స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 21-30 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 21-30 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ |
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా || 21 ||
ఏకాక్షర పరా               – ఓం, శ్రీ మొదలైన ఏకాక్షరములందు ఆసక్తి కలిగినది
తారా                        – దశమహా విద్యలలో రెండవది, శక్తి స్వరూపిణి
భవబంధ వినాశినీ        – సంసార బంధములను నశింపజేసి, మోక్షమును ఇచ్చునది
విశ్వంభరా                  – విశ్వమును ధరించునది
ధరాధారా                   – సమస్తమునకు ఆధారభూతమైనది
నిరాధారా                   – ఎలాంటి ఆధారము అవసరము లేనిది
అధికస్వరా                 – వర్ణించ వీలుకానిది

రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః |
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా || 22 ||
రాకా                        – పౌర్ణమి చంద్రుని వంటిది ఆమె
కుహూ                     – అత్యంత చీకటి చేత ఆశ్చర్యపరచునది
అమావాస్యా                – అమావాస్య స్వరూపము
పూర్ణిమా                   – నిండు పౌర్ణమి కళలు కలిగినది
అనుమతి                  – ఒక కళ తక్కువగా ఉన్న చంద్రునితో కూడిన పౌర్ణమి
ద్యుతిః                       – కాంతి స్వరూపిణి
సినీవాలీ                    – కృష్ణ చతుర్దశితో కూడిన అమావాస్య
శివా                         – శివుని భార్య
అవశ్యా                      – ఎవరికీ వశము కానిది
వైశ్వదేవీ               – వైశ్వదేవ యజ్ఞ్య స్వరూపము (గృహస్థులకు సన్నికల్లు, రోలు రోకలి, అలుకుగుడ్డ, కత్తిపీట, కుండ మొదలైనవి ఉపయోగించడం వల్ల జీవహింసా దోషము కలుగుతుంది. ఈ పంచసూన దోషాలకు ప్రాయశ్చిత్తంగా జరుపు యజ్ఞమే వైశ్వ దేవము)
పిశంగిలా                   – విష్ణువు భార్య

పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ |
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ || 23 ||
పిప్పలా                     – రావి చెట్టు స్వరూపం
విశాలాక్షీ                   – విశాలమైన కన్నులు కలది
రక్షోఘ్నీ                     – రాక్షసులను నాశనము చేయునది
వృష్టికారిణీ                 – వర్షములను కురిపించి, భూమిని సస్యశ్యామలము చేయునది
దుష్టవిద్రావిణీదేవీ         – దుష్టులను తరిమికొట్టే తల్లి
సర్వోపద్రవనాశినీ         – అన్నిరకాల ఆపదలను నాశనం చేయునది

శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ |
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ || 24 ||
శారదా                      – జ్ఞానాన్ని ప్రసాదించునది, సరస్వతి మాత
శరసంధానా                – శరములను వింటియందు సంధించుటలో నేర్పు కలది
సర్వశస్త్ర స్వరూపిణీ       – అన్ని ఆయుధాల స్వరూపిణి
యుద్ధమధ్యస్థితా          – యుద్ధం మధ్యలో జయరూపిణిగా ఉండు తల్లి
దేవి                            – దేవత
సర్వభూత ప్రభంజనీ      – అన్ని దుష్టశక్తులను నాశనం చేయునది

అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ |
గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా || 25 ||
అయుద్ధా                   – యుద్ధంలో దుష్టులను సంహరించునది
యుద్ధరూపా               – యుద్ధము తన స్వరూపముగా కలది
శాంతా                      – భక్తులను ప్రసన్న దృష్టి చూసే శాంత స్వరూపిణి
శాంతి స్వరూపిణి          – శాంతమే తన స్వరూపముగా గల తల్లి
గంగా సరస్వతీ వేణీ యమునా నర్మదాపగా
                                    – అన్నీ నదులు తన స్వరూపముగా కలది

సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా |
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా || 26 ||
సముద్రవసనావాసా      – సముద్రములు చీరగా కలది, సముద్రమునందు ఉద్భవించినది
బ్రహ్మాండశ్రేణిమేఖలా      – బ్రహ్మాండములను చిరుమువ్వలుగా కలిగిన ఆభరణము ధరించినది
పంచవక్త్రా                   – ఐదు ముఖాలు కలిగినది
దశభుజా                   – పది చేతులు కలిగినది
శుద్ధస్ఫటికసన్నిభా      – స్పష్టమైన స్ఫటికం వలె, స్వచ్ఛమైన కాంతితో వెలుగునది


రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ |
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా || 27 ||
రక్తా               – ఎర్రని వర్ణము కలిగినది
కృష్ణా              – నల్లని శరీర వర్ణము కలిగినది
సితా              – తెల్లని శరీర వర్ణము కలిగినది
పీతా              – పచ్చని వర్ణము కలిగినది
సర్వ వర్ణా        – సర్వ వేద, అక్షర స్వరూపము
నిరీశ్వరీ           – తనను శాసించు ప్రభువు లేనిది
కాళికా            – పరమేశ్వరి
చక్రికా             – శ్రీచక్ర స్వరూపిణి
దేవి               – దేవత
సత్యా             – సత్యమైనది, పరమాత్మ స్వరూపిణి
వటుకా స్థితా     – బ్రహ్మచారిణి, భైరవీ స్వరూపిణీ

తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ |
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ || 28 ||
తరుణీ            – యవ్వనవతి
వారుణీ           – వరుణ శక్తి
నారీ               – స్త్రీ
జ్యేష్ఠా దేవీ        – జ్యేష్ఠుడైన మహా విష్ణువు భార్య
సురేశ్వరీ          – దేవతలకు దేవత
విశ్వంభరాధరా  – విశ్వమును ధరించునది, భరించునది
కర్త్రీ                – కర్త పుంలింగము, కర్త్రీ స్త్రీలింగము, అంటే ఆధిపత్యము కలిగినది
గళార్గళవిభంజనీ – కంఠమునందలి అవరోధములను పోగొట్టి, మాట్లాడు శక్తినిచ్చు తల్లి

సంధ్యారాత్రిదివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా |
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ || 29||
సంధ్యారాత్రిదివాజ్యోత్స్నా – సంధ్య, రాత్రి, పగలు, జ్యోత్స్న అమ్మ స్వరూపాలే
కలాకాష్ఠా                   – కాల స్వరూపము తానైనది
నిమేషికా                   – రెప్పపాటు లేని దేవత
ఉర్వీ                        – భూమి రూపంలో ఉన్నది
కాత్యాయని                – కాత్యాయన మహర్షి కుమార్తె
శుభ్రా                       – స్వఛ్చమైనది, పరిశుభ్రమైనది, తెల్లనిది
సంసారార్ణవతారిణి        – సంసార సాగరమును తరింపజేసి మోక్షమును ఇచ్చునది

కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా |
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా || 30 ||
కపిలా             – కపిల వర్ణము కలది
కీలికా             – అగ్నిజ్వాలా స్వరూపము
అశోకా            – శోకము లేనిది
మల్లికా            – మల్లె పువ్వు
నవమల్లికా       – తాజా మల్లె పూవులను ధరించినది
దేవికా             – దేవత
నందికా           – అందరినీ ఆనందింపజేయునది
శాంతా            – శాంతము గలది
భంజికా           – శత్రువులను భంజించునది
భయభంజికా    భక్తుల భయమును పోగొట్టునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top