శబరిమలలో స్వామి అయ్యప్ప స్వామి ధ్యానంలో ఉన్న దివ్య రూపం

హరివరాసనం

హరివరాసనం

హరివరాసనం” అనేది స్వామి అయ్యప్పను స్తుతించే అతి పవిత్రమైన భక్తి గీతం. ఈ గీతాన్ని ముఖ్యంగా రాత్రి సమయంలో ఆలయాల్లో పాడుతూ అయ్యప్ప స్వామిని శయన స్థితికి ఆహ్వానిస్తారు. ఇది శబరిమల ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హారతి గీతంగా భావించబడుతుంది.

ఈ గీతాన్ని వినడం లేదా పఠించడం వల్ల మనస్సుకు ప్రశాంతత, భక్తి భావం మరియు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని విశ్వాసం. హరివరాసనం భక్తులలో ధ్యాన స్థితిని పెంపొందించి, ఒత్తిడిని తగ్గించి, అంతరంగ శాంతిని అందిస్తుంది.

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥

హరివరాసనం                  – శ్రేష్టమైన పులిని ఆసనంగా కలిగినవాడు
విశ్వమోహనం                  – విశ్వాన్నే మోహింపచేసేవాడు
హరిదధీశ్వరం                  – అన్నిదిక్కులకు అధిపతి అయినవాడు
ఆరాధ్యపాదుకమ్              – పూజనీయమైన పాదాలు కలవాడు
అరివిమర్దనం                   – కామ క్రోధాది శత్రువులను నాశనం చేసేవాడు
నిత్యనర్తనం                     – ఆత్మ స్వరూపంగా నిత్యం మనలో నర్తించేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – అటువంటి- హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 1 ॥
శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥

శరణకీర్తనం- సక్తమానసం  – శరణుఘోషలపై ఆసక్తి ఉన్న మనసుకలవాడు
భరణలోలుపం                 –          తన భక్తులను భరించడంలో/పోషించడంలో మిక్కిలి ఆసక్తి కలవాడు
నర్తనాలసమ్                    –          నిత్యం నాట్యం చేస్తూ అలసినవాడు(జగత్తును నడిపే లీల చేసి అలసినవాడు)
అరుణభాసురం                –          అరుణ వర్ణంతో ప్రకాశించేవాడు
భూతనాయకం                –          సకలజీవులకు అధిపతి, భూతగణాలకు నాయకుడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 2 ॥

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥

ప్రణయసత్యకం                            –          సత్యమైన ప్రేమకు నిలయమైనవాడు
ప్రాణనాయకం                             –          ప్రాణాలకు అధిపతి
ప్రణతకల్పకం                               –          శరణు కోరిన భక్తులకు కల్పవృక్షం వంటివాడు
సుప్రభాజితమ్                              –          గొప్ప కాంతితో ప్రకాశించేవాడు
ప్రణవమందిరం                            –          ఓంకారమనే మందిరంలో కొలువుండేవాడు
కీర్తనప్రియం                                –          కీర్తనలను ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే          – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 3 ॥

తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥

తురగవాహనం                             –          గుర్రం వాహనంగా కలవాడు
సుందరాననం                             –          అందమైన ముఖం కలవాడు
వరగదాయుధం                          –          శ్రేష్టమైన వరప్రదమైన గద ఆయుధంగా కలవాడు
వేదవర్ణితమ్                                 –          వేదాలచే వర్ణించబడినవాడు
గురుకృపాకరం                            –          గురురూపంగా కృపను ప్రసాదించేవాడు
కీర్తనప్రియం                                –          కీర్తనలను ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే          – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 4 ॥

త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥

త్రిభువనార్చితం                             –          మూడు లోకాలచే పూజింపబడేవాడు
దేవతాత్మకం                                –          దేవతా స్వరూపుడు
త్రినయనం ప్రభుం                         –          ముక్కంటి అయిన ఈశ్వరుని స్వరూపము
దివ్యదేశికమ్                                –          దివ్యమైన ఉపదేశాలిచ్చే గురువు
త్రిదశపూజితం                              –          సమస్త దేవతలచే పూజింపబడేవాడు
చింతితప్రదం                               –          కోరిన కోరికలు తీర్చేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే          – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 5 ॥

భవభయాపహం భావుకావకం
భువనమోహనం భూతిభూషణమ్ ।
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥

భవభయాపహం                           –          సంసార భయాన్ని పోగొట్టేవాడు
భావుకావహం                              –          శుభాలను కలిగించేవాడు
భువనమోహనం                           –          సమస్త లోకాలను మోహింపజేసేవాడు
భూతిభూషణమ్                           –          విభూతిని అలంకారంగా ధరించినవాడు
ధవళవాహనం దివ్యవారణం             – తెల్లని ఏనుగు వాహనంగా కలవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే          – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 6॥

కలమృదుస్మితం సుందరాననం
కళభకోమలం గాత్రమోహనమ్ ।
కళభకేసరీవాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 7 ॥

కలమృదుస్మితం                            –          మృదువైన చిరునవ్వు కలవాడు
సుందరాననం                             –          అందమైన ముఖం కలవాడు
కలభకోమలం                              –          పసిపిల్లలవంటి కోమలమైన శరీరం కలవాడు
గాత్రమోహనమ్                            –          అద్భుతమైన గాత్రసౌందర్యంతో అందరినీ మోహింపజేసేవాడు
కలభకేసరీవాజివాహనం                 –          ఏనుగు, సింహం, గుర్రం వంటి వాహనాలను కలిగినవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే          –          హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 7 ॥

శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 8 ॥

శ్రితజనప్రియం                  –          ఆశ్రయించిన జనులకు ప్రియమైనవాడు
చింతితప్రదం                    –         కోరిన కోరికలు తీర్చేవాడు
శృతివిభూషణం                 –         వేదములలో స్తుతించబడినవాడు
సాధుజీవనమ్                   –         సాధువుల జీవనానికి స్ఫూర్తి అయినవాడు
శృతిమనోహరం                  –         వేదములలో స్తుతించబడిన మనోహరమైనవాడు
గీతలాలసం                       –        కీర్తనలను వినడానికి మిక్కిలి ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే  –       హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 8 ॥

శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top