికా – శ్రీచక్ర స్వరూపిణి
దేవీ – దేవత
సత్యా – సత్య స్వరూపిణి
వటుకాస్థితా – బ్రహ్మచారిణి స్వరూపిణి

తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ |
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ || 28 ||

తరుణీ – యవ్వనవతి
వారుణీ – వరుణ శక్తి
నారీ – స్త్రీ రూపిణి
జ్యేష్ఠాదేవీ – జ్యేష్ఠ దేవత రూపం
సురేశ్వరీ – దేవతలకు దేవత
విశ్వంభరాధరా – విశ్వమును ధరించునది
కర్త్రీ – ఆధిపత్యము కలిగినది
గళార్గళవిభంజనీ – కంఠ బంధాలను తొలగించునది

సంధ్యారాత్రిదివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా |
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ || 29 ||

సంధ్యారాత్రిదివాజ్యోత్స్నా – సంధ్య, రాత్రి, పగలు స్వరూపిణి
కలాకాష్ఠా – కాల స్వరూపము
నిమేషికా – రెప్పపాటు లేని దేవత
ఉర్వీ – భూమి స్వరూపిణి
కాత్యాయనీ – కాత్యాయన మహర్షి కుమార్తె
శుభ్రా – పవిత్రమైనది
సంసారార్ణవతారిణీ – సంసార సాగరమును దాటించునది

కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా |
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా || 30 ||

కపిలా – కపిల వర్ణము కలది
కీలికా – అగ్నిజ్వాలా స్వరూపిణి
అశోకా – శోకరహితమైనది
మల్లికా – మల్లెపువ్వు స్వరూపం
నవమల్లికా – తాజా మల్లె పూవులు ధరించినది
దేవికా – దేవత రూపం
నందికా – ఆనందాన్ని ఇచ్చునది
శాంతా – శాంత స్వరూపిణి
భంజికా – శత్రువులను నాశనం చేయునది
భయభంజికా – భక్తుల భయాన్ని తొలగించునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top