లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాతకామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిదిక్షయ వినిర్ముక్తా […]