స్తోత్రాలకు తెలుగులో అర్థం » శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 101-110 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 101-110 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 101-110 శ్లోకాలు

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.

సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ |
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ || 101 ||
జాలంధరి                   – మాయను ధరించునది/మహావిష్ణువు యొక్క మాయా శక్తి
మృడానీ                    – శివుని భార్య
భవానీ                      – శివుని భార్య
భవభంజనీ                 – జన్మ దుఃఖాన్ని పొగొట్టునది
త్రైకాలిక జ్ఞాన తంతుః     – మూడు కాలాలలోనూ జ్ఞానమును ప్రసాదించునది
త్రికాల జ్ఞానదాయిని      – మూడు కాలములకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించునది

నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా |
పరాజితా విధానజ్ఞా విశేషితగుణాత్మికా || 102 ||
నాదాతీతా                  – నాదమునకు అతీతమైనది
స్మృతిః                       – వేదాలలో భాగమైనది, వేద స్వరూపము
ప్రజ్ఞా                         – జ్ఞాన స్వరూపిణి
ధాత్రీరూపా                 – భూస్వరూపిణి
త్రిపుష్కరా                  – తామర పువ్వు నివాసముగా కలది
పరాజితా                   – ఇతరులచే జయింపబడనిది
విధానజ్ఞా                   – సృష్టి చేయు విధానమును ఎరిగినది
విశేషితగుణాత్మికా        – విశేషమైన శుభ గుణాలు కలది


హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా |
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ || 103 ||
హిరణ్యకేశినీ                – హిరణ్య స్వరూపిణి
హేమా                      – బంగారు శరీర వర్ణము కలది
బ్రహ్మ సూత్ర విచక్షణా   –  బ్రహ్మ సూత్రాలలో పాండిత్యము కలది
అసంఖ్యేయ పరార్థాంత స్వరవ్యంజన వైఖరీ        
                                    – అసంఖ్యాకమైన వర్ణమాలలు, హల్లులు మరియు అచ్చులన్నియూ తన స్వరూపాలే

మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః |
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా || 104 ||
మధుజిహ్వా                – మధురముగా మాట్లాడునది
మధుమతీ                 – మధురమైనది, ఆహ్లాదకరమైన మనస్సు కలది
మధుమాసోదయా        – ఆహ్లాదకరమైన వసంత శోభ, వసంత లక్ష్మి
మధుః                       – మధురమైనది
మాధవీ                     – మాధవుని భార్య
మహాభాగా                 – గొప్ప భాగ్యము, కీర్తి కలది
మేఘ గంభీర నిస్వనా  – ఉరుము, మెరుపు అమ్మ స్వరూపాలు

బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా |
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా || 105 ||
బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగా         
                                    – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల చేత కూడా తెలుసుకొనదగిన మహిమా విశేషములు కలది
నాభౌ వహ్ని శిఖాకారా   – నాభిస్థానమందు అగ్ని శిఖాకారముగా ఉండు తల్లి
లలాటే చంద్రసన్నిభా      – నుదురు నందు చంద్రునితో సమానమైన సౌందర్యము కలది

భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది |
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యర్చితోదయా || 106 ||
భ్రూమధ్యే భాస్కరాకారా  – కనుబొమ్మల మధ్యలో సూర్యుని వంటి కాంతి కలిగినది
సర్వ తారాకృతి హృది    – అమ్మ హృదయము సర్వ నక్షత్రములకు స్థానము
కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయా 
                                    – కృత్తికా నక్షత్రము నుండి భరణీ నక్షత్రము వరకు గల నక్షత్రములందు అర్చింపబడి అనుగ్రహించునది


గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా |
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా || 107 ||
గ్రహ విద్యాత్మికా           – గ్రహాలకు సంబంధించిన విద్య కూడా అమ్మ స్వరూపమే
జ్యోతిః                       – వెలుగునిచ్చునది
జ్యోతిర్విత్                  – జ్యోతిష్య శాస్త్రమును ఎరిగినది
మతిజీవికా                 – అన్ని జీవులకు వారి జీవితాన్ని నడిపించడంలో సహాయం చేయునది
బ్రహ్మాండ గర్భిణీ           – విశ్వాన్ని తన గర్భంలో ఉంచుకునేది
బాలా                       – ఆడపిల్ల, బాలా త్రిపుర సుందరి
సప్తావరణ దేవతా         – శ్రీచక్రంలోని ఏడు ఆవరణల దేవతల స్వరూపం

వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా |
బగలా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా || 108 ||
వైరాజోత్తమ సామ్రాజ్యా   – ప్రపంచాన్ని పాలించునది
కుమార కుశలోదయా    – జనులకు క్షేమమును కలిగించునది
బగళా                       – దశమహా విద్యలలోని దేవత, శత్రునాశిని
భ్రమరాంబా                – శ్రీశైల మల్లిఖార్జున స్వామి భార్య 
శివదూతి                   – శివుడిని దూతగా పంపినది
శివాత్మిక                             – శివుని ఆత్మ, శివ స్వరూపము

మేరువింధ్యాదిసంస్థానా కాశ్మీరపురవాసినీ |
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా || 109||
మేరువింధ్యాదిసంస్థానా  – మేరు మరియు వింధ్య వంటి పర్వతాలలో ఉండునది
కాశ్మీరపుర వాసినీ        – కాశ్మీర దేశములోని శారదా పీఠములో ఉండునది
యోగ నిద్ర                 – యోగ నిద్రా స్వరూపిణి
మహా నిద్రా                 – మహా నిద్రా స్వరూపిణి
వినిద్రా                      – సృష్టి నిలిచి ఉన్నంత వరకు కన్ను మూయనిది
రాక్షసాశ్రితా                 – రాక్షసులు కూడా ఆశ్రయించునది


సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః |
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిః శివా || 110 ||
సువర్ణదా         – బంగారం, సంపదను ప్రసాదించునది
మహాగంగ        – పుణ్య గంగా స్వరూపిణి
పంచాఖ్యా        – పంచభూతముల స్వరూపిణి
పంచసంహతి    – పంచభూతములతో కూడిన ప్రకృతి స్వరూపిణి
సుప్రజాతా        – మంచి పుట్టుక కలది
సువీరా           – గొప్ప పరాక్రమం కలది
సుపోషా          – జనులను పోషించునది
సుపతి            – మంచి భర్త కలది
శివా               – శివుని భార్య

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top