Golden Dhwaja Sthambham (Flagstaff) standing tall in front of a Hindu temple, symbolizing divine connection and spiritual significance.

ధ్వజస్థంభం ప్రాముఖ్యత

ధ్వజస్థంభం ప్రాముఖ్యత

దేవాలయాలు మన భారతీయ సంస్కృతిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి మనకు కనిపించే ఒక్కో అంశం వెనుక ఎంతో సామాజికపరమైన శాస్త్రీయమైన రహస్యాలు దాగి ఉంటాయి ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో ఒక భాగంగా ధ్వజ స్తంబం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతనే దైవదర్శనం చేసుకోవడం ఆచారం పూర్వం అడవుల్లో దారి తప్పిన వారు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభ దీపాల ఆధారంగా ఏ గుడిలో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు గజస్తంభం తయారీ విధానం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ధ్వజస్తంభాలను మోదుగ రావి మారేడు వేగిస పనస మరియు ఇతర వృక్షాల చెట్లను వినియోగించి తయారుచేస్తారు ఇవి సంవత్సరాల పాటు దృఢంగా ఉంటాయి రాతి ధ్వజస్తంభం కూడా పెడతారు ఇవి చాలా ఎత్తుగా తయారు చేస్తారు ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం కలశంతో సమానంగా ఉంటే మధ్యమం ధ్వజస్తంభంనికి కింద కూర్మయంత్రం వేస్తారు ధ్వజస్తంభం కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు భగవంతునికి చేసినట్టే దీనికి కూడా పత్రం పుష్పం ఫలం తోయం తో పూజలు చేస్తారు ధ్వజస్తంభం పైన పతాకంలా మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్టుగా ఉంటుంది ఈ మూడు వరుసల భాగాన్ని మేకల అంటారు చిన్న గంటలు ఉండి గాలికి స్వరమిస్తూ ఉంటాయి.

చెక్కతో తయారు చేసిన స్తంభానికి లోహపు తొడుగు వేస్తారు ఈ మేకల కింద వైష్ణవాలయాల్లో అయితే సుదర్శన చక్రం శివాలయంలో అయితే నందీశ్వరుడు ఉంటారు మేకల గర్భగుడిలోని దైవానికి అభిముఖంగా ఉంటుంది ధ్వజారోహణం దేవాలయాల్లో ఉత్సవాలు ప్రారంభించే ముందు ధ్వజారోహణం చేస్తారు అంటే జయపతాకాన్ని కట్టి పైదాకా ఎగరేస్తారు చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలుసుకుంటారు ఉత్సవాలు అయిపోయిన తర్వాత పతాకాన్ని కిందికి దింపుతారు దానిని ధ్వజావరోహణం అంటారు ధ్వజారోహణం ద్వారా స్వర్గలోక దేవతలను ఆహ్వానించినట్లు భావిస్తారు వైష్ణవ దేవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం దేవీ ఆలయాల్లో సింహ చిహ్నం వినాయక దేవాలయాల్లో మూషికం తో పాటు సూర్యుడు చంద్రుడు త్రిశూలం శంఖం వంటి చిహ్నాలతో కూడా ధ్వజారోహణం చేస్తారు కార్తీకమాసంలో ఆకాశదీపం వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం వెనకున్న శాస్త్రీయ రహస్యం పురాతన దేవాలయాల్లో గర్భాలయంలోని మూలవిగ్రహం కింద రాగిరేకులు పంచలోహాలు నవరత్నాలు మొదలైనవి ప్రతిష్ఠించేవారు భూమి ద్వారా విశ్వంలోని గ్రహాల ప్రభావం వస్తుందని నమ్మకం గ్రహాలు నక్షత్రాల నుంచి జీవ అయస్కాంత శక్తి విడుదలవుతుందని భావిస్తారు ఈ శక్తి మనిషి ఆరోగ్యానికి కారణమయ్యే మానవ జీవకణాలను ప్రభావితం చేస్తుందని అంటారు దేవాలయాల్లోని ధ్వజస్తంభం ఈ శక్తిని గ్రహించి దాన్ని గర్భగుడిలోని విగ్రహం వైపు మళ్లిస్తుందని విశ్వాసం పైన ఉండే మేకల ద్వారా ఈ శక్తి ఆలయాన్ని దర్శించే మనుషులపై ప్రతిబింబిస్తుందని చెబుతారు ఇది మానవ జీవక్రియలను సమతుల్యం చేసి శరీరంలోని అనారోగ్యాలను దూరం చేస్తుందని నమ్మకం ఈ అయస్కాంత శక్తిని గ్రహించడానికి వీలుగా ధ్వజస్తంభానికి బంగారం రాగి ఇత్తడి లేదా పంచలోహాలతో తాపడం చేస్తారు ఇంకొక ప్రయోజనం కూడా ఉంది.

లోహాలతో తాపడం చేయడం వలన వర్షాకాలంలో పిడుగు పడేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్తును ఈ స్తంభం ఆకర్షించి చుట్టుపక్కల ప్రజలను పశువులను ఇంట్లోని వస్తువులను పిడుగుపాటుకు గురికాకుండా కాపాడుతుంది ధ్వజస్తంభం విశిష్టత ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించి మేకలను చూసి నమస్కారం చేసుకోవాలి మేకలను దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు దేవాలయాల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడు సంపూర్ణ ప్రదక్షిణ అవుతుంది గర్భాలయంలోని విగ్రహాల అనుగ్రహం ధ్వజస్తంభాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభం వద్ద బలిపీఠం కూడా ఉంటుంది చేతులు జరిగే దేవాలయాల్లో పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి ఆరాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు దీనికి కూడా చేయాలి ధ్వజస్తంభం ఉన్నప్పుడే దాన్ని సంపూర్ణ దేవాలయం అంటారు.

స్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్లీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభం లేకపోతే ఉత్సవాలు నిర్వహించరు దీనిని స్వర్గాన్ని భూమికి అనుసంధానించే మార్గంగా చెబుతారు ఇది భూలోకంలో ఉండే మనకు పైన ఉన్న పరమాత్మకు మధ్య ఆధ్యాత్మిక వారధి వంటిది గర్భిణీ స్త్రీలు వృద్ధులు నిత్యం ఆలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో కనీసం ధ్వజస్తంభం పైభాగాన్ని దర్శించినా దైవదర్శనం చేసిన పుణ్యంలో కొంత భాగం లభిస్తుందని చెబుతారు ఈ ఉద్దేశంతో గుడి చుట్టుపక్కల ఎలాంటి నివాస గృహాలు ఉండకూడదని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అంటారు గజస్తంభం ప్రతిష్ఠించినా ప్రతిష్ఠించడానికి సహాయం చేసినా కనీసం ధ్వజస్తంభ ప్రతిష్ఠను దర్శించినా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం దేవాలయాలను తరచుగా దర్శించి మన సామాజిక ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడదాం.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top