శ్రీ లక్ష్మీ సహస్రనామం స్తోత్రం 31-40 శ్లోకాలు
లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మహాలక్ష్మీ దేవి యొక్క వెయ్యి దివ్య నామాలను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం, ఐశ్వర్యం, సుఖశాంతులు మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. ఈ పేజీలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి సరళమైన తెలుగులో అర్థం మరియు ప్రతి నామం యొక్క విశిష్టతను తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ సహస్రనామం 31-40 శ్లోకాలు.
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా |
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా || 31 ||
కౌశికీ – పార్వతి దేవి శరీర కోశమునుండి బయల్పడిన శక్తి
వైదికీ దేవీ – వేదమాత
సౌరీ – సూర్యుని యొక్క శక్తి
రూపాధికా – అన్ని రూపములలో అధికురాలు
అతిభా – మిక్కిలి కాంతి కలిగినది
దిగ్వస్త్రా – దిక్కులను వస్త్రంగా ధరించునది, దిగంతముల వరకు వ్యాపించిన తల్లి
నవవస్త్రా – ఎప్పుడూ నూతన వస్త్రములతో అలంకరింపబడునది
కన్యకా – వివాహం కాని కన్యాకుమారి స్వరూపిణి
కమలోద్భవా – కమలం నుండి పుట్టినది
శ్రీః సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా |
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ || 32 ||
శ్రీః – లక్ష్మీ దేవి
సౌమ్యలక్షణా – ప్రశాంతమైన రూపాన్ని కలిగినది
అతీత దుర్గా – అందరికీ అతీతమైన దుర్గా స్వరూపిణి
సూత్రప్రబోధికా – వేదములలోని యజ్ఞకర్మల విజ్ఞానమును ప్రసాదించునది
శ్రద్ధా – శ్రద్ధగలది
మేధా – బుద్ధి రూపకమైన శక్తి స్వరూపిణి
కృతిః – సజ్జనులకు సహాయపడు తల్లి
ప్రజ్ఞా – విన్న వెంటనే, చూచిన వెంటనే గ్రహించగల జ్ఞాన స్వరూపిణి
ధారణా – అర్థం చేసుకునే ధారణా శక్తిని ప్రసాదించునది
కాంతిరేవ చ – వెలుగు
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ |
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ || 33 ||
శ్రుతిః – వేద స్వరూపిణి
స్మృతిః – స్మృతి స్వరూపిణి
ధృతి – ధైర్యము
ధన్యా – పుణ్యాత్మురాలు, ధనమునిచ్చునది
భూతిః – సకల సంపదలను ఇచ్చునది
ఇష్టి – అగ్నిహోత్రం, తపస్సు, వేదాధ్యయనము మొదలైన ఇష్టకర్మల స్వరూపిణి
మనీషిణీ – మిక్కిలి మేధాసంపత్తి కలిగిన తల్లి
విరక్తిః – వైరాగ్యమును కలిగించు జ్ఞాన స్వరూపిణి
వ్యాపినీ – సర్వత్రా వ్యాపించి ఉన్నది
మాయా – మాయాశక్తి స్వరూపిణి
సర్వమాయాప్రభంజనీ – సమస్త మాయలను భంజించునది
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ |
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా || 34 ||
మాహేంద్రీ – మహేంద్రుని శక్తి
మంత్రిణీ – ఆలోచన చేసి కార్యాకార్యములను తెలుపునది
సింహీ – సింహం రూపాన్ని ధరించేది, సింహంవలె ధైర్యవంతురాలు
ఇంద్రజాలస్వరూపిణీ – ఇంద్రజాల, మాయా స్వరూపిణి
అవస్థాత్రయనిర్ముక్తా – జాగరణ, నిద్ర, స్వప్న అనే మూడు అవస్థలు లేనిది
గుణత్రయవివర్జితా – సత్వ, రజ, తమో గుణాలకు అతీతమైనది
ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా |
