లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 Lalitha Sahasra namam meaning in telugu 

lalitha sahasranamam meaning in telugu
lalitha sahasranamam meaning in telugu
చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥
చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణి
ప్రేమరూపా : ప్రేమమూర్తి
ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
నామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
నందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము
నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి
మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥
మిథ్యాజగదధిష్ఠానా :మాయాజగత్తునందు చైతన్యరూపిణియై ఉండునది
ముక్తిదా : విముక్తినిచ్చునది
ముక్తిరూపిణీ : మోక్షరూపిణి
లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
లయకరీ : జగత్తును లయము చేయునది
లజ్జా : లజ్జాస్వరూపిణి
రంభాది వందితా :రంభ మొదలైన అప్సరసలచే నమస్కారములు అందుకొనునది
భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా ।
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా ॥ 143 ॥
భవదావ సుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
పాపారణ్యదవానలా : పాపములు అనే అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది
భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకి ఘనాఘనా ।
రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా ॥ 144 ॥
భాగ్యాబ్ధి చంద్రికా : సంపద అనే సముద్రమునకు వెన్నెల వంటిది
భక్తచిత్త కేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
రోగపర్వతదంభోళిః : పర్వతములవంటి రోగములకు వజ్రాయుధము వంటిది
మృత్యుదారు కుఠారికా : మృత్యువనే వృక్షమునకు గొడ్డలి వంటిది
మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా ।
అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ ॥ 145 ॥
మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు
మహాకాళీ : కాళికా దేవి రూపము దాల్చినది
మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
మహాశనా : లయకారిణి
అపర్ణా : పార్వతీ దేవి
చండికా : అసురుడైన చండుడిని సంహరించిన చండీ దేవి స్వరూపిణి
చండముండాసుర నిషూదిని : చండుడు, ముండుడు అనే రాక్షసులను సంహరించినది
క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ ।
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా ॥ 146 ॥
క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూ తానే రూపంగా ఐనది
సర్వలోకేశీ : అన్ని లోకములకు అధీశ్వరి
విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
త్రివర్గదాత్రీ : ధర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
సుభగా : సౌభాగ్యవతి
త్ర్యంబకా : మూడు కన్నులు కలది
త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది.
స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ।
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147 ॥
స్వర్గాపవర్గదా : స్వర్గమును అపవర్గమును (అనగా మోక్షమును) ప్రసాదించునది.
శుద్ధా : మలినము లేనిది, పవిత్రమైనది.
జపాపుష్ప నిభాకృతిః : మందార పువ్వు వంటి ఛాయ కలిగినది.
ఓజోవతీ : ఓజస్సు కలిగినటువంటిది.
ద్యుతిధరా : శోభించునది.
యజ్ఞరూపా : యజ్ఞమును తన రూపముగా కలిగినది.
ప్రియవ్రతా : సంకల్ప నిష్ఠలతో కూడిన వ్రతముల యందు ప్రీతి కలిగినది.
దురారాధ్యా, దురాదర్షా, పాటలీ కుసుమప్రియా ।
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148 ॥
దురారాధ్యా : (ఇంద్రియ నిగ్రహం లేని యెడల) దుర్గమమైన ఆరాధన కలది.
దురాధర్షా : (శుద్ధమైన భక్తిచే తప్ప) నియంత్రించ లేనిది
పాటలీ కుసుమప్రియా : పాటలీ పుష్పం (పాదిరి పువ్వు) పట్ల ప్రీతి కలది.
మహతీ : అందరికన్నా, అన్నిటికన్నా గొప్పనైనది.
మేరునిలయా : మేరు పర్వత నివాసిని
మందార కుసుమప్రియా : మందార పుష్పముల యందు ప్రీతి కలిగినది.
వీరారాధ్యా, విరాడ్రూపా, విరజా, విశ్వతోముఖీ ।
ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 149 ॥
వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబడునది
విరాడ్రూపా : అన్నింటికీ మూలమైనది
విరజా : రజోగుణము లేనిది
విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
ప్రాణదా : సర్వజగత్తుకూ ప్రాణమును ఇచ్చునది
ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది
మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 150 ॥
మార్తాండభైరవారాధ్యా :మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
మంత్రిణీ : శ్యామలాదేవి
న్యస్తరాజ్యధూ : రాజ్యాధికారము ఇచ్చునది
త్రిపురేశీ : త్రిపురములకు అధికారిణి
జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
నిస్త్రైగుణ్యా :త్రిగుణాతీతురాలు
పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది
సత్యజ్ఞానాఽనందరూపా, సామరస్య పరాయణా ।
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ ॥ 151 ॥
సత్య ఙ్ఞానానంద రూపా :సచ్చిదానందరూపిణీ
సామరస్య పరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
కపర్దినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారి అయిన శివునకు కపర్ది అను పేరు కలదు)
కళామాలా : కళల యొక్క సమూహము
కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
కామరూపిణీ : కోరిన రూపము ధరించునది
కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః ।
పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా ॥ 152 ॥
కళానిధి: కళలకు నిధి వంటిది
కావ్యకళా : కవితారూపిణి
రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
రసశేవధి: రసమునకు పరాకాష్ట
పుష్టా : పుష్ఠి కలిగించునది
పురాతనా : అనాదిగా ఉన్నది
పూజ్యా : పూజింపదగినది
పుష్కరా : పుష్కర (కమల) రూపిణి
పుష్కరేక్షణా : కమలము వంటి (విశాలమైన) కన్నులు కలది.
