స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 71-80 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 71-80 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా |
అర్ధమాత్రా పరా సూక్ష్మా సూక్ష్మార్థార్థపరాఽపరా || 71 ||
ఏకమాత్రా        – ఒక హ్రస్వాక్షరమును పలుకుటకు పట్టు కాలము, జగన్మాత
ద్విమాత్రా        – ఒక దీర్ఘాక్షరమును పలుకుటకు పట్టు కాలము, జగన్మాత
త్రిమాత్రా          – మూడు మాత్రల కాలము
పరా               – శ్రేష్టమైనది, పరావాక్య స్వరూపిణి
అర్ధమాత్రా పరా  – అర్ధనారీ స్వరూపిణి
సూక్ష్మా           – ఆమె సూక్ష్మ రూపము గలది
సూక్ష్మార్థా         – సూక్ష్మ శరీరము కన్నా సూక్షమైన స్వరూపము
అర్థపరా           – ఐహికమైన ధనములనే కాక మోక్షమును కూడా ఇచ్చునది
అపరా             – పాంచభౌతికమైన దృశ్య రూప ప్రపంచము
                          తన రూపముగా కలది

ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ |
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా || 72 ||
ఏకవీరా           – పరాక్రమవంతమైనది
విశేషాఖ్యా        – విశేషమైన ఖ్యాతి కలది
షష్ఠీదేవి           – ఆరు రూపాలు కలిగిన మహాలక్ష్మి
మనస్వినీ        – ప్రతి ఒక్కరి మనసులో నిలిచిన వ్యక్తి
నైష్కర్మ్యా         – ఏ కర్మ యోగం లేనిది
నిష్కలా           – ఏ అవయవములు లేనిది
ఆలోకా           – కాంతి స్వరూపిణి, అందరినీ దయతో చూచునది
జ్ఞాన కర్మాధికా  – జ్ఞానము చేత సాక్షాత్కారము చేయగలిగినది
గుణా              – త్రిగుణములతో కూడిన శక్తి స్వరూపిణి

సబంధ్వానందసందోహా వ్యోమాకారాఽనిరూపితా |
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా || 73 ||
సబంధువానందసందోహా – తన బంధువులతో మిక్కిలి ఆనందముగా ఉండు తల్లి
వ్యోమాకారా                – బ్రహ్మమైన ఆకాశమే రూపముగా కలది
నిరూపితా                  – వేదములచే నిరూపించబడిన లక్షణములు కలది
గద్య పద్యాత్మికా           – గద్య మరియు పద్యం యొక్క ఆత్మ
వాణి                        – సరస్వతి
సర్వాలంకార సంయుతా – సర్వ ఆభరణాలతో శోభిల్లునది

సాధుబంధపదన్యాసా సర్వౌకా ఘటికావళిః |
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా || 74 ||
సాధుబంధ పదన్యాసా    – చక్కని కవిత్వములలో ఒప్పునది
సర్వౌకాః                    – అంతటా ఉండునది
ఘటికావళి                 – కాల స్వరూపిణి
షట్కర్మా                    – బోధించడం, నేర్చుకోవడం, త్యాగం చేయడం, అభ్యర్థించడం,  ఇవ్వడం,  తీసుకోవడం అనేవి ఆరు కర్మలు. ఈ ఆరు కర్మలు అమ్మ స్వరూపములు
కర్కశాకార                 – అసురుల పట్ల కనికరము లేని భయంకరాకారము కలది
సర్వకర్మవివర్జితా          – కర్మలు చేయవలసిన అవసరం లేనిది, అన్ని కర్మలను విడిచిపెట్టినది

ఆదిత్యవర్ణాచాపర్ణా కామినీ వరరూపిణీ |
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా || 75 ||
ఆదిత్యవర్ణా       – సూర్యుని వంటి ఎర్రని వర్ణము కలది
అపర్ణా             – ఆకులు కూడా తిననిది, పార్వతి దేవి
కామినీ           – సమస్తమైన కోరికలు తీరినది
వరరూపిణి       – మిక్కిలి సౌందర్యము కలది
బ్రాహ్మణీ          – బ్రహ్మదేవుని శక్తి
బ్రహ్మ సంతానా – పరబ్రహ్మ తత్వమునకు కారణభూతమైన పరాశక్తి అమ్మ
వేదవాగీశ్వరీ     – వేదవాక్కులకు ఈశ్వరి
శివా               – శివుని భార్య


పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా |
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా || 76 ||
పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాగమ శ్రుతా
            – పురాణ, న్యాయ, మీమాంస, ధర్మ శాస్త్ర, ఆగమ, శ్రుతులు తన స్వరూపముగా  కలది
సద్యోవేదవతి     – వేదాలు తెలిసినది, వేదాలచే కీర్తింపబడునది
సర్వా             – ప్రతిచోటా ఉండేది
హంసీ             – హంస రూపంలో ఉన్నది/హంసపై స్వారీ చేసేది
విద్యాధిదేవతా   – విద్యలకు అధిదేవత

విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ |
వైదికీ వేదరూపా చ కాళికా కాలరూపిణీ || 77 ||
విశ్వేశ్వరీ                   – విశ్వేశ్వరుని భార్య
జగద్ధాత్రీ                    – విశ్వానికి తల్లి
విశ్వనిర్మాణకారిణీ         – విశ్వ నిర్మాణమునకు మూలమైనది
వైదికీ                        – వేదవిహిత కర్మలు తన స్వరూపముగా కలది
వేదరూపా                  – వేదముల రూపమున అవతరించినది
కాళికా                      – నల్లని రూపము కలది
కాలరూపిణి                – ఆది మధ్య అంతములు లేని కాలస్వరూపిణి

నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ |
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా || 78 ||
నారాయణి                 – నారాయణుని శక్తి/పార్వతీదేవి
మహాదేవి                   – మహాశివుని భార్య
సర్వతత్త్వ ప్రవర్తినీ         – సర్వ తత్త్వములయందు ప్రవర్తించు తల్లి
హిరణ్యవర్ణ రూపా         – బంగారు శరీర వర్ణము కలిగినది
హిరణ్య పద సంభవా      – వేద వాక్యముల వలన సంభవించినది

కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా |
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ || 79||
కైవల్య పదవీ               – మోక్ష మార్గమువైపు నడిపించునది
పుణ్యా                      – కైవల్యమును ప్రసాదించు పుణ్యఫల స్వరూపము అమ్మ
కైవల్యజ్ఞాన లక్షితా        – జ్ఞానము వలన తెలుసుకొనబడునది
బ్రహ్మ సంపత్తిరూపా      – వేద జ్ఞాన స్వరూపిణి
బ్రహ్మసంపత్తి కారిణీ       – బ్రహ్మ జ్ఞానమునకు కారణం

వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ |
ఏకాక్షరపరాఽఽయుక్తా సర్వదారిద్ర్యభంజినీ || 80 ||
వారుణి                     – వరుణ శక్తి
వారుణారాధ్యా           – వరుణ కుమారుడైన భృగు మహర్షిచే పూజింపబడేది
సర్వకర్మ ప్రవర్తినీ          – అన్నీ కర్మల యందు కల చైతన్య శక్తి
ఏకాక్షర పరా యుక్తా      – ఓంకారమునందు ఆసక్తి కలిగినది,
                                        ఏకాక్షరమునందు ఉండునది
సర్వదారిద్ర్య భంజనీ       – సకల దారిద్ర్యములను పోగొట్టునది

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top