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా || 35 ||
ఈషణాత్రయనిర్ముక్తా – పుత్రులు, సంపద, స్వర్గం అనే మూడు కోరికలు లేనిది
సర్వరోగవివర్జితా – అన్ని వ్యాధులను నయం చేయునది
యోగిధ్యానాంతగమ్యా – యోగుల ధ్యానానికి పరమగమ్యము
యోగధ్యానపరాయణా – యోగధ్యానమునందు ఆసక్తి గలది
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ |
భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతిః || 36 ||
త్రయీశిఖా – మూడు వేదముల శిఖ అయిన ఉపనిషత్తు స్వరూపిణి
విశేషజ్ఞా – విశేషమైన జ్ఞానము కలది
వేదాంతజ్ఞానరూపిణీ – వేదాంత జ్ఞాన స్వరూపిణి
భారతీ – సరస్వతి
కమలా – కమలము చేతియందు కలది
భాషా – సరస్వతి దేవి
పద్మా – కమలం నుండి పుట్టినది
పద్మావతి – పద్మమును నివాసముగా కలది
కృతిః – కార్యము, కార్యఫల స్వరూపిణి
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ |
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా || 37 ||
గౌతమీ – గౌతమ ఋషి కుమార్తెగా జన్మించినది
గోమతీ – గోమతి నది స్వరూపిణి
గౌరీ – తెల్లని శరీర ఛాయ కలది
ఈశానా – ఈశ్వరుని భార్య
హంసవాహినీ – హంస వాహనముగా కలది
నారాయణీ – నారాయణుని శక్తి
ప్రభాధారా – సూర్య చంద్ర నక్షత్ర కాంతులకు ఆధారమైనది
జాహ్నవీ – జహ్ను మహర్షి కుమార్తె
శంకరాత్మజా – శివుని భార్య
చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా |
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ || 38 ||
చిత్రఘంటా – చిరుమువ్వలను ఆభరణములుగా ధరించినది
సునందా – ఆనంద స్వరూపిణి
శ్రీః – సంపదలను ఇచ్చునది
మానవీ – మనువు కుమార్తె
మనుసంభవా – మనుస్మృతి రూపమైన జ్ఞాన స్వరూపిణి
స్తంభినీ – స్థిరమైనది
క్షోభిణీ – శత్రువులకు మనఃక్షోభను కలిగించునది
మారీ – అసురులను సంహరించేది
భ్రామిణీ – సమస్తమును నడిపించునది
శత్రుమారిణీ – శత్రువులను సంహరించునది
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ |
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ || 39 ||
మోహినీ – సర్వలోకులనూ మోహింపజేయు మాయాశక్తి
ద్వేషిణీ – దుర్జనులను ద్వేషించునది
వీరా – వీరత్వము, శౌర్యము కలది
అఘోరా – శాంతస్వరూపిణి
రుద్రరూపిణీ – రుద్రుని శక్తి
రుద్రైకాదశినీ – ఏకాదశ రుద్రరూపిణి
పుణ్యా – పుణ్యకార్య స్వరూపిణి
కల్యాణీ – మంగళకరమైనది
లాభకారిణీ – తనను ఆరాధించువారికి లాభములను కలిగించునది
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ |
సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ || 40 ||
దేవదుర్గా – దేవతలచేత పూజింపబడే దుర్గ
మహాదుర్గా – గొప్పదైన తల్లి
స్వప్నదుర్గా – తపస్సమాధిలో స్వప్నమువలె సాక్షాత్కరించు దుర్గాభవాని
అష్టభైరవీ – అష్టభైరవ స్వరూపిణి
సూర్యచంద్రాగ్నిరూపా – సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజస్సుల స్వరూపిణి
గ్రహనక్షత్రరూపిణీ – గ్రహాలు, నక్షత్రాలు తన స్వరూపముగా కలది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