పరంజ్యోతిః, పరంధామ, పరమాణుః, పరాత్పరా ।
పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ ॥ 153 ॥
పరంజ్యోతి: దివ్యమైన వెలుగు
పరంధామ :శాశ్వతమైన స్థానము కలిగినది
పరమాణు: :అత్యంత సూక్ష్మమైనది
పరాత్పరా :సమస్తలోకములకు పైన ఉండునది
పాశహస్తా :పాశమును హస్తమున ధరించినది
పాశహంత్రీ :జీవులను సంసార బంధము నుండి విడిపించునది
పరమంత్ర విభేదినీ :శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది.
మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥
మూర్తామూర్తా :రూపం కలది, రూపం లేనిది రెండూ తానే ఐనది
నిత్యతృప్తా :ఎల్లప్పుడూ తృప్తితో ఉండునది
మునిమానస హంసికా :మునుల మనస్సులనే సరస్సులందు విహరించే హంసరూపిణి
సత్యవ్రతా :సత్యమే వ్రతముగా కలిగినది
సత్యరూపా :సత్యమే రూపముగా కలిగినది
సర్వాంతర్యామినీ :సృష్టి అంతటా వ్యాపించినది
సతీ :దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి అయిన సతీదేవి.
బ్రహ్మాణీ, బ్రహ్మజననీ, బహురూపా, బుధార్చితా ।
ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155 ॥
బ్రహ్మాణీ :సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)
బ్రహ్మజననీ :బ్రహ్మదేవుడిని సృష్టించినది
బహురూపా :సమస్త రూపములు తానై ఉన్నది
బుధార్చితా :ఙ్ఞానులచే పూజింపబడునది
ప్రసవిత్రీ :జగజ్జనని
ప్రచండాఙ్ఞా :తీవ్రమైన ఆఙ్ఞ కలది
ప్రతిష్ఠా :కీర్తియే రూపముగా కలిగినది
ప్రకటాకృతి: :బహిరంగమైన ఆకారము కలిగినది
ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ ।
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156 ॥
ప్రాణేశ్వరీ :ప్రాణములకు అధీశ్వరి
ప్రాణదాత్రీ :ప్రాణములు ఇచ్చునది
పంచాశత్పీఠ రూపిణీ :శక్తిపీఠముల రూపమున వెలసినది
విశృంఖలా :యధేచ్ఛగా ఉండునది
వివిక్తస్థా :ఏకాంతముగా ఉండునది
వీరమాతా :వీరులకు తల్లి
వియత్ప్రసూ: :ఆకాశమును సృష్టించినది
ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ ।
భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ॥ 157 ॥
ముకుందా :విష్ణు రూపిణీ
ముక్తినిలయా :ముక్తికి స్థానమైనది
మూలవిగ్రహ రూపిణీ :అన్నింటికీ మూలమైనది
భావఙ్ఞా :సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
భవరోగఘ్నీ :జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
భవచక్ర ప్రవర్తినీ :లోకచక్రమును నడిపించునది.
ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158 ॥
ఛందః సారా :వేదముల సారము
శాస్త్రసారా :వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
మంత్రసారా :మంత్రముల యొక్క సారము
తలోదరీ :పలుచని ఉదరము కలిగినది
ఉదారకీర్తి :గొప్ప కీర్తి కలిగినది
రుద్దామవైభవా :అధికమైన వైభవము కలిగినది
వర్ణరూపిణీ :అక్షరరూపిణి
జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ ।
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159 ॥
జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినీ :చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చునది.
సర్వోపనిషదుద్ఘుష్టా :అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
శాంత్యతీత కళాత్మికా :శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి
గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా ।
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా ॥ 160 ॥
గంభీరా :లోతైనది
గగనాంతస్థా :ఆకాశమునందు ఉండునది
గర్వితా :గర్వము కలిగినది
గానలోలుపా :సంగీతమునందు ప్రీతి కలిగినది
కల్పనారహితా :ఎట్టి కల్పన లేనిది
కాష్ఠా :కాలపరిగణనలో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
కాంతా :కాంతి కలిగినది
కాంతార్ధ విగ్రహ :కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము
Tags: , , , , , , , , , ,