స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లక్ష్మీ స్తోత్రాలు » శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం మొదటి 10 శ్లోకాలు తెలుగులో అర్థంతో

శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 1-10 శ్లోకాలు

లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం.

ఓం నిత్యాగతాఽనంతనిత్యా నందినీ జనరంజనీ |
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ || 1 ||

నిత్యగతా – సదాచారము గలవారి వద్దకు నిత్యము వచ్చునది
అనంత నిత్యా – అంతులేనిది, శాశ్వతమైనది
నందిని – అందరినీ ఆనందింపజేయునది
జన రంజని – సమస్త జనులను రంజింపజేయునది
నిత్య ప్రకాశిని – నిత్యము ప్రకాశించునది
స్వప్రకాశ స్వరూపిణీ – తన తేజస్సు వలన ప్రకాశించునది

 

మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతీ |
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ || 2 ||

మహాలక్ష్మి – లక్ష్మి స్వరూపము, మహావిష్ణువు భార్య
మహాకాళి – మహాకాలుడు అయిన శివుని భార్య / నల్లనిది
మహాకన్యా – గొప్ప కన్య
సరస్వతి – విద్యా జ్ఞాన స్వరూపమైన సరస్వతీ దేవి
భోగ వైభవ సంధాత్రీ – భోగమును ఐశ్వర్యమును ప్రసాదించు తల్లి
భక్తానుగ్రహకారిణీ – తన భక్తులను అనుగ్రహించేది

 

ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ |
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ || 3 ||

ఈశావాస్యా – ప్రపంచమంతా వ్యాపించిన తల్లి
మహామాయ – మాయాస్వరూపిణి
మహాదేవి – గొప్ప దేవత
మహేశ్వరి – మహా శివుని భార్య
హృల్లేఖ – హ్రీం అనే అక్షర రూప శక్తి
పరమా – అన్నింటికీ ఆది
శక్తి – మహాశక్తి స్వరూపిణి
మాతృకా బీజ రూపిణీ – సృష్టి మూల బీజ స్వరూపిణి

 

నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ |
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ || 4 ||

నిత్యానందా – ఎల్లప్పుడూ ఆనందంగా ఉండునది
నిత్యబోధా – శాశ్వత జ్ఞానం కలిగించునది
నాదినీ – ఓంకార నాద స్వరూపిణి
జనమోదినీ – జనులకు ఆనందం ఇచ్చునది
సత్య ప్రత్యయని – సత్యమునకు వశమైనది
స్వప్రకాశాత్మ రూపిణీ – స్వతహాగా ప్రకాశించే రూపం

 

త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా |
వాగ్దేవీ చ మహారాత్రిః కాళరాత్రిస్త్రిలోచనా || 5 ||

త్రిపుర – స్థూల సూక్ష్మ కారణ శరీర స్వరూపిణి
భైరవి – భయంకర శక్తి రూపం
విద్యా – జ్ఞాన స్వరూపిణి
హంసా – పరమహంస స్వరూపిణి
వాగీశ్వరీ – సరస్వతి రూపం
శివా – శివ శక్తి
వాగ్దేవీ – వాక్కు అధిదేవత
మహారాత్రి – ప్రళయ రాత్రి
కాళరాత్రి – భయంకర ప్రళయ కాలం
త్రిలోచన – మూడు కన్నులు కలది

 

భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా |
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా || 6 ||

భద్రకాళి – రక్షించే కాళి
కరాళి – ఉగ్ర రూపం
మహాకాళి – శివ శక్తి రూపం
తిలోత్తమ – అత్యంత అందమైనది
కాళీ – నల్లని రూపం కలది
కరాళవక్త్రాంతా – భయంకర ముఖం కలది
కామాక్షి – అందమైన కన్నులు కలది
కామదా – కోరికలు తీర్చునది
శుభా – మంగళకరమైనది

 

చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ |
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా || 7 ||

చండికా – ఉగ్ర దేవి
చండ రూపేశా – భయంకర రూపం
చాముండా – రాక్షస సంహారిణి
చక్రధారిణీ – చక్రధారి
త్రైలోక్య జయినీ – మూడు లోకాల జయశీలి
దేవీ – దేవత
త్రైలోక్య విజయోత్తమా – మూడు లోకాల విజయదాయిని

 

సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ |
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా || 8 ||

సిద్ధలక్ష్మి – సిద్ధుల లక్ష్మి రూపం
క్రియాలక్ష్మి – కార్యశక్తి
మోక్షలక్ష్మి – మోక్షదాయిని
ప్రసాదినీ – కరుణ కలది
ఉమా – పార్వతి
భగవతి – మహాశక్తి
దుర్గా – దుర్గమ సంహారిణి
ఐంద్రీ – ఇంద్ర శక్తి
దాక్షాయణీ – దక్ష కుమార్తె
శివా – శివ శక్తి

 

ప్రత్యంగిరా ధరా వేలా లోకమాతా హరిప్రియా |
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ || 9 ||

ప్రత్యంగిరా – ఉగ్ర శక్తి
ధరా – భూమి
వేలా – సముద్ర తీర శక్తి
లోకమాతా – లోకమాత
హరిప్రియా – విష్ణు ప్రియ
పార్వతి – శివ భార్య
పరమా – శ్రేష్ట
దేవీ – దేవత
బ్రహ్మవిద్యాప్రదాయినీ – మోక్ష జ్ఞానం ఇచ్చునది

 

అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ |
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా || 10 ||

అరూపా – రూపం లేనిది
బహురూపా – అనేక రూపాలు
విరూపా – ప్రత్యేక రూపం
విశ్వరూపిణీ – విశ్వ రూపం
పంచభూతాత్మిక – పంచభూత స్వరూపిణి
వాణీ – సరస్వతి
పరా – పరమ శక్తి

 

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top