శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 141-154 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే |
మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా || 141 ||
కోటిబ్రహ్మాది సంసేవ్యా – కోట్ల కొలది బ్రహ్మాది దేవతలచే సేవింపబడు తల్లి
కోటి రుద్రాది కీర్తితా – కోట్లాది రుద్రులచే కీర్తింపబడునది
మాతులుంగ మయం ఖేటం బిభ్రతీ – మాదీఫల వృక్షములుండే స్థలములో నివాసముండునది
సౌవర్ణ చషకం తథా – బంగారు పాన పాత్రను పట్టుకున్నది
పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే |
పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికామ్ || 142 ||
పద్మద్వయం బిభ్రతీ – రెండు చేతులలో రెండు తామర పువ్వులను ధరించినది
పూర్ణ కుంభం బిభ్రతీ – పూర్ణ కుంభమును ధరించినది
కీరం బిభ్రతీ – చేతిలో చిలుకను ధరించినది
వరదాభయే బిభ్రతీ – వరద హస్తమును, అభయ హస్తమును ధరించినది
పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికాం
– పాశం, అంకుశం, శంఖం, చక్రం, త్రిశూలం మరియు ఖడ్గాన్ని ధరించినది
ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ |
అష్టాదశభుజే లక్ష్మీర్మహాష్టాదశపీఠగే || 143 ||
ధనుర్బాణౌ చ అక్షమాలాం చిన్ముద్రా మపి భిభ్రతి
– విల్లు, బాణం, రుద్రాక్షమాల, జ్ఞానముద్రను ధరించినది
అష్టాదశ భుజాలక్ష్మి – పద్దెనిమిది చేతులు గల లక్ష్మి
మహాష్టాదశ పీఠగా – పద్దెనిమిది శక్తి పీఠాలలో వెలసిన తల్లి
భూమినీళాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని |
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే || 144 ||
భూమి నీళాది సంసేవ్యే – భూదేవి, నీళాదేవిచే సేవించబడునది
స్వామి చిత్తానువర్తినీ – భర్త కోరిక మేరకు నడుచుకునేది
పద్మా – కమలములో ఉన్న లక్ష్మిదేవి
పద్మాలయా – కమలములో నివసించేది
పద్మీ – పద్మములను ఇష్టపడునది
పూర్ణకుంభాభిషేచితా – బంగారు కలశములోని ఆకాశ గంగచే
అభిషేకించబడునది
ఇందిరేందీవరాభాక్షి క్షీరసాగరకన్యకే |
భార్గవి త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః || 145 ||
ఇందిరా – గొప్ప ఐశ్వర్యవంతురాలు
ఇందీవరాభాక్షి – తుమ్మెదరెక్కల వంటి నల్లని కనురెప్పలు కలది
క్షీరసాగర కన్యకా – పాల సముద్రం నుండి ఉద్భవించిన కన్యకా
భార్గవీ – భృగు మహర్షి కుమార్తె
స్వతంత్రేఛ్చా – స్వతంత్రమైన ఇఛ్చా శక్తి కలది
వశీకృత జగత్పతి – తన అనుకూల ప్రవర్తనతో, ప్రేమతో భర్తను వశీకరించుకున్నది
మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవతా |
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతమ్ || 146 ||
మంగళం మంగళానాం – శుభములలోకెల్లా శుభమైనది
దేవతానాం చ దేవతా – దేవతలందరికీ దేవత
ఉత్తమోత్తమా – ఉత్తమమైన వారిలో ఉత్తమమైనది
శ్రేయ – శ్రేష్టమైనది, గొప్ప కీర్తి కలది
పరమామృతమ్ – అమృత స్వరూపిణి, మోక్ష లక్ష్మి
ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా |
ఆందోళికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః || 147 ||
ధనధాన్యాభివృద్ధి – ధన ధాన్యములను వృద్ధి చేయునది
సార్వభౌమ సుఖోఛ్చ్రయా – సార్వభౌములకు సుఖ సంతోషములను ఇచ్చు తల్లి
ఆందోళికాది సౌభాగ్యా – సౌభాగ్యమును సూచించునది
మత్తేభాది మహోదయా – మదించిన దిగ్గజములపై ఆధిపత్యము గలది
పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికమ్ |
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి || 148 ||
పుత్రపౌత్రాభివృద్ధి విద్యాభోగ బలాధికా
– పుత్రులను, పౌత్రులను అభివృద్ధి గావించి, విద్య, భోగము, బలము ప్రసాదించునది
ఆయురారోగ్య సంపత్తి – దీర్ఘాయువు, ఆరోగ్యం, సంపదలను ప్రసాదించునది
అష్టైశ్వర్యా – అష్టైశ్వర్యములను ప్రసాదించునది
పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరా గతిః |
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః || 149||
పరమేశ విభూతి – పరమేశ్వరుని శక్తి, సంపద
సూక్ష్మాత్ సూక్ష్మతరా – సూక్షము కన్నా సూక్ష్మమైనది
గతిః – భక్తులకు తానే గతి అయినది
సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి
– తన దయాదృష్టితో బ్రహ్మేంద్రాదులకు పదవులను ప్రసాదించినది
అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః |
సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి || 150 ||
అవ్యాహత మహాభాగ్యా – తరగని సంపద కలిగినది
అక్షోభ్య విక్రమా – ఎప్పటికీ తగ్గని పరాక్రమం కలది
సమన్వయా వేదానామవిరోధా త్వమేవ హి
– వేదములకు సమన్వయమును కూర్చునది, వైదికులకు అనుకూలమై ఉండునది
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ |
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ || 151 ||
నిశ్శ్రేయస పదప్రాప్తి సాధనా ఫలమేవ చ – మోక్ష ప్రాప్తికి సాధనమైనది, మోక్షమును కలిగించునది
శ్రీమంత్ర రాజరాజ్ఞీ – శ్రీమంత్రరాజమునకు ప్రధాన దేవత
శ్రీవిద్యా – శ్రీ విద్యా స్వరూపిణి
క్షేమకారిణి – సౌఖ్యాన్ని అనుగ్రహించేది
శ్రీంబీజజపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా |
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ || 152 ||
శ్రీంబీజజప సంతుష్టా – శ్రీం అనే మూలాధారాన్ని జపించడం వల్ల సంతోషించునది
ఐం, హ్రీం, శ్రీం బీజపాలికా – ఐం, హ్రీం, శ్రీం బీజములకు పాలకురాలు
ప్రపత్తి మార్గ సులభా – భక్తిమార్గంలో శరణాగతి చేయువారిని అనుగ్రహించునది
విష్ణు ప్రథమ కింకరీ – శ్రీమహా విష్ణువుకు మొదటి సేవకురాలు
క్లీంకారార్థసవిత్రీ చ సౌమంగల్యాధిదేవతా |
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ || 153 ||
క్లీంకారార్థ సవిత్రీ – క్లీంకారము యొక్క అర్ధము తానైనది
సౌమంగల్యాది దేవతా – స్త్రీలకు సుమంగళీత్వమును ప్రసాదించు దేవత
శ్రీషోడశాక్షరీవిద్యా – 16 అక్షరముల విద్యా జ్ఞాన స్వరూపిణి
శ్రీయంత్ర పురవాసినీ – శ్రీచక్రమను పురమున నివసించు లలితాంబ
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే || 154 ||
సర్వ మంగళ మాంగళ్యా – అన్ని మంగళములకంటే మంగళమైనది
శివే – శివుని భార్య
సర్వార్థ సాధికా – సమస్త ప్రయోజనములను తన భక్తులకు సాధించిపెట్టు తల్లి
శరణ్యా – అందరికీ రక్షణనిచ్చు తల్లి
త్ర్యంబకా – మూడు కన్నులు కలది
గౌరీ – గౌర వర్ణము గలది
నారాయణీ – నారాయణుని శక్తి
నమోస్తుతే – నీకు వందనం.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




